Hey Balwanth OTT:శవాన్ని ఎందుకు ఎత్తుకెళ్లారు? అసలు ఆ బిజినెస్ ఏంటీ? ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్
Hey Balwanth OTT: సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు. తండ్రి చేసే బిజినెస్ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది.
ఓటీటీలోకి తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. సుహాస్ హీరోగా వచ్చిన ‘హే బల్‌వంత్’ మూవీ రీసెంట్ గా థియేటర్లో నవ్వులు పంచింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. హే బల్‌వంత్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.

హే బల్‌వంత్ ఓటీటీ
ఓ వైపు కామెడీ పండిస్తూనే, మరోవైపు మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ సాగిపోతున్నాడు యువ హీరో సుహాస్. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ లేటెస్ట్ మూవీ ‘హే బల్‌వంత్’. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 31, 2026 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.
అఫీషియల్ అనౌన్స్ మెంట్
హే బల్‌వంత్ మూవీ ఓటీటీ రిలీజ్ పై శుక్రవారం (మార్చి 27) అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మార్చి 31 నుంచి ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జీ5 తెలుగు ప్రకటించింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో సుహాస్ కు జోడీగా శివాని నాగారం హీరోయిన్ గా నటించింది.
థియేటర్ రెస్సాన్స్
హే బల్‌వంత్ మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. దీనికి గోపీ అచ్చర డైరెక్టర్. ఇందులో సుహాస్, శివానీతో పాటు సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి, సుదర్శన్, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది.
హే బల్‌వంత్ స్టోరీ
తండ్రి చేసే బిజినెస్ టేకోవర్ చేయాలనుకునే కొడుకుకు ఆ బిజినెస్ ఏంటీ అని తెలిసిన తర్వాత వచ్చే పరిస్థితుల చుట్టూ అల్లుకున్న కథనే హే బల్‌వంత్ మూవీ. కృష్ణ (సుహాస్) చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. తండ్రి రావు బల్‌వంత్ (నరేష్) అతనికి రోల్ మోడల్. తండ్రి బిజినెస్ ను టేకోవర్ చేయాలని చిన్నప్పటి నుంచి కృష్ణ కల కంటాడు.
ఆ బిజినెస్ ఏంటీ?
చదువు కంప్లీట్ కాగానే బిజినెస్ మొత్తం తనకు అప్పగించమని తండ్రిని కృష్ణ ఫోర్స్ చేస్తాడు. చివరకు తండ్రి అందుకు ఒప్పుకొంటాడు. కానీ ఆ బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత కృష్ణ షాక్ అవుతాడు. ఆ బిజినెస్ కారణంగానే తన లవర్ మిత్ర (శివానీ) కృష్ణకు దూరమవుతుంది.
అసలు ఆ బిజినెస్ ఏంటీ? మిత్ర తాత (బాబు మోహన్) అదే బిజినెస్ దగ్గరకు వచ్చి చనిపోవడంతో తలెత్తిన పరిస్థితి ఏంటీ? అసలు ఆ శవాన్ని యువన్ (వెన్నెల కిశోర్) ఎందుకు ఎత్తుకెళ్లాడు? అనేది హే బల్‌వంత్ మూవీ చూస్తేనే తెలుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


