గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో డిగ్రీలో క్లాస్ టాపర్ వచ్చిన సుమతి అక్క మీనాతో కలిసి మెటర్నిటీ హాస్పిటల్‌లో అకౌంటెంట్ జాబ్ కోసం వెళ్తుంది. అక్కడికే రోహిణి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం చెకప్‌కు వస్తుంది. పూల ఆర్డర్ వచ్చిందని మీనా వెళ్లిపోతుంది.
సుమతి జాబ్ వచ్చిందని

హాస్పిటల్‌లో రోహిణిని సుమతి చూస్తుంది. ఇంటర్వ్యూ తర్వాత అక్క మీనాకు కాల్ చేసి తనకు జాబ్ వచ్చిందని, ఆరు నెలల తర్వాత పర్మనెంట్ చేస్తారని చెబుతుంది సుమతి. దాంతో మీనా తెగ సంతోషిస్తుంది. తర్వాత మెటర్నిటీ హాస్పిటల్‌కు రోహిణి కూడా వచ్చిందని, తనను చూశానని సుమతి చెబుతుంది.
అది ప్రసవం కోసం వచ్చే హాస్పిటల్ కదా అని మీనా అంటుంది. ఏమో తెలియదు, నేను మాట్లాడిద్దామనుకునేసరికే ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్లాను అని సుమతి చెబుతుంది. ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత అక్కడికి రోహిణి ఎందుకు వెళ్లింది, రోహిణి ప్రెగ్నెంట్ అయిందా, ప్రసవం గురించి తెలుసుకోడానికి వెళ్లిందా అని మీనా అనుకుంటుంది.
కచ్చితంగా రోహిణి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని స్వీట్స్ కొంటుంది మీనా. ఇంటికి వెళ్లి ఇంట్లో అందరిని పిలుస్తుంది మీనా. ప్రభావతి వచ్చి సెటైర్లు వేస్తుంది. మీ చెల్లి పాస్ అయినంత మాత్రాన ఇంత హడావిడి చేయాలా అని ప్రభావతి అంటుంది.
తలెత్తుకునేలా చేసిందంటూ
పాస్ మాత్రమే కాదు తనకు జాబ్ కూడా వచ్చింది అని మీనా చెబుతుంది. దానికి సత్యం చాలా సంతోషిస్తాడు. ఇలా పాస్ అయింది అలా జాబ్ తెచ్చుకుంది అని సుమతిని పొగుడుతాడు. బాలు కూడా చాలా సంతోషిస్తాడు. చిన్న పూలగంప మీ అందరిని తలెత్తుకునేలా చేసింది. మీ అమ్మకు కష్టం తీరినట్లే అని బాలు అంటాడు.
ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణికి, మనోజ్‌కు స్వీట్స్ ఇస్తుంది. అసలు విషయం ఏంటో ముందు చెప్పు మీనా అని రోహిణి అంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా రోహిణి అని మీనా అంటుంది. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. అమ్మా రోహిణి నువ్వు తల్లివి కాబోతున్నావా. ఒక్క మాట కూడా చెప్పలేదు అని ప్రభావతి అంటుంది.
{{/usCountry}}ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణికి, మనోజ్‌కు స్వీట్స్ ఇస్తుంది. అసలు విషయం ఏంటో ముందు చెప్పు మీనా అని రోహిణి అంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా రోహిణి అని మీనా అంటుంది. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. అమ్మా రోహిణి నువ్వు తల్లివి కాబోతున్నావా. ఒక్క మాట కూడా చెప్పలేదు అని ప్రభావతి అంటుంది.
{{/usCountry}}నేను ప్రెగ్నెంట్ కాదు అని రోహిణి ఈసడింపుగా చెబుతుంది. మరి ఇవాళ డెలివరి చేసే హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లావ్ అని మీనా అడుగుతుంది. నీకెలా తెలుసు అని రోహిణి అంటే సుమతి చూసింది. సుమతి జాబ్ కోసం వచ్చిన విషయం చెబుతుంది మీనా. అలా చెకప్‌తో రోహిణి నిజం బయటపడుతుంది.
మనోజ్‌కు సంతాన సమస్యలు
నేను కన్సీవ్ అవ్వట్లేదు కదా. ఏదైనా సమస్య ఉందేమో అని చెక్ చేయించుకోడానికి వెళ్లాను. ఏం సమస్య లేదని డాక్టర్ చెప్పిందని రోహిణి అసలు విషయం చెబుతుంది. కొన్ని క్షణాల్లో నా ఆశలన్నింటిని అడియాసల్ని చేసింది నీ పెళ్లాం అని ప్రభావతి అంటుంది.
తర్వాత మనోజ్‌తో మన ఇద్దరం వెళ్లి చెకప్ చేయించుకుందామా అని రోహిణి బతిమిలాడుతుంది. కన్సీవ్ కానిది నువ్వు. నేనెందుకు చెకప్ చేయించుకోవాలని మనోజ్ అంటాడు. నీ మాజీ లవర్‌తో నువ్వు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నావు కదా. మరి అప్పుడు తను కన్సీవ్ అయిందా. అంటే నీ లోపల సంతాన సమస్యలు ఉన్నాయ్ కాబట్టే కాలేదేమో అని మనోజ్‌ను నిలదీస్తుంది రోహిణి.
ఆ మాటలు ప్రభావతి వింటుంది. రోహిణిపై కోప్పడుతుంది. మనోజ్ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఎందుకు అవమానిస్తున్నావ్. నువ్వు విదేశాల్లో ఉన్నావుగా. మరి నిన్ను మేము అవమానించామా అని ప్రభావతి అంటుంది. దాంతో సైలెంట్ అవుతుంది రోహిణి.
రోహిణి గతంపై ప్రభావతి ఆరా
తర్వాత కొడుకు మనోజ్‌తో ప్రభావతి మాట్లాడుతుంది. రోహిణి గర్భవతి కావట్లేదు అంటే పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకు తెలియదు కదా. తను నీ దగ్గర ఏదో దాస్తుందనిపిస్తుంది అని డౌట్‌గా చెబుతుంది ప్రభావతి.
వెంటనే రోహిణి గతమేంటో తెలుసుకో అని, ఆరా తీయమని మనోజ్‌కు చెబుతుంది తల్లి ప్రభావతి. కోడలిపై అత్త ప్రభావతి, భర్త మనోజ్ నిఘా పెట్టడంతో చింటును ఇక్కడికి తీసుకొచ్చి చూసుకోవాలనే రోహిణి ఆశలు గల్లంతు అవుతాయి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.