...
...
Next Story

Hanuman Ansh OTT: హ‌నుమాన్ అంశ్ ఓటీటీ స్ట్రీమింగ్‌లో అదిరే ట్విస్ట్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ రిలీజ్‌.. ఎప్పుడంటే?

Hanuman Ansh OTT: 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్ అంశ్’ ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సినిమా రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రానుంది. మరి మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ లుక్కేయండి.

Published on: Nov 26, 2026, 05:58:47 IST
Advertisement

Hanuman Ansh OTT: తెలుగు ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్. 2026లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హనుమాన్ అంశ్’ తెలుగులోనూ ఓటీటీలోకి రాబోతుంది. ఫస్ట్ ఈ మూవీ సోనీ లివ్ లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ క్రేజీ న్యూస్ చెప్పింది.

హనుమాన్ అంశ్ ఓటీటీ

హ‌నుమాన్ అంశ్ ఓటీటీ స్ట్రీమింగ్‌లో అదిరే ట్విస్ట్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ రిలీజ్‌.. ఎప్పుడంటే? (x/Netflix_INSouth)
హ‌నుమాన్ అంశ్ ఓటీటీ స్ట్రీమింగ్‌లో అదిరే ట్విస్ట్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ రిలీజ్‌.. ఎప్పుడంటే? (x/Netflix_INSouth)

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన హనుమాన్ అంశ్.. ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ మూవీ రాబోతుంది. నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ కానుంది.

రెండు ఓటీటీల్లో

ఇప్పటికే హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ గురించి మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ చేసిన అనౌన్స్ మెంట్ తెలిసిందే. నవంబర్ 27 నుంచి సోనీ లివ్ లో హనుమాన్ అంశ్ అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ సోనీ లివ్ లో కేవలం హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ చేయనున్నారు.

సోనీ లివ్ లో ఈ మూవీ విడుదల అయిన తర్వాత రెండు రోజులకు నెట్‌ఫ్లిక్స్‌ హిందీ కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ కానుంది.

హనుమాన్ అంశ్ స్టోరీ ఏంటంటే?

హనుమాన్ అంశ్ ఓటీటీలోకి రాబోతున్న వేళ ఈ మూవీ ప్రొడ్యూసర్ అనుప్రియా నగర్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. హనుమాన్ అంశ్ మూవీకి సీక్వెల్ కూడా రెడీ అవుతుందని ఆమె పేర్కొన్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అనుప్రియా చెప్పారు.

నీమ్ కరోలి బాబా జీవితాన్ని, ఆయన బోధనలను నేటి తరం యువతకు, ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ కు పరిచయం చేయడమే తమ లక్ష్యమని అనుప్రియా స్పష్టం చేశారు. ఈ సీక్వెల్ గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశముంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks