ఇండియన్ సినిమా 'గ్రీక్ గాడ్' హృతిక్ రోషన్ శనివారం (జనవరి 10) తన 52వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా మారుతున్న హృతిక్‌ని చూస్తే.. అతనికి 52 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అతడు నటించిన 'వార్-2' కోసం హృతిక్ మేకోవర్ చూసి చాలా మంది షాక్ తిన్నారు. మరి ఐదు పదుల వయసు దాటినా అతడు ఇంత స్ట్రాంగ్‌గా, సిక్స్ ప్యాక్‌తో మెరవడానికి కారణమేంటి? అతని డైట్, వర్కౌట్ రొటీన్ ఏంటి? ఇక్కడ తెలుసుకోండి.
హృతిక్ రోషన్ వర్కౌట్స్ ఇలా..

చాలా మంది మంచి బాడీ షేప్ కోసం జిమ్ కు వెళ్తారు. కానీ దానిని అంత సీరియస్ గా తీసుకోరు. హృతిక్ రోషన్ మాత్రం నిలకడను నమ్ముతాడు. వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు కచ్చితంగా వర్కౌట్ చేస్తాడు. తన రోజును 20 నిమిషాల హై-ఇంటెన్సిటీ కార్డియోతో ప్రారంభిస్తాడు. ఇందులో రన్నింగ్, సైక్లింగ్ లేదా బీచ్ జాగింగ్ ఉంటాయి.
ఇక అతడు రోజుకో బాడీ పార్ట్‌పై ఫోకస్ పెడతాడు. అంటే చెస్ట్, బైసెప్స్, థైస్ ఇలా. అయితే బరువులు ఎత్తడం కంటే వాటిని చేసే విధానం ముఖ్యం అని హృతిక్ నమ్ముతాడు. కేవలం కండలు పెంచడమే కాకుండా.. బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి క్రాస్ ఫిట్, యోగా కూడా అతని రొటీన్‌లో భాగం. హృతిక్ బరువులు ఎత్తేటప్పుడు చాలా నెమ్మదిగా, కండరాలపై ఒత్తిడి పడేలా చేస్తాడు. దీనివల్ల గాయాలు కాకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది.
హృతిక్ రోషన్ డైట్ ఇలా..
"బాడీ జిమ్‌లో కాదు.. కిచెన్ లో తయారవుతుంది" అనేది హృతిక్ నమ్మే సిద్ధాంతం. అతని డైట్‌లో 90 శాతం క్లీన్ ఫుడ్డే ఉంటుంది. రోజుకు 6 సార్లు తక్కువ మోతాదులో తింటాడు. ఇందులో ఎగ్ వైట్స్, చికెన్ బ్రెస్ట్, చేపలు, ప్రోటీన్ షేక్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా తీసుకుంటాడు. ఓట్స్, స్వీట్ పొటాటో (చిలగడదుంప), బ్రౌన్ రైస్ మాత్రమే తింటాడు. రాత్రి పూట కార్బ్స్ అస్సలు తీసుకోడు.
హృతిక్ పంచదారకు పూర్తిగా దూరం. స్వీట్స్ జోలికి అస్సలు వెళ్లడు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగుతాడు. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఎంత వ్యాయామం చేసినా, శరీరానికి విశ్రాంతి లేకపోతే లాభం లేదని హృతిక్ చెబుతాడు. అతడు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర కచ్చితంగా పోతారు. దీనివల్ల కండరాలు రికవర్ అవుతాయి.
{{/usCountry}}హృతిక్ పంచదారకు పూర్తిగా దూరం. స్వీట్స్ జోలికి అస్సలు వెళ్లడు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగుతాడు. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఎంత వ్యాయామం చేసినా, శరీరానికి విశ్రాంతి లేకపోతే లాభం లేదని హృతిక్ చెబుతాడు. అతడు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర కచ్చితంగా పోతారు. దీనివల్ల కండరాలు రికవర్ అవుతాయి.
{{/usCountry}}గతేడాది జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అతడు వార్ 2లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం విశేషం. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన మేర సక్సెస్ సాధించలేకపోయింది.