Hanuman Ansh Telugu Release Date: తెలుగు సినీ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. కానీ త్రివిక్రమ్, వెంకటేష్ ఫ్యాన్స్ కు మాత్రం బ్యాడ్ న్యూస్. తెలుగు జనాలు చాలా కాలం నుంచి బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 7న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇవాళ (అక్టోబర్ 2) ప్రకటించేసింది.
ఆదర్శ కుటుంబంతో ఢీ
హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఎట్టకేలకు వచ్చింది. కానీ, ఆ మూవీ త్రివిక్రమ్- వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’తో బాక్సాఫీస్ దగ్గర తలపడనుంది. భారీ అంచనాలతో వస్తున్న ఆదర్శ కుటుంబం కూడా అక్టోబర్ 9న థియేటర్లకు రాబోతుంది.
ఫస్ట్ త్రివిక్రమే
హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ కోసం ఫస్ట్ ట్రై చేసింది డైరెక్టర్ త్రివిక్రమే. ఆయన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని తెలుగులో సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్లాన్ చేశారు.
టీజర్ రిలీజ్, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. కానీ ఏమైందో తెలీదు సడెన్ గా ఈ ఈవెంట్లను క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు చూస్తే అసలు ఈ ప్రాజెక్టులోనే త్రివిక్రమ్ పేరు లేదు.
హోంబలే ఫిల్మ్స్
{{/usCountry}}టీజర్ రిలీజ్, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. కానీ ఏమైందో తెలీదు సడెన్ గా ఈ ఈవెంట్లను క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు చూస్తే అసలు ఈ ప్రాజెక్టులోనే త్రివిక్రమ్ పేరు లేదు.
హోంబలే ఫిల్మ్స్
{{/usCountry}}ఇప్పుడు హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి త్రివిక్రమ్ తప్పుకోవడం వెనుక ఆదర్శ కుటుంబం మూవీనే కారణమనే టాక్ వినిపిస్తోంది. తన సొంత సినిమా అయిన ఆదర్శ కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతుందని త్రివిక్రమ్ భావించారని తెలిసింది.
కానీ, ఇప్పుడేమో అసలుకే ఎసరన్నట్లు ఆదర్శ కుటుంబం రిలీజ్ రోజే హనుమాన్ అంశ్ ను విడుదల చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి సంచలనం క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ మూవీపై తెలుగు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. ఈ నేపథ్యంలో హనుమాన్ అంశ్ కారణంగా ఆదర్శ కుటుంబం మూవీకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది.