కాలనీలో డైనోసార్ల విధ్వంసం, ప్రాణాల కోసం కుటుంబం పోరాటం- నోరెళ్లబెట్టించేలా ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ తెలుగు ట్రైలర్!

The End Of Oak Street Telugu Trailer Released: హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. డైనోసార్ల అరాచకం, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ఇండియన్ థియేటర్లు, ఐమాక్స్‌లలో విడుదల కానుంది.

Published on: Jul 23, 2026, 12:51:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The End Of Oak Street Telugu Trailer Released: హాలీవుడ్ తెరపై డైనోసార్ల హంగామా అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ పండగే. ‘జురాసిక్ పార్క్’, ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్‌ల తర్వాత మళ్లీ ఆ స్థాయి విజువల్ వండర్‌తో మైండ్ బ్లాక్ చేయడానికి వచ్చేస్తోంది 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' (The End of Oak Street).

కాలనీలో డైనోసార్ల విధ్వంసం, ప్రాణాల కోసం కుటుంబం పోరాటం- నోరెళ్లబెట్టించేలా ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ తెలుగు ట్రైలర్!
కాలనీలో డైనోసార్ల విధ్వంసం, ప్రాణాల కోసం కుటుంబం పోరాటం- నోరెళ్లబెట్టించేలా ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ తెలుగు ట్రైలర్!

ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ తెలుగు ట్రైలర్

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తెలుగులో కూడా విడుదల చేశారు. ఊహించని రోదసి ప్రమాదం కారణంగా ఒక వీధి మొత్తం వింత ప్రదేశంలోకి కొట్టుకుపోవడం, అక్కడ తిరిగే అతి భారీ డైనోసార్ల మధ్య ఓ కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి పడే తపనతో ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది.

కథలో సరికొత్త ట్విస్ట్.. ప్లాట్ ఫ్యామిలీ పోరాటం

ఈ కథలో ప్లాట్ (Platt) కుటుంబం చుట్టూ జరిగే సంఘటనలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. కాలనీలోని ఓక్ స్ట్రీట్ ఒక్కసారిగా మనుషులు ఊహించని వింత ప్రపంచంలోకి ప్రత్యక్షమవుతుంది. ఆ చుట్టుపక్కల విచ్చలవిడిగా తిరిగే భయంకరమైన డైనోసార్లను చూసి ఆ వీధి ప్రజలు హడలిపోతారు.

అక్కడ జీవించాలంటే ఆ కుటుంబం ఒకరికొకరు తోడుగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం విజువల్స్, డైనోసార్ల విధ్వంసమే కాకుండా ఈ సినిమాలో భావోద్వేగాలు కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

"ఇది కేవలం రాక్షస బల్లుల వినాశనం గురించిన సినిమా మాత్రమే కాదు.. భయంకరమైన రాక్షసుల మధ్య ఒక కుటుంబం ఆత్మీయతతో ఎలా నిలబడింది అని చెప్పే కథ" అని ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జేజే అబ్రామ్స్ వివరించారు. ఈ సినిమా ఐడియా ఎలా వచ్చిందో దర్శకుడు డేవిడ్ రాబర్ట్ మిచెల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

డోర్ దగ్గర డైనోసార్ ఆలోచనతో పుట్టిన కథ

"నాకు ఎప్పటినుంచో ఒక మంచి డైనోసార్ సినిమా తీయాలనే కోరిక ఉండేది. కొన్నేళ్ల కిందట మా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇంటి గ్యారేజ్, చెత్త డబ్బాల పక్కన నిజంగానే ఒక పెద్ద డైనోసార్ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది. ఆ సమయంలో నా మనసులో కలిగిన వింత అనుభూతినే స్క్రిప్ట్‌గా మార్చి ఈ సినిమా రూపొందించాను" అని దర్శకుడు తెలిపారు.

భారీ స్టార్ కాస్ట్.. ఆగస్టు 14న ఐమాక్స్‌లో గ్రాండ్ రిలీజ్

హాలీవుడ్ స్టార్ నటి అన్నే హాత్వే (Anne Hathaway), ఈవాన్ మెక్‌గ్రెగర్ (Ewan McGregor) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మైసీ స్టెల్లా, క్రిస్టియన్ కాన్వెరీ కీలక పాత్రలు పోషించారు. బాడ్ రోబోట్ ప్రొడక్షన్, జాక్సన్ పిక్చర్స్ భాగస్వామ్యంతో వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

మైకేల్ జియాచినో అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రతి క్షణాన్ని మరింత గూస్‌బంప్స్ తెప్పించేలా మార్చింది. మనదేశంలో ఈ సినిమాకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14, 2026న ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ సినిమాను భారతీయ థియేటర్లతో పాటు ఐమాక్స్ (IMAX) స్క్రీన్లపై అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విజువల్ వండర్ కోసం

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లోని ఐమాక్స్ థియేటర్లలో ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ సినిమా విజువల్ వండర్‌ను ఆస్వాదించడానికి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More