...
...
Next Story

ఓటీటీలోకి ధనుష్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఇడ్లీ కొట్టు-ఈ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన మ‌రో మూడు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ కేవలం సినిమాల్లో లీడ్ రోల్ ప్లే చేసే కథానాయకుడు మాత్రమే కాదు మల్లీ టాలెంటెండ్ పర్సన్. ఆయన డైరెక్షన్ కూడా చేస్తాడు. ఆయన దర్శకత్వంలోని ఇడ్లీ కొట్టు ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన డైరెక్ట్ చేసిన మిగతా సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి.

Published on: Oct 26, 2025, 20:32:30 IST
Advertisement

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ ‘ఇడ్లీ కడై’ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైన ఈ సినిమా మరో మూడు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మిగతా సినిమాలు ఏవీ? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

ఇడ్లీ కడై

ధనుష్ (x/Dhanush)
ధనుష్ (x/Dhanush)

ఇప్పుడు ఇడ్లీ కడై ట్రెండింగ్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ దగ్గర పడుతుండటమే అందుకు కారణం. ధనుష్ హీరోగా నటించడమే కాకుండా స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ హార్ట్ టచింగ్ ఫిల్మ్ 2025 అక్టోబర్ 1న థియేటర్లలో రిలీజైంది. ఇందులో అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్ర ఖని, నిత్యా మీనన్, షాలిని పాండే తదితరులు నటించారు. ఇది అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

పా పాండి

ధనుష్ డైరెక్టర్ గా డెబ్యూ చేసిన సినిమా ‘పా పాండి’. దీన్ని పవర్ పాండి అని కూడా పిలుస్తారు. 2017లో వచ్చిన తమిళ కామెడీ డ్రామా ఇది. ఈ మూవీకి డైరెక్టరే కాదు ప్రొడ్యూసర్ కూడా ధనుష్ కావడం విశేషం. స్టోరీ కూడా ఆయనదే. ఈ చిత్రంలో రాజ్ కిరణ్, రేవతి, ప్రసన్న, మడోన్నా సెబాస్టియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో ధనుష్ కూడా నటించాడు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది.

రాయన్

‘నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ మూవీ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ కామెడీ జోనర్లో వచ్చింది. ప్రస్తుత జనరేషన్ యువత మధ్య బంధాలను చాటేలా ఈ సినిమాను తెరకెక్కించాడు ధనుష్. తెలుగులో ఇది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే పేరుతో డబ్ అయింది. ఈ ఏడాదే థియేటర్లలో రిలీజైంది. గోల్డెన్ స్పారో పాట ఈ మూవీలోనిదే. ఇందులో పవీష్ నారాయణ్, మాథ్యు థామస్, అనిక సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, శరత్ కుమార్ తదితరులు నటించారు.

2025 ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ మూవీని కూడా ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks