...
...
Next Story

Harish Shankar: షారుక్ ఖాన్ సినిమా వస్తే ఆలోచించేవాళ్లం.. ధురంధర్ 2 పోటీ కాదు: ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్

Harish Shankar: బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఉండబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమా రెండు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ధురంధర్ 2తో క్లాష్ పై ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఆ మూవీ పోటీ కాదని అన్నాడు.

Published on: Mar 12, 2026, 09:03:04 IST
Advertisement

మార్చి 19, ఉగాది.. మూవీ లవర్స్ కు ఇది నిజమైన పండగలా మారనుంది. ఓ వైపు బ్లాక్ బస్టర్ సీక్వెల్ ధురంధర్ 2, మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధురంధర్ 2తో క్లాష్ పై ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

ధురంధర్ 2 వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్

ర‌ణ్‌వీర్ సింగ్‌, పవన్ కల్యాణ్
ర‌ణ్‌వీర్ సింగ్‌, పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్, ర‌ణ్‌వీర్ సింగ్‌ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 సినిమాలు మార్చి 19న రిలీజ్ కానున్నాయి. ఒకే రోజు రెండు భారీ సినిమాలు రాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. అయితే ధురంధర్ 2తో క్లాష్ పై హరీష్ శంకర్ స్పందిస్తూ మూవీ రిలీజ్ నిర్ణయం తన చేతుల్లో లేదని అన్నాడు.

పోటీ కాదు

ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఆదిత్య ధర్ (ధురంధర్ 2 డైరెక్టర్) ఓ అద్భుతమైన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన ‘ఉరి’ మూవీ చూశా. అతను తన సినిమాలతో చాలా ప్రభావం చూపుతాడు. ఎంతో స్ఫూర్తి కలిగిస్తాడు. అయితే ధురంధర్ 2 సినిమా మాకు పోటీ కాదని నమ్ముతా. ఎందుకంటే మాకు రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి’’ అని పేర్కొన్నాడు.

షారుక్ సినిమా అయితే

‘‘పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే ఇతర సినిమాలకు ధురంధర్ 2 పోటీగా నిలుస్తుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్లో తెరకెక్కాయి. ధురంధర్ 2 స్థానంలో పాటలు, కామెడీ, ఎంటర్ టైన్మెంట్ తో నిండిన షారుక్ ఖాన్ మూవీ వస్తే అప్పుడు ఆలోచించేవాళ్లం. అది కూడా మా సినిమాలాగే ఉందని అనుకునేవాళ్లం’’ అని హరీష్ శంకర్ తెలిపాడు.

ఛాన్స్ ఉంది

నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మార్చి 19న రిలీజ్ కావాల్సిన టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమాను ఒక వారం ప్రీ పోన్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks