తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది బ్యూటిపుల్ ముద్దుగుమ్మ పాయల్ రాధాకృష్ణ. అలా నిన్ను చేరి, ప్రసన్నవదనం, చౌర్యపాఠం వంటి సినిమాలతో ఆకట్టుకున్న పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ రిలీజ్

యంగ్ హీరో త్రిగుణ్‌తో పాయల్ రాధాకృష్ణ జోడీ కట్టిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకు మధుదీప చెలికాని కథ, దర్శకత్వం వహించారు. అరవింద్ మండెం నిర్మించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ.
వ్యవసాయం మీద
పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిల్మ్. కానీ, పూర్తవ్వడానికి ఈ టైమ్ పట్టింది. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. కథ చెప్పినప్పుడు నేను చాలా పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను" అని తెలిపింది.
ఇండస్ట్రీలో ఉండటానికి కారణం
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్‌గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని అన్నారు.
ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుదంటే
"చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అని చెప్పారు డైరెక్టర్ మధుదీప్ చెలికాని.
హత్తుకునేలా ఉంటుంది
{{/usCountry}}"చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అని చెప్పారు డైరెక్టర్ మధుదీప్ చెలికాని.
హత్తుకునేలా ఉంటుంది
{{/usCountry}}"తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా ఉంటుంది. హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మాది 5 ఏళ్ల జర్నీ. మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము" అని డైరెక్టర్ వెల్లడించారు.
చిరునవ్వు ఎక్కడికి పోదు
"బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు" అని మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ దర్శకుడు మధుదీప్ చెలికాని ధీమా వ్యక్తం చేశారు.