...
...
Next Story

Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో మైండ్ బ్లాంక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్- ఈ వీకెండ్ కు డోంట్ మిస్!

Netflix Crime Thriller: సస్పెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ లవర్స్ కు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. హాలీవుడ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘హార్ట్‌ల్యాండ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ కు ఈ మూవీ ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 14, 2026, 21:40:49 IST
Advertisement

Netflix Crime Thriller: ఓటీటీలో ప్రతి వారం కుప్పలుతెప్పలుగా కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం ఓటీటీ ఆడియన్స్ కు అదిరిపోయే థ్రిల్ అందిస్తాయి. ఈ ‘హార్ట్‌ల్యాండ్’ సినిమా కూడా అలాంటిదే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

'హార్ట్‌ల్యాండ్' కథ ఏంటంటే..

నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో మైండ్ బ్లాంక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్- ఈ వీకెండ్ కు డోంట్ మిస్!
నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో మైండ్ బ్లాంక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్- ఈ వీకెండ్ కు డోంట్ మిస్!

ఒకప్పుడు కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో సూపర్ స్టార్ గా వెలుగొందిన మిస్టీ జోన్స్ (జెస్సికా ఛాస్టెయిన్) దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తన సొంత ఊరుకు తిరిగి వస్తుంది. అప్పుడప్పుడే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఆమె 22 ఏళ్ల మేనకోడలు చార్లీ హార్ట్ (కార్టర్ ఫెయిత్) అకస్మాత్తుగా అదృశ్యం కావడమే అందుకు కారణం.

తన మేనకోడలికి ఏమైందో తెలుసుకునేందుకు మిస్టీ రంగంలోకి దిగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాలు, భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు చార్లీ ఏమైంది? ఆమె మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? అనేదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హార్ట్‌ల్యాండ్ సినిమా కథ.

సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్

దర్శకురాలు షానా ఫెస్టే (Shana Feste) ఈ సినిమాను ఒక డార్క్ మిస్టరీ థ్రిల్లర్ గా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక మనిషి మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ మిస్టరీ వైపు దారితీయడం, అడుగడుగునా అనుమానితులు పెరగడం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా గ్లామర్ గా కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వెనుక ఉన్న కుట్రలు, మోసాలను ఈ సినిమాలో చాలా బోల్డ్ గా చూపించారు.

వన్ ఉమెన్ షో

సుమారు 1 గంట 53 నిమిషాల నిడివి ఉన్న హార్ట్‌ల్యాండ్ చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను ఆస్వాదించే వారికి 'హార్ట్‌ల్యాండ్' ఒక బెస్ట్ ఆప్షన్. పైగా మన తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ కు నెట్‌ఫ్లిక్స్ లో ఈ మిస్టరీ థ్రిల్లర్ ను మీ వాచ్ లిస్ట్ లో వేసుకోండి!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks