గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో ప్రసాదాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తారు. మీనా ఇంకా రాకపోవడంపై శివ కోప్పడుతాడు. మీనాకు కాల్ చేస్తుంది పార్వతి. కచ్చితంగా రావాలా అని మీనా అంటే.. నువ్వేగా వండాలి అని పార్వతి అంటుంది. ఆయన రానన్నారు అని మీనా చెబుతుంది.
బాలు పర్మిషన్ కావాలా

నువ్వు వస్తేనే శివ ఉంటానంటున్నాడు అని శివకు ఫోన్ ఇస్తుంది పార్వతి. మీ ఆయన రావద్దంటున్నాడా. నువ్వు వస్తేనే నేను ఉంటా. లేకపోతే వెళ్తా. నాకోసం ఎవరు ఆపిన ఆగొద్దు అని శివ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు మీనాతో శ్రుతి చెబుతుంది. శివ పుట్టినరోజు, ప్రసాదాలు పంచిపెట్టడం గురించి, బాలు వద్దనడం గురించి చెబుతుంది మీనా.
నీ పుట్టింటికి వెళ్లడానికి బాలు పర్మిషన్ కావాలా. పుట్టింటి వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేదనుకుంటే వెళ్లు అని శ్రుతి అంటుంది. దాంతో మీనా వెళ్లడానికి రెడీ అవుతుంది. అదంతా చూసిన ప్రభావతి వాడి మాట కాదని ఇది వెళ్తుంది. నగలు దొరికినప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు నాకు మంచి భోజనం దొరికింది ఆహా అని అనుకుంటుంది ప్రభావతి.
గుడికి మీనా వెళ్తుంది. శివ ఎమోషనల్ అవుతాడు. గొప్ప స్థాయిలో ఉండాలని, బర్త్ డే విషెస్ చెబుతుంది మీనా. మీనా దిగులుగా ఉంటే పార్వతి అడుగుతుంది. బాలుకు చెప్పకుండా వచ్చానని చెబుతుంది మీనా. ఏదైన గొడవ అవుతుందేమో అని పార్వతి అంటే.. అది నేను చూసుకుంటాను. ముందు శివ పేరు మీద అర్చన చేపిద్దామని మీనా అంటుంది.
ఎక్కించిన ప్రభావతి
మరోవైపు మీనాను ఇంట్లో పిలుస్తాడు బాలు. ఇంట్లో లేదని ప్రభావతి చెబుతుంది. మీనాకు బాలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. మీనా తమ్ముడి పుట్టినరోజు జరుపుకోడానికి గుడికి వెళ్లింది కదా అని ప్రభావతి నిజం చెబుతుంది. సందు దొరికితే చాలు నిందలు వేస్తావు. తను నా మాట జవదాటదు అని బాలు అంటాడు. నీ చెవిలో పూలు పెట్టి వెళ్లిందిరా. నేను నా కళ్లతో చూశానుగా. కావాలంటే గుడికి వెళ్లి చూడు తెలుస్తుందిగా అని ప్రభావతి ఎక్కించి చెబుతుంది.
{{/usCountry}}మరోవైపు మీనాను ఇంట్లో పిలుస్తాడు బాలు. ఇంట్లో లేదని ప్రభావతి చెబుతుంది. మీనాకు బాలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. మీనా తమ్ముడి పుట్టినరోజు జరుపుకోడానికి గుడికి వెళ్లింది కదా అని ప్రభావతి నిజం చెబుతుంది. సందు దొరికితే చాలు నిందలు వేస్తావు. తను నా మాట జవదాటదు అని బాలు అంటాడు. నీ చెవిలో పూలు పెట్టి వెళ్లిందిరా. నేను నా కళ్లతో చూశానుగా. కావాలంటే గుడికి వెళ్లి చూడు తెలుస్తుందిగా అని ప్రభావతి ఎక్కించి చెబుతుంది.
{{/usCountry}}మరోవైపు అందరికి గుడిలో ప్రసాదాలు పంచి పెడతారు. మీనా వెళ్తానంటుంది. ఆయనకు చెప్పకుండా వచ్చాను పద్ధతి కాదని తెగ భయపడుతుంది మీనా. ఇంతలో బాలు వస్తాడు. మీనాను ఇంకొంచెం సేపు ఉండమని పార్వతి అంటుంది. మీనా ప్రసాదాలు పంచి పెడుతుంది. ఆ ప్రసాదాన్ని తీసుకునేందుకు బాలు చేయి చాపుతాడు. బాలును చూసి మీనా షాక్ అవుతాడు.
నా పేరు బాలు అని బాలు అంటే.. ఇవాళ శివ పుట్టినరోజు అని మీనా అంటుంది. అంటే నేను పోయిన రోజా అని బాలు అంటాడు. ఏంటండి ఆ మాటలు అని మీనా హో.. నా మాట పోయిన రోజా అని బాలు అంటాడు. నేను ప్రసాదం కోసం రాలేదు. నిజం తెలుసుకునేందుకు వచ్చాను. నేను ఎంత చేసిన మీరు మీరు ఒకటి. భర్త మాట కంటే రౌడీల తిరిగే తమ్ముడు ఎక్కువైనందుకు సంతోషంగా ఉందని బాలు అంటాడు.
బాలును పంపించింది నేనే
ఉండు ఇక్కడే సంతోషంగా ఉండు. నేను వద్దన్న వచ్చిందిగా అని బాలు కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత శివ పుట్టినరోజు అని సత్యంకు ప్రసాదం ఇస్తుంది. ప్రభావతికి ఇస్తే మీరు ఏది పెట్టిన నాకు విషంతో సమానం. దాంట్లో మీరు ఏం కలిపారో ఏం తెలుసు అని అంటుంది. బాలు గాడు గుడికి వచ్చినట్లు ఆయనతో చెబుతున్నావ్. మరి అక్కడ ఏం జరిగిందో చెప్పలేదు. నువ్వు గుడికి వెళ్లిన విషయం చెప్పింది నేనే. కానీ, వాడు నమ్మలేదు. పిచ్చి భ్రమలో ఉన్నావని నేనే పంపించాను అని ప్రభావతి చెబుతుంది.
ఇదంతా చేసింది మీరా అని ఎమోషనల్‌గా అంటుంది. ఇదే కాదు. నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోయేదాకా నేను ఇలాగే చేస్తుంటాను. లెక్కపెట్టుకో. రోజులు లెక్కపెట్టుకో. నువ్వు తొందర్లోనే ఇంట్లోంచి వెళ్లిపోబోతున్నావ్ అని ప్రభావతి అంటుంది. దానికి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రుతి వచ్చి బాలు గొడవ చేశాడా అని అడిగితే లేదని అబద్ధం చెబుతుంది మీనా.
ఇప్పుడు ఆయన వచ్చి ఎంత రాద్ధాంతం చేస్తాడో అని మీనా అనుకుంటుంది. రాత్రి బాలు తాగి వస్తాడు. మగాన్ని భార్య కాదు బారు అర్థం చేసుకుంటుంది అని బాలు అంటాడు. మీరు ఇలా తాగితే భార్యగా నాకు ఎలా ఉంటుంది అని మీనా అంటుంది. భార్య అంటే పుట్టింట్లో భర్త గౌరవం పోగొట్టేది కాదు. అయినా నీకు నేను ఏమవుతాను. నువ్వు దాటెళ్లింది గడపను కాదు నా గుండెను అని బాలు అంటాడు.
తాగుతూనే ఉంటాను
ఒక ఆడదానికి పెళ్లి అయితే పుట్టిల్లు మర్చిపోవాలా అని మీనా అంటుంది. ఇన్నాళ్లు నీకోసమే ఆలోచించాను. నీ నాట మీద తాగలేదు. ఇకనుంచి నేను తాగుతూనే ఉంటాను అని బాలు అంటాడు. అలా బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టి విడిపోయేలా చేస్తుంది అత్త ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.