...
...
Next Story

Hrudayam Murali OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ తమిళ మూవీ.. తమన్ యాక్టింగ్.. ఎక్కడ చూడాలంటే?

Hrudayam Murali OTT: తమిళ యంగ్ హీరో అథర్వ హీరోగా తెరకెక్కిన కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా 'ఇదయం మురళి' ఓటీటీలోకి రాబోతుంది. తెలుగులో ఈ మూవీ హృద‌యం ముర‌ళి పేరుతో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి, ఎప్పుడు వస్తుందో చూసేయండి.

Published on: Aug 2, 2026, 13:47:16 IST
Advertisement

Hrudayam Murali OTT: తమిళ చిత్రసీమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వ నటించిన సరికొత్త చిత్రం 'ఇదయం మురళి' (Idhayam Murali). థియేటర్లలో విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు డిజిటల్ వినోదానికి సిద్ధమైంది. తెలుగులో హృద‌యం ముర‌ళిగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

హృద‌యం ముర‌ళి ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ తమిళ మూవీ.. తమన్ యాక్టింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ తమిళ మూవీ.. తమన్ యాక్టింగ్.. ఎక్కడ చూడాలంటే?

హృద‌యం ముర‌ళి సినిమా ఓటీటీ డిజిటల్ హక్కులను ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఆగస్టు 7, 2026 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ధృవీకరించింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

స్పెషల్ అట్రాక్షన్లు

కేవలం రొటీన్ లవ్ స్టోరీగా కాకుండా, విభిన్నమైన నటీనటుల కాంబినేషన్‌తో ఈ హృద‌యం ముర‌ళి సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో ప్రీతి ముకుందన్, కాయదు లోహార్, జోనితా గాంధీ, మాళవికా మోహనన్, అంజు కురియన్ నిహారిక ఎన్ఎం తదితర భామలు నటించారు.

మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో కనిపించడం సినిమాకు అతిపెద్ద అసెట్‌గా నిలిచింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించడమే కాకుండా, సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం.

స్టోరీ ఏంటంటే?

ఇటీవలి కాలంలో నెట్‌ఫ్లిక్స్ దక్షిణాదికి చెందిన 'కమింగ్ ఆఫ్ ఏజ్' రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ సినిమాలకు పెద్దపీట వేస్తోంది. 'ఇదయం మురళి' చిత్రానికి థియేటర్లలో లభించిన పాజిటివ్ టాక్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ప్లస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఫహద్ ఫాజిల్ స్పెషల్ క్యామియో అప్పీల్ ఓటీటీలో ఈ సినిమాకు భారీ వ్యూయర్‌షిప్‌ను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా డిజిటల్ స్పేస్‌లో యూత్‌ఫుల్ లవ్ డ్రామాలను కోరుకునే ఆడియన్స్‌కు ఇది పర్ఫెక్ట్ వీకెండ్ చాయిస్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks