గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాకు, రోహిణికి బుద్ధి చెప్పకపోతే రోహిణికి కూడా అలుసు అయిపోతాను అని ప్రభావతి అనుకుంటుంది. ఇంతలో మీనా వస్తుంది. ప్రభావతి అరుస్తుంది. అచ్చం బాలు అన్నట్లుగానే ప్రభావతి తిట్టడంతో మీనా నవ్వుతుంది.
చిటికలో నయం అవుతుంది

నా వల్లే మీకు ఇలా అయిందని నాకు అనిపిస్తుంది. మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాపుడం పెడితే చిటికలో నయం అవుతుంది అని మీనా అంటుంది. కానీ, ప్రభావతి వద్దంటుంది. ఇక్కడ పెడుతున్నాను. మీరే పెట్టుకోండి అని మీనా వెళ్లిపోతుంది. ప్రభావతి కాపుడం పెట్టుకుంటుంది. అది మీనా చూసి నవ్వుకుంటుంది. కాసేపు కాపుడం పెట్టుకున్నాక నీళ్లు చల్లారిపోయాయని ప్రభావతి వంటింట్లోకి వెళ్తుంది.
కషాయం తాగితే నొప్పి పోతుందని, దినుసుల కోసం వంట గదిలో సజ్జ పైకి ఎక్కి చూస్తుంది మీనా. ఇంతలో మీనా కాలు జారడంతో కారం, పిండి ప్రభావతిపై పడతాయి. మీనాను బాలు వచ్చి పట్టుకుంటాడు. ప్రభావతిని చూసి దెయ్యం అని అరుస్తారు. మనోజ్ కూడా చూసి దెయ్యం అని పారిపోతాడు. పాన్ తీసుకుని హాల్లోకి వస్తుంది ప్రభావతి.
తనను చూసి అంతా దడుసుకుంటారు. తనను చూసి కోప్పడుతున్న ప్రభావతి మరింత ఊగిపోతుంది. ఇంట్లోంచి ఈ దెయ్యాను గెంటేద్దాం అని రోహిణి అంటుంది. తర్వాత నేనే ప్రభావతిని. ఈ రాక్షసి నా మీద పిండి, కుంకుమ పడేలా చేసిందని ప్రభావతి అంటుంది. ఆంటీ దెయ్యం అయితే ఇలాగే ఉంటుందా అని శ్రుతి అంటుంది.
రంగులు మార్చే దెయ్యం
నువ్వేందుకు మీనా ఎక్కిన స్టూల్ తన్నావ్ అని బాలు అంటాడు. నా చేయి తగిలి అవి పడ్డాయని మీనా అంటుంది. అంత మాత్రానా మా అమ్మ మీద పిండి పోస్తావా. దిష్టిబొమ్మలా ఉందని మనోజ్ అంటే లేదు దెయ్యంలా ఉన్నారని రోహిణి అంటుంది. శ్రుతి సెల్ఫీలు తీస్తుంది. రంగులు మార్చే దెయ్యం అని రాస్తావా అని బాలు అంటాడు. ప్రభావతి మరింతగా కోపంతో ఊగిపోతుంది.
{{/usCountry}}నువ్వేందుకు మీనా ఎక్కిన స్టూల్ తన్నావ్ అని బాలు అంటాడు. నా చేయి తగిలి అవి పడ్డాయని మీనా అంటుంది. అంత మాత్రానా మా అమ్మ మీద పిండి పోస్తావా. దిష్టిబొమ్మలా ఉందని మనోజ్ అంటే లేదు దెయ్యంలా ఉన్నారని రోహిణి అంటుంది. శ్రుతి సెల్ఫీలు తీస్తుంది. రంగులు మార్చే దెయ్యం అని రాస్తావా అని బాలు అంటాడు. ప్రభావతి మరింతగా కోపంతో ఊగిపోతుంది.
{{/usCountry}}తర్వాత ప్రభావతి స్నానం చేసి వస్తుంది. రోహిణి వెళ్లి మీనా, శ్రుతి గురించి చాడీలు చెబుతుంది రోహిణి. దిష్టి బొమ్మలా ఉన్న మా ఆంటీ అని క్యాప్షన్ పెట్టిందని శ్రుతి ఫొటో పెట్టడం గురించి చెబుతుంది రోహిణి. శ్రుతి ముందు ఇలా లేదు. మీనాతో చేరి ఇలా అయిందని రోహిణి ఎక్కిస్తుంది. దీనికి ముగింపు పలకాలి అని ప్రభావతి అంటుంది.
డ్యాన్స్ స్కూల్‌కు ప్రభావతి, రోహిణి వెళ్తారు. అక్కడ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తారు పిల్లలు. ప్రభావతి వచ్చి కుప్పిగంతులు ఏంటీ అని సరైన క్లాసికల్ డ్యాన్స్ చెబుతుంది ప్రభావతి. శ్రుతికి మీనా ట్రైనింగ్ ఇచ్చి నా మీద రెచ్చగొడుతుంది అని ప్రభావతి అంటుంది. కామాక్షి సెటైర్లు వేస్తుంది. నా చేతికి మట్టి అంటకుండా ఏం చేస్తానో చూడు అని ప్రభావతి అంటుంది.
ఒకే రూమ్‌లో లవర్స్
ఇంతలో శ్రుతి తల్లి శోభ వస్తుంది. స్టూడెంట్స్ బాగానే వస్తున్నారని శోభ అంటుంది. పిల్లలను విశ్రాంతి తీసుకోమ్మని ప్రభావతి చెబుతుంది. దాంతో స్టూడెంట్స్‌లోని లవర్స్ ఇద్దరు ఒక రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంటారు. ఏంటీ పిలిచారు అప్పు కావాలా అని శోభ అంటే.. చెప్పు తీసుకుని కొడతారు మా ఆయన.. మీ దగ్గర అప్పు తీసుకుంటే అని ప్రభావతి అంటుంది.
మీ అమ్మాయి ప్రవర్తన నాకు బాగాలేదు అని ప్రభావతి అంటే.. శ్రుతి పెట్టిన స్టేటస్ రోహిణి చూపిస్తుంది. అది చూసి శోభ నవ్వుతుంది. కామాక్షి మరింతగా నవ్వుతుంది. అత్త అంటే మర్యాద లేదు. అత్తగారి పరువు తీయడం సరదానా అని శ్రుతి చేసిన పనుల గురించి తల్లికి కంప్లైంట్ ఇస్తుంది ప్రభావతి. మీనా వల్లే శ్రుతి ఇలా చేస్తుందని ప్రభావతి అంటుంది.
అలా చేస్తే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు. కావాలంటే రవి, శ్రుతిని ఇంట్లోంచి పంపించేయండి అని శోభ అంటుంది. శ్రుతి మంచి పిల్లే. మీనాతో చేరి ఇలా చేస్తుందని రోహిణి అంటుంది. నా కూతురు నా మాట వినేది అయితే నేను చూపించినవాళ్లనే పెళ్లి చేసుకునేదిగా. ఇది మీ ఇంటి వ్యవహారం. మీరే చూసుకోండి అని శోభ వెళ్లిపోతుంది.
మీనా వార్నింగ్
నేను కోరుకున్నట్లే జరుగుతుంది. శ్రుతిని తట్టుకోలేక వీళ్లే పంపిస్తారు. శ్రుతి వెంట రవి వస్తాడు. ఈ గొడవను ఇంకాస్తా పెద్దది చేయాలి అని శోభ అనుకుంటుంది. ఈవిడకు చెబితే మీనా, శ్రుతి మధ్య గొడవలు వస్తాయనుకున్నాను. ఇప్పుడు ఏం చేసేది అని తన ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటుంది ప్రభావతి.
మీనా దగ్గరికి వెళ్లి శ్రుతి కాపురం కూల్చాలని చూస్తున్నావా అని శోభ అంటుంది. ఇదే మాట ఇంకెవత్తయిన అంటే ముక్కు, మొహం ఏకం చేసేదాన్ని (మొహం పగులకొట్టేదాన్ని) అని శోభకు వార్నింగ్ ఇస్తుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.