...
...
Next Story

Vedha Jalandharr: నేను చేసిన ఆ రెండు సినిమాలు రిలీజ్ కాలేదు, ఇందులో మా అమ్మలాగే నా క్యారెక్టర్ ఉంది:హీరోయిన్ వేధా జలంధర్

Ameer Log Heroine Vedha Jalandhar On Mother: తిమ్మరాజు పల్లి టీవీతో తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ వేధా జలంధర్ నటించిన కొత్త సినిమా అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా నటించిన అమీర్ లోగ్, తన తల్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వేధా జలంధర్ చెప్పారు.

Published on: Aug 20, 2026, 09:21:02 IST
Advertisement

Heroine Vedha Jalandhar Comments On Mother And Ameer Log: తెలుగులో వస్తున్న హైదరాబాదీ చిత్రం ‘అమీర్ లోగ్’. 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ఇది. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు.

ముగ్గురు హీరోలు, ఒక హీరోయిన్

నేను చేసిన ఆ రెండు సినిమాలు రిలీజ్ కాలేదు, ఇందులో మా అమ్మలాగే నా క్యారెక్టర్ ఉంది:హీరోయిన్ వేధా జలంధర్
నేను చేసిన ఆ రెండు సినిమాలు రిలీజ్ కాలేదు, ఇందులో మా అమ్మలాగే నా క్యారెక్టర్ ఉంది:హీరోయిన్ వేధా జలంధర్

అమీర్ లోగ్ సినిమాలు ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా చేయగా.. బ్యూటిఫుల్ వేధా జలందర్ హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు.

హీరోయిన్ వేధా జలంధర్

రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో హీరోయిన్ వేధా జలంధర్ సినిమా విశేషాలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

మీ జర్నీ గురించి చెప్పండి?

నేను 2019లోనే కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాయి. కానీ, అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకోవడం, సినిమాలు చేస్తున్న ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

నేను ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టుగా మా దర్శకుడు రమణ గారికి తెలీదు. బషీర్ మాస్టర్ మాకు ఈ మూవీ ఆడిషన్స్ గురించి చెప్పారు. నేను ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో రమణ గారు వెంటనే ఓకే చెప్పారు.

ఇప్పటి వరకు ‘అమీర్ లోగ్‌’ చూసిన వారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి?

‘అమీర్ లోగ్’ సినిమా చూసిన వారంతా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నా వర్క్ అందరికీ నచ్చుతోంది. నేను చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినా అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటున్నాను.

‘అమీర్ లోగ్’ చిత్రంలో బిర్యానీ గురించే ఎక్కువగా ఉంటుందట?

‘అమీర్ లోగ్’ సినిమాలో బిర్యానీది మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కథలో ఆ ఎలిమెంట్ బాగా కుదిరింది. మా చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

భాష, యాస వల్ల ఏమైనా సమస్య వస్తుందా? అందరికీ అర్థం అవుతుందా?

భాష, యాసతో మా సినిమాకి ఎలాంటి సమస్య రాదు. ఎమోషన్ అనేది అందరికీ కామన్. ఎక్కడైనా ఎమోషన్ అనేది ఒకేలా ఉంటుంది. మా చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అన్ని ప్రాంతాల వారిని మెప్పించేలా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe