వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటిపుల్ హీరోయిన్ హెబ్బా పటెల్. ఇటీవలే ఓ సినిమాను కమిట్ అయిన హెబ్బా పటెల్ మరో మూవీతో అలరించేందుకు రెడీ అయింది. అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీలక్ష్మీ.ఎం నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 3 రూపుదిద్దుకుంటోంది.
దర్జా డైరెక్టర్ మ్యాక్

ఈ సినిమాకి ‘దర్జా’ ఫేమ్ మ్యాక్ (సలీం) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలోనే హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఎమోషన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు మేకర్స్.
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలు
ఈ మేరకు నటీనటులు, ఇతర సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాల్ని తాజాగా ప్రకటించారు. ‘దర్జా’ మూవీతో అందరినీ మెప్పించిన మ్యాక్ (సలీం) ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.
కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా
ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునే దర్శకుడు మ్యాక్ (సలీం) ఈ సారి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి మాటలు, పాటల్ని భాష్యశ్రీ అందించనున్నారు. కేవీఆర్ అడిషనల్ స్క్రీన్ ప్లేని రాశారు. ఎం. సమీర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు.
ఇటీవలే ఆ మూవీ ఫస్ట్ లుక్
ఈ సినిమాకు విష్ణు పానికర్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్ నటించనున్నారు. మిగిలిన వివరాల్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
రేపు ఉదయం పది గంటలకు నటీనటులు
'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో హెబ్బా పటేల్‌తోపాటు చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు.
మ్యారియో ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో హెబ్బా పటేల్‌తోపాటు చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు.
మ్యారియో ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}కాగా ఇటీవలే మ్యారియో సినిమాతో అలరించిన హెబ్బా పటేల్ గతేడాది ఈషా, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, థ్యాంక్యూ డియర్, ఓదెల 2, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాలతో ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలలో మ్యారియో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక్క డ్రగ్-3 కోరికలు
బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మ్యారియో సినిమాలో హెబ్బా పటేల్ రియల్ లైఫ్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ పాత్రలో నటించింది. ఒక డ్రగ్ తీసుకుంటే విపరీతంగా పుట్టే 3 కోరికల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఇలా వరుస సినిమాలతో హెబ్బా పటేల్ టాలీవుడ్‌లో దూసుకుపోతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.