ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. కంటెంట్ ఎంత డిఫరెంట్ గా ఉంటే ఆడియన్స్ కు అంతగా రీచ్ అవుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. ఇవాళ ఓటీటీలోకి అలాంటి ఓ సైకలాజిక్ థ్రిల్లరే వచ్చింది. అదే ‘హాలో రోడ్’. మంగళవారం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చూస్తే కచ్చితంగా వెన్నులో వణుకు పుట్టాల్సిందేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక రాత్రిలో కార్లో ఇద్దరి ప్రయాణం చుట్టూ స్టోరీ సాగుతుంది. ఆఖర్లో దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది.
హాలో రోడ్ ఓటీటీ

ఓటీటీలో ఈ వారం కూడా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం (జనవరి 6) మరో కొత్త మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ హాలో రోడ్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సత్తాచాటిన ఈ మూవీ ఓటీటీలోనూ వణికిస్తోంది.
ఏడు నెలల తర్వాత
థియేటర్లో రిలీజైన ఏడు నెలల తర్వాత హాలో రోడ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మే 16, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు జనవరి 6, 2026న ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో రాస్మండ్ పైక్, మాథ్యూ రైస్ కీలక పాత్రలు పోషించారు. దీనికి బాబక్ అన్వారి డైరెక్టర్.
హాలో రోడ్ మూవీ స్టోరీ
హాలో రోడ్ సినిమా అనేది ఓ సైకలాజికల్ థ్రిల్లర్. సస్పెన్స్ తో ఊపేసే మూవీ ఇది. ఓ రాత్రి కార్లో ఇద్దరు వ్యక్తుల ప్రయాణం చుట్టూ సాగుతోంది ఈ హాలో రోడ్. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, సౌండ్ ఎఫెక్ట్స్ భయపెడతాయి.
మ్యాడీ, ఫ్రాంక్ భార్యభర్తలు. వాళ్లకు ఓ టీనేజ్ కూతురు అలీస్ ఉంటుంది. ఓ రోజు ఆ టీనేజ్ కుమార్తె ఓ రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఆమె ఓ వ్యక్తిని ఢీకొట్టిందని చెప్తారు. తమ కూతురు అక్కడి నుంచి పారిపోయిందని తెలుస్తుంది. వెంటనే ఆ రాత్రి తన భార్యను తీసుకుని ప్రమాదం జరిగిన దగ్గరకు మ్యాడీ భయల్దేరతాడు.
భ్రమలతో భయాలు
{{/usCountry}}మ్యాడీ, ఫ్రాంక్ భార్యభర్తలు. వాళ్లకు ఓ టీనేజ్ కూతురు అలీస్ ఉంటుంది. ఓ రోజు ఆ టీనేజ్ కుమార్తె ఓ రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఆమె ఓ వ్యక్తిని ఢీకొట్టిందని చెప్తారు. తమ కూతురు అక్కడి నుంచి పారిపోయిందని తెలుస్తుంది. వెంటనే ఆ రాత్రి తన భార్యను తీసుకుని ప్రమాదం జరిగిన దగ్గరకు మ్యాడీ భయల్దేరతాడు.
భ్రమలతో భయాలు
{{/usCountry}}మ్యాడీ, ఫ్రాంక్ కార్లో హాలో రోడ్ లో ప్రయాణిస్తుంటారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? తమ కూతురుకు ఏమైనా అయిందా? ఢీ కొట్టిన వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నాడా? అనే ఆలోచనలతో మ్యాడీ భ్రమ పడుతుంటాడు. మరోవైపు వీళ్ల కారును ఆత్మలు వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి చివరకు తమ కూతురును వీళ్లు కలుసుకున్నారా? అసలు ఆ ప్రమాదం ఏంటీ? అన్నది హాలో రోడ్ మూవీలో చూడాల్సిందే. ఆఖర్లో ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది.