ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ రోజు అలాంటి విభిన్నమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన హిందీ సినిమా ‘హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్’ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మించాడు.
హ్యాపీ పటేల్ ఓటీటీ

లేటేస్ట్ హిందీ మూవీ ‘హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్’ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (ఏప్రిల్ 1) డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి కేవలం హిందీలోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్
హ్యాపీ పటేల్ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మించాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి వీర్ దాస్, కవి శాస్త్రి డైరెక్టర్లు. ఇందులో వీర్ దాస్, మిథిలా పాల్కర్, మోనా సింగ్, షరీబ్ హష్మీ, ఇమ్రాన్ ఖాన్ తదితరులు నటించాడు. పదేళ్ల తర్వాత ఇమ్రాన్ ఖాన్ చేసిన సినిమా ఇది. ఇందులో అమీర్ ఖాన్ ఓ క్యామియో ప్లే చేశాడు.
రెండు నెలల తర్వాత
హ్యాపీ పటేల్ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ స్పై థ్రిల్లర్ కామెడీ యాక్షన్ మూవీ జనవరి 16, 2026న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లో ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ హ్యాపీ పటేల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
హ్యాపీ పటేల్ స్టోరీ
ఇద్దరు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. వీళ్లు స్వలింగ సంపర్కులు (గే). ఈ కపుల్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకుంటారు. అతనే హ్యాపీ పటేల్ (వీర్ దాస్). అతను కూడా తన తండ్రుల్లాగే స్పై ఏజెంట్ కావాలని అనుకుంటాడు.
{{/usCountry}}ఇద్దరు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. వీళ్లు స్వలింగ సంపర్కులు (గే). ఈ కపుల్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకుంటారు. అతనే హ్యాపీ పటేల్ (వీర్ దాస్). అతను కూడా తన తండ్రుల్లాగే స్పై ఏజెంట్ కావాలని అనుకుంటాడు.
{{/usCountry}}ఎంఐ7 అనే స్పై ఎజెన్సీలో చేరతాడు. కానీ అక్కడ ఫెయిల్ అవుతాడు. అయితే తాను భారత సంతతికి చెందిన వాడిని అని హ్యాపీ పటేల్ తెలుసుకుంటాడు. అదే సమయంలో గోవాలో ఓ మిషన్ కోసం అతణ్ని పంపిస్తారు. మామా (మోనా సింగ్) ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ ఫార్ములాను తయారు చేయాలనుకుంటుంది.
ఆ కంపెనీలో ఓ బ్రిటీష్ అమ్మాయిని బలవంతంగా పని చేయిస్తుంటారు. ఆమెను కాపాడటం కోసం హ్యాపీ పటేల్ గోవాకు వస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? గోవాలో పటేల్ ఏం చేశాడు? అన్నది హ్యాపీ పటేల్ సినిమాలో చూడాల్సిందే.