ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఆ సినిమానే ‘గుర్రం పాపిరెడ్డి’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ నటించిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సమాధుల్లోని శవాలను మార్చే గ్యాంగ్ చేసే సందడితో ఈ మూవీ ఎంటర్ టైన్ చేస్తోంది.
గుర్రం పాపిరెడ్డి ఓటీటీ

డిఫరెంట్ టైటిల్ తో ఆడియన్స్ కు కనెక్ట్ అయిన సినిమా గుర్రం పాపిరెడ్డి. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా ఆడలేకపోయిన మూవీ ఇది. ఇప్పుడిది డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ తెలుగు సినిమా.
నెల రోజుల్లోపే
థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే గుర్రం పాపిరెడ్డి ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 19, 2025న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరో. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ కు మురళీ మనోహర్ డైరెక్టర్.
గుర్రం పాపిరెడ్డి స్టోరీ
డబ్బు కోసం సమాధుల్లోని శవాలను మార్చడానికి ఓ గ్యాంగ్ ఏం చేసింది? ఎలాంటి చిక్కుల్లో పడిందనే కథతో సాగే సినిమానే గుర్రం పాపిరెడ్డి. ఖమ్మం జిల్లాలోని ఓ విలేజ్ లో గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య) ఉంటాడు. అతను డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతాడు. ఓ బ్యాంక్ రాబరీకి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు.
శవాలను మార్చేసి
డబ్బు కోసం పాపిరెడ్డి మరో అడ్డదారి వెతుక్కుంటాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నర్సుగా చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే.. శ్రీశైలంలోని ఓ శ్మశానంలో ఉన్న సమాధిని తీసుకొచ్చి శ్రీనగర్ లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు.
{{/usCountry}}డబ్బు కోసం పాపిరెడ్డి మరో అడ్డదారి వెతుక్కుంటాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నర్సుగా చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే.. శ్రీశైలంలోని ఓ శ్మశానంలో ఉన్న సమాధిని తీసుకొచ్చి శ్రీనగర్ లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు.
{{/usCountry}}ఇందుకోసం గొయ్యి (జీవన్), మిలటరీ (రాజ్ కుమార్ కసిరెడ్డి), చిలిపి (వంశీధర్ గౌడ్)తో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ గ్యాంగ్ కలిసి శవాలను మార్చాలనుకుంటారు. డబ్బు కోసం పెద్ద ప్లాన్ వేస్తారు. మరి వీళ్లు శవాలను మార్చారా? అసలు ఆ ప్లాన్ ఎందుకు వేశారు? అన్నది గుర్రం పాపిరెడ్డి సినిమాలో చూడాల్సిందే.
తెలుగులో డార్క్ కామెడీ థ్రిల్లర్స్ కావాలనుకునే ఓటీటీ ఆడియన్స్ కు జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న గుర్రం పాపిరెడ్డి మూవీ మంచి ఆప్షన్.