OTT Bold: టీజర్ విడుదలైనప్పటి నుంచే బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కాంట్రవర్సీకి దారితీసిన మూవీ ‘హుషార్ పిట్టలు’. థియేటర్లలో బాగానే మెరిసిన ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది.
హుషార్ పిట్టలు సినిమా

టీనేజర్స్ మధ్య ఉండే లవ్, అట్రాక్షన్, సెక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ హుషార్ పిట్టలు మూవీ తెరకెక్కింది. అన్ష్ థోరత్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2026న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించింది. అప్పుడు భిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి.
అసలు ఏంటీ కథ?
హుషార్ పిట్టలు అనేది పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో సాగి, ఆఖర్లో ఓ మెసేజ్ ఇచ్చే మూవీ. సినిమాలో రవి అనే కుర్రాడు బాగా చదువుతాడు. టెన్త్ టాపర్ కూడా. అతనికి చదువు తప్ప మరొకటి తెలియదు. కానీ పదో తరగతి అయిపోయిన తర్వాత అతని ధ్యాస మారుతుంది.
ఊర్లో ఉండే యువకులు రవికి ఓ చెడు అలవాటును నేర్పుతారు. పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేస్తారు. ఇక రవికి ఎప్పుడూ అదే ధ్యాస ఉంటుంది. మరోవైపు చిట్టి ఏమో మెచ్యూర్ అవుతుంది. అప్పటి నుంచి అబ్బాయిల గురించి ఆలోచిస్తుంటుంది. ఈ క్రమంలో రవి, చిట్టికి పరిచయం ఏర్పడుతుంది. ఈ ఇద్దరూ ఇంట్లోనే సెక్స్ చేసుకుంటారు. ఓ సారి పేరేంట్స్ కు దొరికిపోతారు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? రవి, చిట్టి కలిసే ఉన్నారా? ఆఖర్లో పేరెంట్స్ కు ఈ మూవీ ఇచ్చే మెసేజ్ ఏంటీ? అనేది ఈ హుషార్ పిట్టలు సినిమాలో చూడాల్సిందే.
హుషార్ పిట్టలు ఓటీటీ
{{/usCountry}}మరి ఆ తర్వాత ఏం జరిగింది? రవి, చిట్టి కలిసే ఉన్నారా? ఆఖర్లో పేరెంట్స్ కు ఈ మూవీ ఇచ్చే మెసేజ్ ఏంటీ? అనేది ఈ హుషార్ పిట్టలు సినిమాలో చూడాల్సిందే.
హుషార్ పిట్టలు ఓటీటీ
{{/usCountry}}రిలీజ్ కు ముందు, ఆ తర్వాత బోల్డ్ కాన్సెప్ట్ తో వివాదాస్పదమైన హుషార్ పిట్టలు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 15) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా హుషార్ పిట్టలు సడెన్ గా ఓటీటీ డెబ్యూ చేసింది.
ఫ్యామిలీతో చూడొచ్చా?
ఓటీటీలోకి సరిగ్గా థియేటర్లో రిలీజైన నెల రోజులకు హుషార్ పిట్టలు వచ్చేసింది. అయితే ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడొచ్చా అంటే కచ్చితంగా అవును అని చెప్పలేం. ఈ సినిమాలోని బోల్డ్, అడల్ట్ కంటెంట్ అందుకు కారణం. లాస్ట్ లో వచ్చే మెసేజ్ కోసం ఈ కంటెంట్ అంతా ఫ్యామిలీ కలిసి చూస్తుందని చెప్పలేం. సో, ఈ మూవీని ఒంటరిగా చూస్తే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.