Nani About 3rd Movie With Srikanth Odela: 'దసరా' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎనలేని అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ భారీ చిత్రం 'ది ప్యారడైజ్' ఇటీవల సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది.
ది ప్యారడైజ్ కలెక్షన్స్

అయితే, మొదటి షో నుంచే ది ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఒక వర్గం మేకింగ్, రా నెరేషన్‌ను మెచ్చుకుంటుంటే, మరొక వర్గం మాత్రం కథనంలోని లోపాలను వేలెత్తి చూపింది.
ఇప్పుడిప్పుడు ది ప్యారడైజ్ సినిమాకు పాజిటివిటీ పెరుగుతూ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ది ప్యారడైజ్ చిత్రం రూ. 136 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ది ప్యారడైజ్ మూవీపై వచ్చిన నెగెటివిటీ, మిక్స్‌డ్ టాక్‌ను నాని, శ్రీకాంత్ ఓదెల విశ్లేషించుకున్నారు.
విమర్శలపై హుందాగా నాని రియాక్షన్
సాధారణంగా మిశ్రమ స్పందన వచ్చినప్పుడు చిత్ర బృందాలు సైలెంట్ అయిపోతాయి లేదా ఫలితాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తాయి. కానీ.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన దారి ఎంచుకుంది. విమర్శల పట్ల ఎంతో హుందాగా వ్యవహరించిన నాని ప్రేక్షకులు చెబుతున్న ప్రతి లోపాన్ని స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
విమర్శలను స్వీకరిస్తూ నాని సంచలన కామెంట్స్
"ఈరోజు 'ది ప్యారడైజ్' విషయంలో ప్రేక్షకులు ఇచ్చిన ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను, ఎత్తిచూపిన లోపాలను పూర్తి బాధ్యతతో స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చూపిస్తున్న నెగెటివ్‌లను మా తదుపరి పనిలో ప్లస్ పాయింట్లుగా మార్చుకుంటాం" అని నాని అన్నారు.
"శ్రీకాంత్ నుంచి వచ్చే తదుపరి సినిమా, నా నుంచి వచ్చే సినిమా లేదా మేమిద్దరం కలిసి చేసే ప్రాజెక్ట్ ఏదైనా సరే మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు అందరు ఎవరైతే సినిమా బాలేదని ఫైట్ చేస్తున్నారో వాళ్లు కూడా సెలబ్రేట్ (పండగ) చేసుకోవాలి. అలాంటి ఒకటి కచ్చితంగా తీస్తాం" అని హీరో నాని తేల్చి చెప్పారు.
లోపాలు అంగీకరించిన దర్శకుడు శ్రీకాంత్
{{/usCountry}}"శ్రీకాంత్ నుంచి వచ్చే తదుపరి సినిమా, నా నుంచి వచ్చే సినిమా లేదా మేమిద్దరం కలిసి చేసే ప్రాజెక్ట్ ఏదైనా సరే మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు అందరు ఎవరైతే సినిమా బాలేదని ఫైట్ చేస్తున్నారో వాళ్లు కూడా సెలబ్రేట్ (పండగ) చేసుకోవాలి. అలాంటి ఒకటి కచ్చితంగా తీస్తాం" అని హీరో నాని తేల్చి చెప్పారు.
లోపాలు అంగీకరించిన దర్శకుడు శ్రీకాంత్
{{/usCountry}}ది ప్యారడైజ్ సినిమా మేకింగ్‌లో జరిగిన పొరపాట్లను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం దాచకుండా ఒప్పుకున్నారు. ఎడిటింగ్ విభాగంలో దొర్లిన కొన్ని పొరపాట్ల వల్లే కథనం సరిగ్గా ప్రేక్షకులకు చేరలేకపోయిందని ఆయన తెలిపారు. అయితే ఈ అనుభవాలు తనను మరింత రాటుదేలేలా చేశాయని, రాబోయే సినిమాలో ప్రతీ లోపాన్ని సరిదిద్ది పవర్‌ఫుల్ అవుట్‌పుట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కథనంపై వస్తున్న ప్రతికూల వ్యాఖ్యలను నాని ఎంతో పాజిటివ్‌గా విశ్లేషించారు. "సినిమా నచ్చలేదనే వారిలో ఎంత కోపం ఉందో, నచ్చిందనే వారిలోనూ అంతే ఆవేశం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక సినిమాపై అభిప్రాయం మాత్రమే కాదు, మా కాంబినేషన్‌పై ప్రేక్షకులు ఉన్న అమితమైన నమ్మకానికి నిదర్శనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి భవిష్యత్తులో మరింత సత్తా చాటుతాం" అని నాని స్పష్టం చేశారు.
హ్యాట్రిక్ కాంబోపై అభిమానుల్లో జోష్
సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద తడబడితే హీరోలు, దర్శకులు ఆ కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి సాహసించరు. కానీ, లోపాలను నిక్కచ్చిగా ఒప్పుకుంటూనే, "మా ప్రయాణం ఆగదు.. నెక్ట్స్ కొడితే అందరి నోళ్లూ మూతపడాల్సిందే" అనే రీతిలో నాని, శ్రీకాంత్ మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికీ అయితే అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా ఖాయమని తెలియడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ది ప్యారడైజ్ విడుదల తర్వాత పోస్ట్ రిలీజ్ టాక్స్ ఇంటర్వ్యూలో హీరో నాని ఈ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది.