టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.
శంబాల విజయోత్సవ వేడుక

డిసెంబర్ 25న విడుదలైన హారర్ మిస్టరీ థ్రిల్లర్ శంబాల థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "‘శంబాల’ హిట్ అవ్వడంతో అందరూ నాకు ఫోన్ చేసి ‘మీ ఫ్రెండ్ హిట్టు కొట్టాడు’ కంగ్రాట్స్ అని మెసెజ్ చేస్తున్నారు. నిజాయితీగా సినిమా తీస్తే, మంచి వ్యక్తి కష్టపడి సినిమా చేస్తే హిట్ ఇస్తారని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు" అని అన్నాడు.
"ఓ మూవీ సక్సెస్ అయితే అది కేవలం టీంకే చెందదు. ఆ విజయం ఇండస్ట్రీలో ఎంతో మందిలో స్పూర్తిని నింపుతుంది. నిర్మాతలైన రాజశేఖర్ గారు, మహీధర్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడు యుగంధర్ ముని చాలా అద్భుతంగా ఈ మూవీని తీశారు. రాజేష్ దండా ఈ మూవీని ముందే చూసి హిట్ అని చెప్పేశారు" అని సందీప్ కిషన్ తెలిపాడు.
సంపాదించి ఇవ్వలేరు
"ఆదికి సాయి కుమార్ సంపాదించి పెట్టినంత మంచితనం ఇంకెవ్వరూ సంపాదించి ఇవ్వలేరు. ఆదికి హిట్టు వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ మూవీని తీస్తున్నాను. నా ప్రొడక్షన్‌లో అదే బెస్ట్ మూవీగా నిలుస్తుంది" అని సందీప్ కిషన్ వెల్లడించాడు.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. "శంబాల సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అడిగిన వెంటనే వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. సినిమా చూసి మరీ ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ జర్నీలో ఇండస్ట్రీలో నుంచి ఎంతో మంది నాకెంతో సపోర్ట్ చేశారు. మా ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ అని కూడా ప్రభాస్ గారు పోస్ట్ పెట్టారు. నాకు హిట్టు పడాలని అందరూ సపోర్ట్ చేశారు" అని అన్నాడు.
{{/usCountry}}ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. "శంబాల సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అడిగిన వెంటనే వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. సినిమా చూసి మరీ ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ జర్నీలో ఇండస్ట్రీలో నుంచి ఎంతో మంది నాకెంతో సపోర్ట్ చేశారు. మా ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ అని కూడా ప్రభాస్ గారు పోస్ట్ పెట్టారు. నాకు హిట్టు పడాలని అందరూ సపోర్ట్ చేశారు" అని అన్నాడు.
{{/usCountry}}"మా డైరెక్టర్ యుగంధర్ గారు ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ప్రతీ క్రెడిట్ ఆయనకే దక్కాలి. యుగంధర్ పడిన కష్టమే ఇదంతా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్ చేసిన నిర్మాతలిద్దరికీ థాంక్స్. మళ్లీ మేమంతా కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అర్చన గారికి థాంక్స్" అని ఆది సాయి కుమార్ చెప్పాడు.
కొత్త ఆదిని చూస్తారు
"‘శంబాల’లో పని చేసిన, సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క నటుడికి థాంక్స్. శ్రీ చరణ్ పాకాల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ‘శంబాల’ కోసం టెక్నికల్ టీం చాలా కష్టపడింది. ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి. కచ్చితంగా నిరాశపడరు" అని ధీమా వ్యక్తం చేశారు ఆది సాయి కుమార్.
"మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుతున్నాను. మా మూవీని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, మీడియాకి థాంక్స్. ఇకపై కొత్త ఆదిని చూస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి సినిమాలు చేస్తాను" అని ఆది సాయి కుమార్ చెప్పుకొచ్చాడు.