కన్నడ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. అక్టోబర్ 4న తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బెంగళూరులోని నిత్యా హోటల్ సమీపంలో దివ్య సురేష్ కారు బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ధృవీకరించిన తరువాత పోలీసులు దివ్యపై కేసు నమోదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు

అక్టోబర్ 7న బాధితుల కజిన్ కిరణ్ జి (25) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ తన కజిన్స్ అయిన అనూషా (33), అనిత (24)లతో కలిసి బైక్ నడుపుతూ వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన నల్ల కారు వారిని ఢీకొట్టింది. దాంతో ముగ్గురు రోడ్డుపై పడ్డారు.
ఈ యాక్సిడెంట్‌లో అనిత కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే, కిరణ్, అనూషకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అనిత వైద్య సంరక్షణలో నిమగ్నమై ఉన్నందున ఫిర్యాదు దాఖలు చేయడంలో ఆలస్యం అయిందని కిరణ్ పోలీసులకు చెప్పాడు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి
అయితే, యాక్సిడెంట్ తర్వాత వారికి ఏమైందో అని కూడా చూడకుండా కారు నడిపిన వారు ఆపకుండా పారిపోయినట్లు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్)లో పేర్కొన్నారు. కిరణ్ కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిని పోలీసులు యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
యాక్సిడెంట్ చేసిన కారు దివ్య సురేష్‌దిగా గుర్తించిన పోలీసులు ఆమెను విచారించారు. అనంతరం కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. ఇక అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు, ట్రీట్‌మెంట్‌కు రూ. 2 లక్షలు ఖర్చు అయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు.
సెక్షన్ 281, సెక్షన్ 125 కింద కేసులు
బుల్లితెర నటి దివ్య సురేష్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టామని బయతారాయనపుర ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎం.పుట్టమ్మ తెలిపారు. దివ్యపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 281 కింద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు, ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యలకు సెక్షన్ 125 ఏ కింద కేసు నమోదు చేశారు.
{{/usCountry}}బుల్లితెర నటి దివ్య సురేష్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టామని బయతారాయనపుర ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎం.పుట్టమ్మ తెలిపారు. దివ్యపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 281 కింద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు, ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యలకు సెక్షన్ 125 ఏ కింద కేసు నమోదు చేశారు.
{{/usCountry}}ఇకపోతే దివ్య సురేష్ చేసిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కిరణ్ వాళ్లు కలిసి బైక్‌లో ఆస్పత్రికి వెళ్తున్నారు. మరోవైపు దివ్య తన కారులో వస్తోంది. ఓ మూల వద్ద ఎదురుపడిన బైక్‌ను దివ్య తన కారుతో ఢీ కొట్టింది. దాంతో ముగ్గురు రోడ్డు పక్కన పడిపోయారు.
దివ్య సురేష్ సినిమాలు
ఇదిలా ఉంటే, దివ్య సురేష్ కన్నడలో చాలా సినిమాలు చేసింది. బిగ్ బాస్ షో ద్వారా కూడా అలరించింది. అలాగే, తెలుగులో టెంప్ట్ రాజా, థర్డ్ క్లాస్ వంటి సినిమాల్లో కూడా దివ్య సురేష్ హీరోయిన్‌గా చేసింది. రౌడీ బేబీ, హిరణ్య, టెంప్ట్ రాజా, 3rd క్లాస్, హులిరయ, 9 హిల్టన్ హౌజ్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది కన్నడ బ్యూటి దివ్య సురేష్.