...
...
Next Story

Illu Illalu Pillalu April 14 Episode: ధీరజ్‌కు నిజం చెప్పిన చందు- ప్రేమపై పశ్చాత్తాపం- అప్పుపై రామరాజుకు సేటు బెదిరింపు

Illu Illalu Pillalu Serial April 14th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 14వ ఎపిసోడ్‌లో ప్రేమపై ధీరజ్ అరుస్తుంటాడు. కొట్టబోతుంటే.. చందు వచ్చి అడ్డుకుని నిజం చెబుతాడు. విశ్వను ప్రేమించమని అమూల్యకు చెప్పింది వల్లి అని చందు చెప్పడంతో ధీరజ్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.

Published on: Apr 14, 2026, 08:34:17 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమకు ధీరజ్ సేవలు చేస్తాడు. కానీ, ఇద్దరు ఏదో ఒకటి వాదించుకుంటారు. జ్యూస్ ఇస్తే చేదుగా ఉందని ప్రేమ అంటుంది. కాఫీ అడుగుతుంది. ధీరజ్ కాఫీ పెట్టుకుని తీసుకు వస్తే వద్దంటుంది ప్రేమ. నాకు నిద్ర వస్తుంది. ఎత్తుకుని తీసుకెళ్లు అని ముద్దుముద్దుగా అడుగుతుంది ప్రేమ.

నడవలేని పరిస్థితి ఉంది కాబట్టే

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 14th ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 14th ఎపిసోడ్

దాంతో ఒక్కటి గుద్దుతాను అని తిడతాడు ధీరజ్. ఇంతలో వచ్చిన చందు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఎత్తుకోమంది. దానికి చేయి ఎత్తుతావా అని చందు అంటాడు. నిన్ను కాపాడిందనే కన్సర్న్ ఉంది కానీ అమూల్య విషయంలో చేసిన తప్పును ఎప్పటికీ క్షమించలేను. దీనికి ఎప్పటికీ నా భార్య స్థానం ఇవ్వలేను అని ధీరజ్ అంటాడు. ఇంతలో అమూల్య, నర్మద వస్తారు.

ప్రేమ గురించి తప్పుగా అంటే ఒక్కటి కొడతాను. ఎవర్రా తప్పు చేసింది. అమూల్య విషయంలో విశ్వ గాడితో ప్రేమ చేతులు కలిపిందని ఎవర్రా నీకు చెప్పారు. అమూల్య చెప్పిందా, విశ్వ చెప్పాడా లేదా నువ్వు చూశావా అని నిలదీస్తాడు చందు. లేదు అని ధీరజ్ అంటాడు. మరి ఏ ఆధారాలతో ప్రేమను అంటున్నావ్ అని ధీరజ్‌పై మండిపడతాడు చందు. బావ గారు ఆపండి. దీని గురించి మాట్లాడొద్దని ప్రేమ అంటుంది.

అయ్యో అన్నయ్య దీన్ని అమాయకురాలు అనుకుని పొరబడుతున్నావ్. విశ్వను ప్రేమించమని అమూల్యకు చెప్పింది ముమ్మాటికి ఇదే అని ధీరజ్ అంటాడు. విశ్వను ప్రేమించమని అమూల్యకు చెప్పింది ప్రేమ కాదు వల్లి అని నిజం చెప్పేస్తాడు చందు. అయ్యో బావగారు ఇప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అని నర్మద అంటుంది. చూస్తూ ఊరుకుంటే వీళ్ల కాపురం ముక్కలయ్యేలా ఉంది. నా భార్య చేసిన తప్పుకు ప్రేమ జీవితం అన్యాయంగా బలి అవుతుంది. అది చూస్తూ ఉండాలా అని నర్మదపై అంటాడు చందు.

అమూల్యతో నిజం చెప్పించిన చందు

దాంతో అన్నయ్య అంటూ చందును ధీరజ్ హగ్ చేసుకుంటాడు. నువ్వెన్ని మాటలన్నా ప్రేమ భరించిందిరా. ఇదంతా మా కాపురం కోల్పోకూడదని. నీ భార్య నిజంగా దేవతరా. ఇంకా నాశనం చేసుకోకు అని చందు అంటాడు. దాంతో ధీరజ్ పశ్చాత్తాపంగా చూస్తాడు. అంతా వెళ్లిపోతారు. ధీరజ్, ప్రేమ ఇద్దరే ఉంటారు. మరోవైపు సాగర్ తన మొదటి సాలరీతో షాపింగ్ చేస్తాడు.

రైస్ మిల్‌లో ఇన్నాళ్లు పని చేస్తే మా నాన్న దగ్గర చేయి చాచాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు నా డబ్బు నా ఖర్చు అని ఫ్రెండ్‌తో అంటాడు సాగర్. మరోవైపు రామరాజు సాగర్‌కు డబ్బు ఇచ్చిన సేటు వచ్చి కలవడం గుర్తు చేసుకుంటాడు. మీరు ఉన్నారనే నమ్మకంతోనే 20 లక్షలు ఇచ్చాను అని, ఆ డబ్బుతో దొంగతనంగా ఉద్యోగం కొన్నాడని తెలిసిందంటాడు. 3 రూపాయల వడ్డీతో నెలకు 60 వేలు అని, మొత్తం ఒకేసారి కాకున్నా కొంచెం కొంచెం అయినా ఇప్పించండని సేటు అంటాడు.

రామరాజును బెదిరించిన సేటు

ఈ నెల వడ్డీ కట్టలేదు. ఎలాగైనా మీరే ఇప్పించాలి. మీరు కాబట్టి ముందుగా వచ్చి చెబుతున్నా. లేకుంటే ఇంటికి వచ్చి గొడవ చేసేవాన్ని అని సేటు బెదిరిస్తాడు. ఆ మాటలు తలుచుకుంటూ బైక్‌పై డ్రైవ్ చేసుకుంటూ బాధతో వస్తాడు రామరాజు. మరోవైపు సాగర్ సంతోషంగా బైక్‌పై వస్తాడు. ఇంకోవైపు చందుకు శ్రీవల్లి కాల్ చేస్తుంది. చందు కట్ చేస్తున్నా కూడా వల్లీ కాల్ చేస్తూనే ఉంటుంది.

మెసేజ్ చేద్దామని నువ్ కాల్ కటింగ్ చేస్తే నా గుండె కటింగ్ అవుతుంది. నిన్ను చూడకుండా ఉండలేను బావ. నన్ను తీసుకెళ్లు బావ అని ఏడుస్తూ వాయిస్ మెసేజ్ పెడుతుంది శ్రీవల్లి. అది విని కూడా చందు రియాక్ట్ కాడు. అది తెలిసి మరింత ఏడుస్తుంది శ్రీవల్లి. నా కాపురం కూలిపోయినట్టేరా దేవుడా అని ఏడుస్తూ కూర్చొంటుంది వల్లి. అదంతా భాగ్యం, భర్త చూస్తారు.

ప్రేమకు కౌగిలింత

బంగారం షాపు వాడితో మనం పెట్టిన మంట బాగా రగులుతుంది. ఆ ఇల్లు కాలిపోతుంది అన్నారు. అలా జరుగుతుందంటావా అని భర్త అడుగుతాడు. ఇంకాసేపట్లో మంట మొదలవుతుంది. ఆ మంటల్లో నర్మద కాపురం పూర్తిగా తగలబడిపోతుంది అని భాగ్యం అంటుంది. చందు చెప్పిన మాటలు తలుచుకున్న ధీరజ్ ప్రేమపై పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ప్రేమ దగ్గరికి వెళ్లి వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks