...
...
Next Story

Amala Paul: నగ్నంగా నటించడం అందమైన కళాత్మక అనుభవం- కానీ మళ్లీ ఆ తప్పు చేయను: న్యూడ్ సీన్‌పై హీరోయిన్ అమలా పాల్ కామెంట్స్

Amala Paul About Nude Scene In Aame Movie: 2019లో వచ్చిన చిత్రం 'ఆమె'లో న్యూడ్ వంటి బోల్డ్ సీన్‌లో నటించడంపై హీరోయిన్ అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ఇమేజ్ దెబ్బతింటుందేమోనని భయపడ్డానని, కానీ అలా నటించడం అందమైన కళాత్మక అనుభవం అని హీరోయిన్ అమలా పాల్ పేర్కొన్నారు.

Published on: Oct 1, 2026, 13:40:00 IST
Advertisement

Amala Paul About Nude Scene In Aame Movie: చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు నటీనటులకు నటన పరంగా గొప్ప పేరు తెచ్చిపెడితే, మరికొన్ని సినిమాలు వారి కెరీర్‌లోనే పెద్ద సాహసాలుగా మిగిలిపోతాయి. అలాంటి విభిన్నమైన ప్రయత్నమే హీరోయిన్ అమలా పాల్ చేసిన 'ఆడై' (తెలుగులో 'ఆమె').

అప్పట్లో పెద్ద సంచలనం

నగ్నంగా నటించడం అందమైన కళాత్మక అనుభవం- కానీ మళ్లీ ఆ తప్పు చేయను: న్యూడ్ సీన్‌పై హీరోయిన్ అమలా పాల్ కామెంట్స్
నగ్నంగా నటించడం అందమైన కళాత్మక అనుభవం- కానీ మళ్లీ ఆ తప్పు చేయను: న్యూడ్ సీన్‌పై హీరోయిన్ అమలా పాల్ కామెంట్స్

2019లో విడుదలైన ఈ ఆమె చిత్రంలో ఒక కీలక సన్నివేశం కోసం అమలా పాల్ నగ్నంగా నటించి అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సినిమా విశేషాలను, ఆ సమయంలో తాను పడిన మానసిక మథనాన్ని అమలా పాల్ పంచుకున్నారు.

దర్శకుడిపై నమ్మకంతోనే ఆ సాహసం!

'ఇండియా టుడే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ మాట్లాడుతూ.. 'ఆడై' కథ విన్నప్పుడు మొదట తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని తెలిపారు. "ఈ సినిమాలో న్యూడ్ సీన్ కథాక్రమంలో భాగమా? లేక కేవలం ప్రచారం కోసం వాడుకుంటున్నారా? అనే సందేహం నన్ను వేధించింది" అని అమలా పాల్ చెప్పారు.

దాదాపు రెండు నెలల సమయం

"కథలోని భావోద్వేగాలను సరిగ్గా చూపించాలనే ఉద్దేశంతోనే ఆ సీన్ రాసుకున్నారని అర్థం చేసుకోవడానికి, దర్శకుడు రత్నకుమార్, ఛాయాగ్రాహకుడిని నమ్మడానికి నాకు దాదాపు రెండు నెలల సమయం పట్టింది. నన్ను పూర్తిగా ఒప్పించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను" అని అమలా పాల్ పేర్కొన్నారు.

అయితే, ఆమె చిత్రీకరణ సమయంలో సెట్‌లో చాలా తక్కువ మంది సిబ్బందిని మాత్రమే ఉంచి, తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి అనుకూల వాతావరణాన్ని కల్పించారని అమలా పాల్ వెల్లడించారు. ఒక నటిగా ఆ సన్నివేశంలో నటించడం తనకు ఒక అందమైన కళాత్మక అనుభవంగా మారిందని చెప్పారు.

ఇప్పుడు ఆ తప్పు మళ్లీ చేయను!

వీ స్టూడియోస్ నిర్మాణంలో రత్నకుమార్ తెరకెక్కించిన 'ఆడై' చిత్రంలో అనన్య రామ్‌ప్రసాద్, వివేక్ ప్రసన్న, రమ్య సుబ్రమణియన్ ముఖ్య పాత్రలు పోషించారు. కామిని (అమలా పాల్) అనే స్వేచ్ఛాభావాలు ఉన్న టీవీ రిపోర్టర్, ఒక రాత్రి స్నేహితులతో పార్టీ చేసుకున్నాక పాడైన భవనంలో ఒంటిపై నూలుపోగు లేకుండా మేల్కొంటుంది.

అమలా పాల్ సినిమాలు

ఆ పరిస్థితి నుంచి ఆమె ఎలా బయటపడింది అనే కథాంశంతో ఈ సర్వైవల్ థ్రిల్లర్ సాగుతుంది. ఇక అమలా పాల్ కెరీర్ విషయానికి వస్తే.. 2024లో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ఆమె నటించిన 'ది గోట్ లైఫ్' (ఆడుజీవితం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత ఆసిఫ్ అలీతో కలిసి మలయాళంలో 'లెవెల్ క్రాస్' అనే సైకలాజికల్ డ్రామాలోనూ మెప్పించారు అమలా పాల్. ప్రస్తుతం ఆమె తన తదుపరి చిత్రాలను ప్రకటించాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks