...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సుమతికి జాబ్- రోహిణి ప్రెగ్నెంట్, స్వీట్స్ పంచిన మీనా- ఆవిరైన ప్రభావతి సంతోషం

గుండె నిండా గుడి గంటలు జనవరి 9 ఎపిసోడ్‌లో సుమతి డిగ్రీలో టాపర్ అయినందుకు ఇంటిల్లిపాది సంతోషిస్తారు. గుడికి వెళ్తారు. అక్కడికి బాలు, మీనా వస్తారు. హాస్పిటల్‌కు రోహిణి వెళ్తుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని, కానీ, ఒత్తిడి తగ్గించుకోవాలని చెబుతుంది డాక్టర్. రోహిణిని చూసిన సుమతి మీనాకు చెబుతుంది.

Published on: Jan 9, 2026, 08:58:21 IST
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో క్రెడిట్ కార్డ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తీసుకుంటాడు మనోజ్. ప్రతి నెల పదో తారీఖుకు వాడుకున్న డబ్బు కట్టాలని క్రెడిట్ కార్డ్ అతను చెబుతాడు. వారం రోజుల్లో కార్డ్ వస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. కార్డ్ వచ్చాక గోవాకు ప్లాన్ చేద్దామని మనోజ్ అంటాడు.

ఇక్కడికే తీసుకొస్తా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 9 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 9 ఎపిసోడ్‌

తర్వాత రోహిణికి చింటు కాల్ చేసి నీతో ఉండాలంటాడు. నిన్ను ఇక్కడికే తీసుకొద్దామనుకుంటున్నా. స్కూల్ కూడా చూస్తున్నా అని రోహిణి చెబుతుంది. దాంతో రోహిణికి ముద్దు పెడతాడు చింటు. రోహిణికి డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకడంతో వెళ్తుంది. మరోవైపు గుడికి పార్వతి, సుమతి వెళ్తారు.

అక్కడికి పక్కింటావిడ కాన్వకేషన్ డ్రెస్ తీసుకొచ్చి ఇస్తుంది. ఈ డ్రెస్సులో నీతో ఓ ఫొటో దిగాలని ఉందని చెబుతుంది. దాంతో సుమతి కాన్వకేషన్ డ్రెస్ వేసుకుంటుంది. అది చూసి పార్వతి కన్నీళ్లతో మురిసిపోతుంది. శివ ఫొటోలు తీస్తాడు. తన తండ్రి సాంబయ్య నడిపిన చెరుకు బండు దగ్గరికి వెళ్లి తల్లి బాధను చెబుతుంది సుమతి.

అమ్మను ఇలాగే సంతోషంగా చూసుకుంటానంటుంది. సుమతిని పిలిచి పార్వతి హగ్ చేసుకుంటుంది. ఇంతలో బాలు, మీనా వస్తారు. మీనా స్వీట్ తినిపిస్తుంది. అక్క వల్లే ఈ చదువు చదవగలిగానని, అక్కకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని సుమతి చెబుతుంది. దానికి ఆశ్చర్యపోతాడు బాలు. సుమతి వేసుకున్న కాన్వకేషన్ మీనాను వేసుకోమ్మంటుంది. మీనా వేసుకుంటుంది.

ఆశలు పెట్టుకోకు

బాలు ఫొటో తీస్తాడు. నువ్వు కూడా ఇలా పాస్ కావాలని ఉందిరా అని మీనా అంటే.. అలాంటి ఆశలు పెట్టుకోకు అని బాలు వెళ్లిపోతాడు. శివ కోప్పడితే.. నిన్ను డిగ్రీ పాస్ అయి చూపించమంటున్నారు, ఆ పౌరుషం చదువులో చూపించు అని మీనా అంటుంది. మరోవైపు హాస్పిటల్‌కు రోహిణి వెళ్తుంది. మనోజ్‌తో బాండింగ్ పెరగాలంటే కచ్చితంగా బిడ్డ పుట్టాలి. ఇప్పుడేదైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలి అని రోహిణి అంటుంది.

ఇది వరకు బాబును కన్నానని. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వచ్చినట్లు డాక్టర్‌తో రోహిణి చెబుతుంది. ఫెర్టిలిటీకి ఏ ఇబ్బంది లేదు. టెన్షన్ పెట్టుకోకూడదు. పీరియడ్ సైకిల్ సరిగా చూసుకోవాలి. కానీ, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. కానీ ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకూడదు అని డాక్టర్ జాగ్రత్తలు చెబుతుంది. అదే విషయం విద్యకు చెబుతుంది రోహిణి.

ఒత్తిడి ఉండకూడదు

సమస్యల గురించి విద్య చెబుతుంది. సమస్యలు పోవాలంటే బిడ్డ పుట్టాలి, బిడ్డ పుట్టాలంటే టెన్షన్ ఉండకూడదు అని విద్య అంటుంది. మనోజ్ రంగుల బట్టలు వేసుకోవడం గురించి చెబుతుంది. ఆ వెర్రోడా. రంగుల బట్టలు వేసుకుంటే సమస్యలు పోతాయా. అంత వెర్రోన్ని పెళ్లి చేసుకున్నావేంటీ. అలాంటి దద్దమ్మను పెళ్లి చేసుకోవడం కంటే ఇలా ఉండటం బెటర్ అని విద్య అంటుంది.

దాంతో కోప్పడిన రోహిణి ట్యాబ్లెట్స్ తీసుకుందామంటుంది. సుమతికి ఉద్యోగం రావాలని దేవుడిని మొక్కుకుంటుంది మీనా. ఇంతలో సుమతి వచ్చి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకో రౌండ్ ఉందని సుమతి చెబుతుంది. పూలమాల ఆర్డర్ ఉందని మీనా అంటే సుమతి వెళ్లమంటుంది. మీనా వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న రోహిణిని సుమతి చూస్తుంది.

మాట్లాడాలని వెళ్తుంటే సుమతిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత మీనాకు సుమతి కాల్ చేసి జాబ్ వచ్చినట్లు, ఆరు నెలల తర్వాత పర్మనెంట్ చేస్తారని చెబుతుంది. దాంతో మీనా సంతోషిస్తుంది. తర్వాత రోహిణిని హాస్పిటల్‌లో చూసినట్లు, అది ప్రసవానికి వచ్చే హాస్పిటల్ అని సుమతి చెబుతుంది. దాంతో రోహిణి ప్రెగ్నెంట్ అయిందనుకుంటుంది మీనా.

రోహిణి ప్రెగ్నెంట్

అందరికి స్వీట్స్ పంచుతుంది మీనా. రోహిణి ప్రెగ్నెంట్ అని ఇంట్లో చెబుతుంది. దానికి షాక్ అవుతుంది రోహిణి. తాను ప్రెగ్నెంట్ కాదని చెబుతుంది. సంతోషాన్ని అంతా ఒక్క నిమిషంలో ఆవిరి చేసిందని ప్రభావతి అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe