Hansika Krishna controversy : ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణకుమార్ చిన్న కుమార్తె, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హన్సిక కృష్ణ గత కొన్ని రోజులుగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న తన ప్రైవేట్ వీడియో లీక్ వివాదంపై ఎట్టకేలకు స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ నుంచి ఒక వ్యక్తిగత వీడియో క్లిప్ బయటకు వచ్చి, 'ఎక్స్', ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో 20 ఏళ్ల హన్సిక తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో, తాను చేసిన తప్పును అంగీకరిస్తూ.. ఆ వీడియో వెనుక ఉన్న అసలు నిజాలను, తాను అనుభవించిన మానసిక వేదనను వివరిస్తూ ఆమె ఒక సుదీర్ఘ ప్రకటనను విడుదల చేసింది.

గత నెల రోజులుగా ఈ వివాదం తనను, తన కుటుంబాన్ని ఎంతగానో కుంగదీసిందని హన్సిక కృష్ణ ఆవేదన వ్యక్తం చేసింది. తనను నిజంగా ప్రేమించే అభిమానులకు నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నట్లు ఆమె తెలిపారు.
అనాలోచితంగా చేసిన పెద్ద పొరపాటు..
వైరల్ అయిన వీడియో గురించి హన్సిక కృష్ణ మాట్లాడుతూ.. అది తాను ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీడ్‌లో పొరపాటున, అనాలోచితంగా అప్‌లోడ్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించింది.
"వెనక్కి తిరిగి చూసుకుంటే, అది నా వైపు నుంచి జరిగిన చాలా నిర్లక్ష్యపు, సిల్లీ నిర్ణయం. దానిని నేను హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నాను. నేను దానిని ఎందుకు పోస్ట్ చేశానో నాకే తెలియదు, అది ముమ్మాటికీ నా తప్పే," అని పేర్కొంది.
ఆ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న కొందరు వ్యక్తులు దానిని స్క్రీన్ రికార్డ్ చేసి, ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేశారని ఆమె వివరించింది.
పబ్లిసిటీ, డబ్బు కోసం కాదు..
సబ్‌స్క్రిప్షన్లు పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసమే హన్సిక కావాలనే ఈ వీడియోను లీక్ చేసిందని నెటిజన్లు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించింది.
"చాలా మంది నేను డబ్బు, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని నిందించారు. కానీ 20 ఏళ్ల వయసులోనే నాకు ఆర్థిక స్థిరత్వం, మంచి గుర్తింపు ఉన్నాయి. మా జీవితాల్లో పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు," అని స్పష్టం చేసింది.
{{/usCountry}}"చాలా మంది నేను డబ్బు, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని నిందించారు. కానీ 20 ఏళ్ల వయసులోనే నాకు ఆర్థిక స్థిరత్వం, మంచి గుర్తింపు ఉన్నాయి. మా జీవితాల్లో పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు," అని స్పష్టం చేసింది.
{{/usCountry}}ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే తన అక్క, నటి అహానా కృష్ణ దర్శకత్వం వహించిన ‘పూక్కళ్’ మ్యూజిక్ వీడియో విడుదల కావాల్సి ఉంది (ఇందులో హన్సిక కూడా నటించింది). తన అక్క కష్టాన్ని పాడుచేసేలా తాను కావాలని ఇలాంటి పని ఎప్పటికీ చేయనని హన్సిక ఎమోషనల్ అయ్యింది.
సైబర్ బుల్లీయింగ్, సబ్‌స్క్రిప్షన్ ధర పెంపుపై వివరణ..
ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొందరు యూజర్లు హన్సికపై తీవ్రమైన సైబర్ దాడికి దిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ:
కొంతమంది ఈ సిట్యుయేషన్‌ను ఒక ప్రాజెక్ట్‌లా మార్చుకుని, కేవలం వ్యూస్, ఎంగేజ్‌మెంట్ కోసం తనపై, తన కుటుంబంపై అత్యంత దారుణమైన, బాధాకరమైన భాషను ఉపయోగించి వీడియోలు చేశారని మండిపడింది.
పెంచిన డబ్బును సామాజిక సేవకు విరాళం..
వివాదం నడుస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధరను రూ. 299 నుంచి రూ. 399కి పెంచడంపై కూడా హన్సిక క్లారిటీ ఇచ్చింది. "మొదట సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా క్లోజ్ చేయాలనుకున్నాను, కానీ అది మరింత నెగిటివిటీకి దారితీస్తుందని భయపడ్డాను. కొత్తగా ఎవరూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోకుండా అడ్డుకోవడానికే తాత్కాలికంగా ధర పెంచాను. ఈ కాలంలో ఆ పెంచిన ధర ద్వారా వచ్చిన అదనపు ఆదాయం మొత్తాన్ని ఒక సామాజిక సేవా కార్యక్రమానికి విరాళంగా ఇచ్చేశాను," అని హన్సిక వెల్లడించారు.
ఎవరు ఈ హన్సిక కృష్ణ?
మలయాళ ఇండస్ట్రీలో నటుడు-రాజకీయ నాయకుడైన కృష్ణకుమార్ కుమార్తెగా హన్సిక కృష్ణ అందరికీ సుపరిచితురాలే. ఆమె అక్కలు ఇషాని కృష్ణ, దియా కృష్ణ, అహానా కృష్ణలు కూడా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా ఉన్నారు. హన్సికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రస్తుతం ఈ వివాదాన్ని పక్కన పెట్టి హన్సిక తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రముఖ మలయాళ నటుడు నస్లెన్ సరసన ‘బ్యాచిలర్ పార్టీ 2 డ్యూక్స్’ అనే సినిమా ద్వారా ఆమె త్వరలోనే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది.