ఇండస్ట్రీలో మరో విషాదం- 5 రోజుల్లో బర్త్ డే, 36 ఏళ్ల నటి అనుమానాస్పద మృతి- బాలనటిగా ఎంట్రీ, క్యాస్టింగ్ కౌచ్ బయటపెట్టి!
Hayden Panettiere Death At 36: హీరోస్ ఓటీటీ సిరీస్ ఫేమ్, ప్రముఖ హాలీవుడ్ నటి హేడెన్ పానెటియర్ (36) అకాల మరణం చెందారు. ఆమె మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 37వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ఆమె కన్నుమూయడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Hayden Panettiere Death At 36: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'హీరోస్'తో ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి హేడెన్ పనెటియర్ (36) ఆగస్ట్ 16న అకస్మాత్తుగా కన్నుమూశారు. 37వ ఏట అడుగుపెట్టడానికి కేవలం కొద్ది రోజుల ముందే ఆమె మరణించడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.

ప్రియమైన హేడెన్ ఇక లేరు
ఈ విషాద వార్తను ఆమె ప్రతినిధి మీడియాకు అధికారికంగా ధృవీకరించారు. "మా అందరికీ ఎంతో ప్రియమైన హేడెన్ ఇకలేరనే వార్తను తీవ్ర దుఃఖంతో పంచుకుంటున్నాం. ఆమె తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులకు ఎనలేని సంతోషాన్ని అందించారు" అని నటి ప్రతినిధి పేర్కొన్నారు.
తండ్రి భావోద్వేగ ప్రకటన
తన కుమార్తె హేడెన్ పనేటియర్ మరణంపై తండ్రి అలన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "మా ప్రియమైన హెడెన్ మరణ వార్తను ఎంతో భారమైన హృదయంతో పంచుకుంటున్నాం. ఆమె ఒక అద్భుతమైన ప్రతిభావంతురాలు. తనను నేరుగా చూసిన వారికే కాకుండా, వెండితెరపై ఆమె నటనను ఆస్వాదించిన లక్షలాది మందికి ఆమె ఎంతో సంతోషాన్ని, ప్రేమను పంచింది" అని అలన్ ప్రకటించారు.
పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు
అయితే, హేడెన్ మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె ఇంట్లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
బాలనటి నుంచి హాలీవుడ్ స్టార్‌గా..
నాలుగేళ్ల చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో బాలనటిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన హేడెన్ పనెటియర్, అనతికాలంలోనే ప్రముఖ నటిగా ఎదిగారు. 2006 నుంచి 2010 వరకు విపరీతమైన ఆదరణ పొందిన 'హీరోస్' సైన్స్ ఫిక్షన్ ఓటీటీ సిరీస్‌లో 'క్లైర్ బెన్నెట్' పాత్రలో ఆమె చూపిన అద్భుత నటన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
ఆ తర్వాత 'నాష్‌విల్' సిరీస్‌లో కంట్రీ సింగర్ జూలియట్ బార్నెస్ పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు హేడెన్ పనేటియర్. టీవీ సిరీస్‌లతో పాటు 'రిమెంబర్ ది టైటాన్స్', 'రైజింగ్ హెలెన్', 'ఐస్ ప్రిన్సెస్', 'స్క్రీమ్ 4' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నత ప్రతిభ చాటారు. నటిగానే కాకుండా 'కింగ్‌డమ్ హార్ట్స్', 'అంటిల్ డాన్' వంటి వీడియో గేమ్‌లకు వాయిస్ ఓవర్ అందించి గేమింగ్ ప్రియులను సైతం అలరించారు.
జీవిత చరిత్రలో చేదు అనుభవాలు,
తన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను, మానసిక సంఘర్షణలను హేడెన్ పనేటియర్ ఎప్పుడూ దాచలేదు. ఈ ఏడాదే 'దిస్ ఈజ్ మీ: ఏ రెకనింగ్' పేరుతో విడుదల చేసిన తన జీవిత చరిత్ర (Memoir) పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గర్భధారణ తర్వాత ఎదుర్కొన్న డిప్రెషన్ (Postpartum Depression), మద్యం అలవాటు నుంచి బయటపడటానికి పడిన ఇబ్బందులను అందులో హేడెన్ పంచుకున్నారు.
అంతేకాకుండా, హాలీవుడ్‌లో ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు తన పట్ల ప్రవర్తించిన తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఆ నటుడు తన దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడని, వెంటనే తాను అక్కడి నుంచి బయటపడ్డానని రాసుకొచ్చారు.
కాస్టింగ్ కౌచ్ బయటపెట్టి..
అట్టహాసంగా కనిపించే హాలీవుడ్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని, కాస్టింగ్ కౌచ్‌ను హేడెన్ పనేటియర్ ధైర్యంగా బయటపెట్టి ఎండగట్టారు. ఆగస్టు 21న హేడెన్ 37వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో హేడెన్ పనేటియర్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


