Anne Hathaway Reacts To Fake Pregnancy Trolls: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే (Anne Hathaway) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' (The End of Oak Street) సినిమా ప్రీమియర్ షోలో ఆమె ధరించిన అవుట్‌ఫిట్, అన్నే హాత్వే బేబీ బంప్ హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
నీచమైన కామెంట్స్
ప్రస్తుతం 4 నుంచి 5 నెలల గర్భంతో ఉన్న అన్నే హాత్వే.. హాల్టర్ టాప్, లో-రైజ్ జీన్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిసారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆమె బేబీ బంప్ నకిలీదంటూ నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై అన్నే హాత్వే తనదైన శైలిలో స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా చురకలు!
ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ప్రీమియర్ షోకి సిద్ధమవుతున్న సమయంలో తీసిన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను అన్నే హాత్వే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. సుమారు 95 డిగ్రీల తీవ్రమైన ఎండలో ప్రదర్శనకు సిద్ధమవ్వడానికి ఆమె టీమ్ పడిన కష్టాన్ని ఈ వీడియోలో చూపించారు.
హెయిర్ స్టైలిస్ట్ అన్నే హాత్వే జుట్టును సరిచేస్తున్నప్పుడు నవ్వుతూ "ఇది నా సొంత జుట్టు కాదు" అని వ్యాఖ్యానించారు. సెలెస్టియల్ బ్లూ, క్రైమ్సన్ సిల్క్ మి కాడో ఫ్యాబ్రిక్‌తో ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన ప్రత్యేకమైన టాప్‌ను ధరించి అన్నే హాత్వే కెమెరాలకు విజువల్ ట్రీట్ ఇచ్చారు.
ఈ వీడియోకు.. "నకిలీ జుట్టు (ఫేక్ హెయిర్).. నిజమైన కడుపు (రియల్ బంప్)!" అని అన్నా హత్వే క్యాప్షన్ రాసుకొచ్చారు. దీని ద్వారా తన జుట్టు ఎక్స్‌టెన్షన్ మాత్రమే నకిలీదని, బేబీ బంప్ పూర్తిగా నిజమైనదని స్పష్టం చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించారు అన్నా హత్వే.
43 ఏళ్ల వయసులో మూడో సంతానం
భర్త ఆడమ్ షుల్మాన్‌తో కలిసి అన్నా హత్వే మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే జోనాథన్ (10), జాక్ (6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 43 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం దాల్చడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
{{/usCountry}}భర్త ఆడమ్ షుల్మాన్‌తో కలిసి అన్నా హత్వే మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే జోనాథన్ (10), జాక్ (6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 43 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం దాల్చడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
{{/usCountry}}"ఈ వయసులో మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటాయి. అందుకే మేం ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. కానీ దేవుడు మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నా హత్వే వ్యాఖ్యానించారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో వేసుకునే ఫ్యాషన్ దుస్తులను ఎంజాయ్ చేయడం చాలా సరదాగా ఉందని, ఈ క్షణాలు జీవితాంతం ఉండవు కాబట్టి ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు.
సినిమాల విషయానికొస్తే..
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మల్టీ స్టారర్ భారీ చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) లో అన్నా హత్వే హీరోయిన్‌గా కనిపించారు. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు నటించిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతోంది.
ప్రస్తుతం అన్నా హత్వే చేతిలో 'వెరిటీ' అనే ఎరోటిక్ థ్రిల్లర్‌తో పాటు 'ఎలోన్ ఎట్ డాన్' అనే వార్ డ్రామా సినిమాలు ఉన్నాయి.