...
...
Next Story

Vijay Deverakonda Scholarships : విజయ్ దేవరకొండ మంచి మనసు - ప్రభుత్వ బడి విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఈ ఏడాది నుంచే..!

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన భార్య రష్మికతో కలిసి ఫస్ట్ టైం తన సొంతూరు తుమ్మనపేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామని ప్రకటించారు.

Published on: Mar 3, 2026, 07:32:57 IST
Advertisement

ఇటీవల పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు విజయ్ సొంతూరు అయిన తుమ్మనపేటలో(నాగర్ కర్నూల్ జిల్లా) సందడి చేశారు. సోమవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.

44 స్కూళ్లలో స్కాలర్‌షిప్‌లు. - విజయ్‌ దేవరకొండ ప్రకటన
44 స్కూళ్లలో స్కాలర్‌షిప్‌లు. - విజయ్‌ దేవరకొండ ప్రకటన

పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ దంపతులకు గ్రామస్తులు కొత్త దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

స్కాలర్ షిప్స్ ప్రకటన

పెళ్లి చేసుకున్న శుభ సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్ షిప్స్ ప్రకటించారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేస్తామని వెల్లడించారు.

"మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తాం” అని హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు.

భద్రతా కారణాల దృష్ట్యా అతిథుల జాబితాను పరిమితం చేసినట్లు సమాచారం. అభిమానులు వేడుక జరిగే ప్రాంతానికి రావొద్దని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని పోలీసులు, నిర్వహకులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks