...
...
Next Story

TV Serials: సీరియల్స్‌లో ఆ క్యారెక్టర్స్ చేసి నేను విసిగిపోయా, విజయశాంతిలా చేయాలని డ్రీమ్: గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్

Guppedantha Manasu Actress Jyothi Poorvaj On Serials: గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా చేసిన నటి జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన సినిమా కిల్లర్. ఇటీవల కిల్లర్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో సీరియల్ క్యారెక్టర్స్, విజయశాంతిపై జ్యోతి పూర్వజ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 24, 2026, 14:12:45 IST
Advertisement

తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి జ్యోతి పూర్వజ్. స్టార్ మాలోని గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా, హీరోకు తల్లిగా అలరించిన జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా మారి వెండితెరపై గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తోంది. జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ ఫీమేల్ లీడ్ పాత్రలో చేసిన లేటెస్ట్ మూవీ కిల్లర్.

కిల్లర్ టీజర్ లాంచ్

సీరియల్స్‌లో ఆ క్యారెక్టర్స్ చేసి నేను విసిగిపోయా, విజయశాంతిలా చేయాలని డ్రీమ్: గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్
సీరియల్స్‌లో ఆ క్యారెక్టర్స్ చేసి నేను విసిగిపోయా, విజయశాంతిలా చేయాలని డ్రీమ్: గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్

తెలుగులో సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిల్లర్ మూవీకి జ్యోతి రాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా కిల్లర్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన కిల్లర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జ్యోతి పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు జ్యోతి పూర్వజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయా

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. "నేను సీరియల్స్‌లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్‌లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు" అని అన్నారు.

ఇలాంటి మూవీ చేస్తాననుకోలేదు

"నేను ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్‌లో పర్ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్‌ కైనా డ్రీమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించాడు డైరెక్టర్. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం కిల్లర్ చిత్రంతో దక్కింది" అని జ్యోతి పూర్వజ్ తెలిపింది.

పెళ్లాయ్యాక చాలా మంది

"సినిమా రూపొందించడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించిన వాళ్లం అవుతాం అనుకున్నాను. జ్యోతి అంటే మంచి పర్‌ఫార్మర్ అని, పూర్వజ్ అంటే మంచి డైరెక్టర్, టెక్నీషియన్ అని ఈ చిత్రంతో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది" అని జ్యోతి పూర్వజ్ చెప్పింది.

అనిల్ రావిపూడి టీజర్ చూసి

"పూర్వజ్‌లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్‌గా అనిల్ రావిపూడి గారు మా కిల్లర్ టీజర్ రిలీజ్ చేసి పూర్వజ్‌లో మంచి యాక్టర్ ఉన్నాడని చెప్పారు. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంతో డబ్బులు చేసుకుందామని కాదు మేకర్స్‌గా ఒక ఫౌండేషన్ వేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాం. మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని జ్యోతి పూర్వజ్ తన స్పీచ్ ముగించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks