...
...
Next Story

Peddi Illu Illalu Pillalu: రామ్ చరణ్ పెద్దిపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగర్ రివ్యూ- అంత మాటన్నావేంటీ రఫీక్ భాయ్!

Illu Illalu Pillalu Sagar Review On Peddi: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో సాగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఫీక్ షా (రఫీక్షా). అయితే, తాజాగా పెద్ది మూవీపై రఫీక్ షా రివ్యూ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ అభిమానులు సాగర్‌పై ఫైర్ అవుతున్నారు. అసలు ఏమైందంటే?

Published on: Jun 7, 2026, 19:30:12 IST
Advertisement

Illu Illalu Pillalu Sagar Peddi Review: స్టార్ మా ఛానెల్‌లో మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న బుల్లితెర సీరియల్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని, నటి అన్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మామ చెప్పుడు మాటలు విని

రామ్ చరణ్ పెద్దిపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగర్ రివ్యూ- అంత మాటన్నావేంటీ రఫీక్ భాయ్!
రామ్ చరణ్ పెద్దిపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగర్ రివ్యూ- అంత మాటన్నావేంటీ రఫీక్ భాయ్!

ఈ సీరియల్‌లో రామరాజు (ప్రభాకర్) రెండో కుమారుడు సాగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రఫీక్ షా (రఫీక్షా). మొన్నటి వరకు అమాయుకుడిగా ఉన్న సాగర్ మామ ప్రసాద్ రావు చెప్పుడు మాటలు విని తండ్రిపైకి, కుటుంబానికే రివర్స్ అవుతాడు. వారిని ఎదిరించి అందరిని బాధపెడతాడు.

అంత మాట అన్నావేంటీ

తనకు అన్యాయం జరిగిందనే భ్రమలో బతికే కొడుకు పాత్రలో సాగర్‌గా మంచి నటనతో ఆకట్టుకుంటున్నాడు రఫీక్ షా. అయితే, ఇటీవల రఫీక్ షా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్తా చర్చకు దారి తీసింది. అంత మాట అన్నావ్ ఏంటీ రఫీక్ భాయ్ అంటూ బుల్లితెర నటుడు సాగర్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సాన- జాన్వీ కపూర్- ఏఆర్ రెహమాన్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పెద్ది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది జూన్ 4న థియేటర్లలో విడుదల అయిన విషయం తెలిసిందే.

పెద్దిపై సాగర్ రివ్యూ

"మూడ్ బాలేదని సినిమాకు వెళ్తే.. సినిమా కూడా బాలేదు" అని సాగర్ అలియాస్ రఫీక్ షా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నిరుత్సాహంగా ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే, రఫీక్ ఏ సినిమా చూశాడో బయటకు మాత్రం చెప్పలేదు. కానీ, ఇప్పుడు థియేటర్లలో పెద్దగా ఏ సినిమాలు లేవు.

కామెంట్స్ రూపంలో

పైగా ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ది హవానే నడుస్తోంది. దీంతో రఫీక్ షా ఇచ్చిన రివ్యూ రామ్ చరణ్ పెద్ది సినిమాపైనే అని నెటిజన్స్, చెర్రీ అభిమానులు భావిస్తున్నారు. పెద్దిపై అలాంటి రివ్యూ ఇచ్చేసరికి రఫీక్ షాపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డాడని, అతను నటనకు మంచి ప్రశంసలు వస్తుంటే నువ్వేంటీ అలా ఎలా అంటావని నెట్టింట్లోనే కామెంట్స్ రూపంలో నిలదీస్తున్నారు.

నెగెటివ్ మూడ్‌తో

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ప్రస్తుతం సాగర్ పాత్ర నెగెటివ్‌గా వెళ్తోంది. అదే నెగెటివ్ మూడ్‌తో సినిమా చూసినట్లు ఉన్నావ్ అందుకే అలా అనిపించిందని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలా సీరియల్ ద్వారా కాకుండా సోషల్ మీడియాలో వివాదంతో నటుడు రఫీక్ షా పాపులర్ అవుతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe