...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకు 4 లక్షలు ఇచ్చిన రోహిణి- ప్రభావతికి అమ్మవారి గాజులు- మీనాకు సత్యం అన్యాయం

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 8 ఎపిసోడ్‌లో గుడిలో ప్రభావతిని శ్రుతి తల్లి శోభన అవమానిస్తుంది. తర్వాత ప్రభావతి చేతికి గాజులు లేకపోవడం చూసిన పంతులు అమ్మవారి గాజులు తీసుకొచ్చి ఇస్తాడు. ఇంటికి వచ్చిన రోహిణి బాలును పిలిపించి నాలుగు లక్షలు ఇస్తుంది. అవి తన తండ్రి పంపించాడని చెబుతుంది.

Published on: Dec 8, 2025, 07:58:44 IST
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో ప్రభావతిని కలిసి శ్రుతి తల్లి శోభన బంగారు గాజుల గురించి అడుగుతుంది. స్నానానికి వెళ్లేటప్పుడు దిండు కింద పెట్టి మర్చిపోయావా అని కామాక్షి ఐడియా ఇస్తుంది. దానికి అవును అలాగే మర్చిపోయా అని ప్రభావతి అంటుంది.

మీకంటే చిన్నదాన్నిగా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 8 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 8 ఎపిసోడ్‌

మీకు మతిమరుపు ఉందా. వయసు అయిపోతుందిగా. మరికొన్ని రోజుల్లో పళ్లు కూడా ఊడిపోతాయ్ అని శోభన అంటుంది. మీరు నన్ను బలవంతంగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తున్నారు అని ప్రభావతి అంటుంది. మీకు ముగ్గురు కోడళ్లు. మీ చిన్న కోడలు నా కూతురు. మీకన్నా చిన్నదాన్ని అని శోభన అంటే.. శ్రుతి తర్వాత మరో ఇద్దరిని కనేంత చిన్నది పాపం అని సెటైర్లు వేస్తుంది కామాక్షి.

ఆవిడకు కూడా మతి మరుపు వచ్చినట్టుంది. గుడికి వచ్చిన విషయం మర్చిపోయి సోది పెడుతుందని మళ్లీ సెటైర్లు వేస్తుంది కామాక్షి. దాంతో ప్రభావతిని అవమానించి శోభన వెళ్తుంది. తర్వాత పంతులు వచ్చి ప్రభావతి చేతికి గాజులు లేకపోవడం చూసి మీరు పుణ్యస్త్రీయే కదా. గాజులు ఎందుకు వేసుకోలేదు. మనవళ్లను ఎత్తుకునే వయసులో ప్యాషనా అని అంటాడు.

లోపలికి వెళ్లి వచ్చి అమ్మవారి గాజులు ఇస్తాడు పంతులు. బోసిగా ఉండకండి అంటాడు పంతులు. తర్వాత కామాక్షిని ప్రభావతి అంటే నీకోసం కంగారుపడిన నాదే తప్పంటావా అని ప్రభావతిని వదిలేసి వెళ్లిపోతుంది. చేతిలో రూపాయి లేదు ఆటోకు ఎలా అనుకున్న ప్రభావతి వస్తున్నా అంటూ బయలుదేరుతుంది.

సత్యం క్షమాపణలు

మీనా విషయంలో నాదే పొరపాటు. ఈ ఇంటికి కోడలిగా మీనాను తీసుకొచ్చి ఒకరకంగా అన్యాయమే చేశాను అని ఫీల్ అవుతాడు సత్యం. మీరు నా జీవితాన్ని నిలబెట్టారు మావయ్య. మీరెప్పుడు అలా అనుకోకండి. కొడుకుపై ప్రేమతోనే అత్తయ్య అలా చేశారుగా. క్షమించండి అని మీనా అంటుంది. అన్ని తెలిసి కూడా మీ అమ్మ, మా అమ్మ మీద నిందలు వేసినప్పుడే దాని వ్యక్తిత్వం అర్థమైందని సత్యం అంటాడు.

ప్రభావతిని క్షమించలేనని సత్యం అంటాడు. ఆ మాటలు విన్న ప్రభావతి మీనాను మనసులో నిందిస్తుంది. ప్రభావతి లోపలికి వస్తుంది. నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. ఈ దుష్ట శక్తి పోతే అది వస్తుందని సత్యం అంటాడు. మీరేం ఐదు ఇళ్లు కట్టించలేదు. ఇది నా ఇల్లు. ఎక్కడికి పోతాను అని ప్రభావతి అంటే.. పైన గదిలో ఉంటాను. కాఫీ తీసుకురా మీనా అని సత్యం వెళ్లిపోతాడు.

బాలు, మీనా రొమాన్స్

తర్వాత రాత్రి డాబా పైన మీనా పక్క వేస్తుంది. మీనాను పొగుడుతాడు బాలు. మనకు కూడా ఇలాంటి గొడవ వస్తే ఏం చేస్తారు అని మీనా అడిగితే.. బాలు పైకి వెళ్తాడు. దాంతో అటు ఇటు పరుగెత్తుతుంది మీనా. బాలు ఆపుతాడు. ఏంటీ ఏదో డేంజర్ లైట్ వెలుగుతుందంటుంది మీనా వెళ్లిపోతుంటే దగ్గరికి లాక్కుంటాడు బాలు. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు.

మరుసటి రోజు ఉదయం వంటింట్లో పూరీలు చేస్తుంది మీనా. ప్రభావతి వచ్చి మొహమంతా సంతోషంతో వెలిగిపోతుంది. మా ఆయనతో గొడవలు పెట్టి తృప్తిగా ఉన్నావని తిడుతుంది ప్రభావతి. ఇంట్లో అంతా అదోలా ఉన్నారు. అందరికి ఇష్టమైన పూరీలు చేస్తే అంతా తృప్తిగా తింటారని ఆయన చేయమంటే చేస్తున్నా అని మీనా అంటుంది.

నువ్వు తేనేపూసిన కత్తివని నాకు తెలుసు అని ప్రభావతి అంటుంది. రోహిణి, మనోజ్ వెళ్తుంటే పూరి చేశాను. వచ్చి తినమంటుంది మీనా. బయట తింటాం అని కోపంగా చెబుతుంది రోహిణి. ఎప్పటివరకు తింటారని మీనా అంటే.. డబ్బులు ఇచ్చేంత వరకు అని రోహిణి అంటుంది. ఎప్పుడు ఇస్తారు. అసలు మీకు అయినా తెలుసా. ఎందుకు పట్టింపులు. వచ్చి తినండి అని మీనా అంటుంది.

జైలులో ఉన్నారుగా

అయినా రోహిణి వినదు. మనోజ్, రోహిణి, ప్రభావతి ముగ్గురుకి కలిపి ఇచ్చి పడేస్తుంది మీనా. తర్వాత ఇంటికి వచ్చిన రోహిణి బాలును పిలిచి నాలుగు లక్షలు ఇస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిది అని ప్రభావతి అడిగితే.. మా నాన్న పంపించారని రోహిణి చెబుతుంది. మీ నాన్న జైలులో ఉన్నారుగా అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe