...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శోభన ప్లాన్ బయటపెట్టిన మీనా- భార్యకు పట్టీలు కొన్న బాలు-మనోజ్ షాపులో దొంగనోట్లు

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 27 ఎపిసోడ్‌లో బాలు తాగొచ్చాడని అంతా అంటే.. మీనా అందరికి ఇచ్చి పడేస్తుంది. ఒక్కో మాట చెబుతూ ఇంటిల్లిపాదిని ఏకిపారేస్తుంది. రూమ్ తామే కడతామని శపథం చేస్తుంది మీనా. అందుకు బాలు భయపడుతుంటే కట్టేందుకు కొత్త ఐడియా ఇస్తుంది మీనా. మనోజ్ షాపులో దొంగనోట్లు బయటపడతాయ్.

Published on: Oct 27, 2025, 08:15:52 IST
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తాగి ఇంటికి వస్తాడు. సంస్కారానికి ఓ గీత ఉంటుంది. అది దాటితే రౌడీతనం. ఒక ఆడదానితో అమర్యాదగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని బాలుకు చెబుతాడు సత్యం. ఇంతలో అంతా వస్తారు. బాలు మళ్లీ తాగొచ్చాడని ప్రభావతి గొడవ చేస్తుంది.

రేడియోలాగా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్‌

మనోజ్, శ్రుతి బాలును అంటారు. అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పడం అవసరమా డబ్బుడమ్మా అని బాలు అంటాడు. నీ భార్య మాత్రం రేడియోలో వార్తలు చదివినట్లు తన పుట్టింట్లో చెప్పదా అని ప్రభావతి అంటుంది. అది ఆవిడ అలుసుగా తీసుకుని మా నాన్నను అవమానించలేదు అని బాలు అంటాడు. ఆవిడ ఏదో పెద్ద మనసు చేసుకుని ఇద్దామనుకుంది. నువ్వు దాన్ని గొడవ చేశావ్ అని ప్రభావతి అంటుంది.

ఏంటీ ఆవిడ పెద్ద మనసుతో ఇద్దామనుకుందా. మీ కొడుకును తీసుకోలేదని తిడుతున్నారా. అంటే ఎవరో దానం ఇస్తే తీసుకోవాలా. ఏం మాట్లాడుతున్నారా మీరు అని మీనా అంటుంది. ఏయ్ అని ప్రభావతి అరిస్తే.. ఏయ్ ఏంటీ ఏయ్.. ఆవిడ ఏమందో వినలేదా. ఆవిడ డబ్బు ఇస్తే తప్పా కట్టలేరు అంది. అందరి ముందు మనోజ్‌ను అంటే రోహిణి ఊరుకుంటుందా. రవిని అంటే శ్రుతి ఊరుకుంటుందా అని వాళ్లిద్దరిని అడుగుతుంది మీనా.

వాళ్లు ఊరుకోం అంటారు. భర్తను అంటే ముందు నోరు తెరవాల్సింది మీరు. మీరెందుకు ఏం అనలేదు. భర్త గౌరవం పోతుంటే మాట్లాడిసింది మీరా కాదా అని అత్తను నిలదీస్తుంది మీనా. అవును అనుకో అని ప్రభావతి అంటే.. అనుకో ఏంటీ మాట్లాడాల్సిందే. అందరం ఉన్న ఎవరు చేయని పని నా భర్త చేశాడు. ఇంటి పెద్ద గౌరవం వెయ్యి రెట్లు పెంచాడు. ఇంకా నా మొగుడిని అంటారేంటీ అని ఇచ్చి పడేస్తుంది మీనా.

సోఫాలు తిరిగి ఇచ్చినప్పుడే

శ్రుతి చెల్లిగా అనుకుని అడుగుతున్నా పుట్టింటి వాళ్ల డబ్బుతో కట్టుకుంటే నీకు గౌరవమా, నీ భర్తకు గౌరవమా. మనకు గౌరవమా అని మీనా అంటుంది. అంత డీప్‌గా ఆలోచించలేదు. నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుందని శ్రుతి అంటుంది. నా భర్త తాగొచ్చి వాగాడా ఏం వాగాడు. తండ్రి కొడితే సైలెంట్‌గా ఉన్నాడు. తాగితే ఇంటి పరువు పోదు. ఇంటి యజమానికి అవమానం జరిగితే పోతుందని రోహిణిని నిలదీస్తుంది మీనా.

ఇంటి పెద్ద కష్టార్జితాన్ని ఎత్తుకుపోయి పది మందిలో నిలబెడితే పరువు పోతుంది. తల్లి, భార్య డబ్బులివ్వలేదని గుడిలో అడుక్కుంటే పోతుంది. మీకు రూమ్ ఉంది. గడియ పెట్టి మూసుకుని పడుకోండి. బిజినెస్ మ్యాన్ అయితే షాప్‌లో చూసుకోండి. ఇంట్లో ముగ్గురు కొడుకులు సమానమే అని ఏకిపారేస్తుంది మీనా. ఏం రవి మీ అత్తయ్య అలా అంటుంటే నువ్వే అంటే మీ అన్నయ్య జోక్యం చేసుకునే అవసరం వచ్చేది కాదుగా అని మీనా అంటుంది.

అందరూ నిలదీస్తారు

నిజమే వదినా. నాకు నచ్చలేదు. ఏం మాట్లాడాలో తోచలేదు అని రవి అంటాడు. ఎవరు మాట్లాడరు. కానీ ఆయన్ను అందరూ నిలదీస్తారు. మీరు ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతేనా మీరు వేరు అయినప్పుడు తీసుకొచ్చారా. మన మధ్య ఎన్ని ఉన్న మూడో వ్యక్తి అనే అవకాశం ఇవ్వకూడదు. మామయ్య ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని బాలను తీసుకెళ్లిపోతుంది మీనా.

అలా ఇంటిల్లిపాదిని ఏకిపారేస్తుంది మీనా. ప్రభావతి నోరెళ్లబెడితే.. నీకు నోరు తెరిచే హక్కు లేదు మూయ్ అని సత్యం అంటాడు. మరోవైపు రాత్రి తండ్రి కొట్టినందుకు బాధగా ఉందని బాలు అంటాడు. ఆడ మగ అనే ఇంగితం లేకపోతే ఎలా అని మీనా అంటుంది. కింద అందరికి క్లాస్ తీసుకున్నావ్. పైన నాకు తీసుకుంటున్నావా అని బాలు అంటాడు.

మాటి మాటికి మా నాన్న నన్ను కొట్టాడు అని చిన్న పిల్లాడిలా మాట్లాడుతాడు. ఆయన ఎప్పుడు మర్చిపోయారు. మీరే కుండ మోస్తున్నారు. మీరు నార్మల్‌గానే రేసుగుర్రంలా ఉరుకుతారు. తాగితే అంతే. ఆ గొడవలు చూస్తే మావయ్య తట్టుకోగలరా. ఆయన గుండె బలహీనంగా ఉందిగా. ఆయన్ను ప్రశాంతంగా ఉంచాలిగా. ఇంకోసారి తాగి రాకండి అని మీనా అంటుంది.

రూమ్ నేనే కడతాను

నిజమేగా. ఆయనకు నన్ను కొట్టే హక్కుంది. మా నాన్నను బాధపెట్టను. రూమ్‌కు ఎవరో డబ్బు ఇవ్వడమేంటీ. నేనే కడతాను. ఇక్కడే కడతాను అని బాలు అంటాడు. తర్వాత మీనా ఒడిలో బాలు పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బాలు దేవుడికి హారతి ఇస్తూ పూజ చేస్తాడు. అది చూసి ఇంట్లోవాళ్లంతా చూసి షాక్ అవుతారు. ఇంట్లో అందరికి హారతి ఇస్తాడు బాలు.

ఈ కొత్త వేషం ఏంటీ అన్నయ్య రవి అంటాడు. పూజ గురించి అందరూ అడుగుతారు. రాత్రి తాగొచ్చి గొడవ చేసినందుకు పరిహారమేమో అని రోహిణి అంటుంది. అది గొడవ కాదు. పరిహారం చేసేంత తప్పు చేయలేదని మీనా అంటుంది. సత్యం కాళ్లు మొక్కి గొప్పగా చెబుతాడు. మాకు రూమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాకు రూమే వద్దు అని బాలు అంటాడు.

ఇప్పుడు వీడెందుకండి సినిమా చూపిస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. రూమ్ లేకుంటే ఇబ్బంది అవుతుందిగా అని సత్యం అంటాడు. రూమ్ వల్ల వచ్చే గొడవలతో విసిగిపోయాను నాన్నగారు. నాకు వీలైనప్పుడు నా రూమ్ నేనే కట్టుకుంటాను అని బాలు అంటాడు. ఇలాగే నగల గురించి నీ భార్య శపథం చేసింది కదరా అని మనోజ్ అంటాడు.

మీనా ఛాలెంజ్

ఆ శపథమే పూర్తి కాలేదు. ఇంకో శపథం ఎందుకులే బాలు అని రోహిణి అంటుంది. అంతేగా. పూలమ్మీ కడతారా అని మనోజ్ అంటాడు. ఆపండి.. మీ పుట్టింటి వాళ్లు ఇచ్చిన డబ్బుతోనేగా షాప్ పెట్టింది. అంతకుముందు ఏమైనా సంపాదించారా అని ఇచ్చిపడేస్తుంది మీనా. ఏవండి. మనం రూమ్ కడుతున్నాం. కట్టి వీళ్ల నోళ్లు మూయించాలి అని మీనా ఇంట్లోవాళ్లందరితో ఛాలెంజ్ చేస్తుంది.

సరే అమ్మా. వాడి ఒక్కడి వల్లే కాదు నేను కూడా సాయం చేస్తాను అని సత్యం అంటాడు. వద్దు మావయ్య. మీ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా వీళ్లు ఆయన్ను ఎగతాళి చేస్తారు అని మీనా అంటుంది. మంగమ్మా రెండో శపథం చేసింది అని ప్రభావతి ఎగతాళిగా అంటుంది. తొందరపడ్డావేమో మీనా అని సత్యం అంటాడు. మీరు తొందరపడి అప్పు చేయకండి. అది తీర్చడానికి మీరు టెన్షన్ పడాలి అని మీనా అంటుంది.

మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి అని సత్యం అంటాడు. తర్వాత ఆవేశం వస్తే శపథం చేయడం మానేయ్. ఇప్పటికీ నగలు కొనలేదు. గోడలు కూడా కడతానో లేదని భయంగా ఉందని బాలు అంటాడు. మీరు తలుచుకుంటే కడతారు. మనం ఇంకో కారు కొందాం. ఆ కారు అద్దెకు ఇద్దాం. వచ్చే అద్దె చిట్టీ కడదాం. ఆ చిట్టి ముందే వాడి రూమ్ కడదాం అని మీనా ఐడియా ఇస్తుంది.

మోసపోయిన మనోజ్

మీనాకు పట్టీలు కొని కాళ్లకు పెడతాడు బాలు. అది చూసి ఓర్వలేకపోతుంది ప్రభావతి. మరోవైపు మనోజ్ షాప్‌కు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్లు వచ్చి ఫేక్ నోట్స్ అని చెబుతారు. ఫర్నిచర్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వమంటారు. ఎస్సైతో మనోజ్‌ చెబుతాడు.

నువ్వు రెండు సార్లు మోస పోయావ్. డబ్బులిచ్చిన వాళ్లు, విజిలెన్స్ అని వచ్చిన వాళ్లు ఇద్దరు మోసగాళ్లే అని ఎస్సై అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe