...
...
Next Story

Illu Illalu Pillalu August 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- రామరాజుకు చందు అబద్ధం- మామపై నింద- రౌడీని చితకబాదిన ప్రేమ

Illu Illalu Pillalu Serial August 23rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 23వ ఎపిసోడ్‌లో ప్రేమను తీసుకెళ్లేందుకు ధీరజ్ బెట్టు చేస్తాడు. నర్మదకు కాల్ చేయడంతో వస్తుంది. ఇద్దరిని తిడుతుంది. అప్పుడే వీధి రౌడీ వస్తాడు. మరోవైపు 6 లక్షల లెక్క దొరక్కపోవడంతో చందు అనుమానపడతాడు.

Published on: Aug 23, 2026, 08:46:23 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో కోచింగ్ సెంటర్ వద్ద ధీరజ్, ప్రేమ గొడవ పడుతుంటారు. మళ్లీ శారద పుట్టినరోజు జరిగిన పాత పాటే పాడతారు. నీ మెడలో నేను తాళి కట్టడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ధీరజ్ అంటాడు.

ప్రేమ బ్లాక్ మెయిల్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 23వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 23వ ఎపిసోడ్

తర్వాత నర్మదకు కాల్ చేసి కోచింగ్ సెంటర్‌కు రమ్మంటాడు ధీరజ్. నర్మద స్కూటీపై వస్తుంది. ప్రేమను తిడుతుంది నర్మద. తర్వాత ప్రేమను వెయిట్ చేయించడంపై ధీరజ్‌పై కోప్పడుతుంది. నిన్నటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తుందని ధీరజ్ అంటాడు. అది రాదు మనం వెళ్దామని ధీరజ్ అంటాడు.

ఇంతలో వీధి రౌడీ ఒకడు వచ్చి ప్రేమకు సైట్ కొడతాడు. సింగిల్ ఆ మింగిల్ అవుదామా అంటాడు. దాంతో ఆ వీది చితకబాదుతుంది ప్రేమ. ఏంటమ్మా ఇలా ఉన్నావ్. నీ మొగుడు ఎలా భరిస్తున్నాడో అని అతను అంటాడు. దాంతో వాడిని ఇంకా గట్టిగా కొడుతుంది. ఈ ఏరియా బాగోలేదు. ప్రేమను తీసుకెళ్లు అని నర్మద అంటుంది. అంతా ఆలోచించినా ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్లి పదా డ్రాప్ చేస్తానంటాడు.

దాంతో ప్రేమ సంతోషిస్తుంది. నర్మదను కూడా స్కూటీ ఇక్కడే పెట్టి కారులో రమ్మంటుంది ప్రేమ. దారి మధ్యలోనే డ్రాప్ చేస్తే ఎలా అని ప్రేమ అంటుంది. దానికి నీ తెలివితేటలు చూస్తుంటే ధీరజ్‌పై జాలేస్తుందని నర్మద అంటుంది. ముగ్గురు కారులో వెళ్తారు. టైమ్ చూసినప్పుడు నీ సంగతి చెబుతానని ఒకరికొకరు మనసులో అనుకుంటారు ధీరజ్, ప్రేమ.

నీ డబ్బు నీ మొహాన కొడతా

ఇది నా కారు కాబట్టి నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఎక్కడ డ్రాప్ చేయాలంటే అక్కడ చేయాలని ప్రేమ ఆర్డర్ వేస్తుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు వాదించుకుంటారు. అది భరించలేక నర్మద చెవులు మూసుకుంటుంది. మరోవైపు చందు డబ్బులు కౌంట్ చేస్తాడు. ఆరు లక్షలు తేడా వస్తున్నాయి ఏంటని షాక్ అవుతాడు.

కలెక్షన్ డబ్బులకు బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన డబ్బులకు ఇంత తేడా ఉండటం ఏంటని అనుమానపడతాడు చందు. వర్మకు కాల్ చేసి మా తిరుపతి మామకు ఎంత డబ్బిచ్చారని అడిగితే.. 8 లక్షలు ఇచ్చానని అతను చెబుతాడు. 6 లక్షలు తేడా వస్తుందంటే.. అమౌంట్ మిషిన్‌లో లెక్కపెట్టి మరి ఇచ్చామని అతను చెబుతాడు. చందు ఫోన్‌లో మాట్లాడటం శ్రీవల్లి విని భాగ్యం చెప్పింది గుర్తు చేసుకుంటుంది.

తిరుపతి మీదకు తోసేసిన వల్లి

దొరికితే మా పని అయినట్లే అనుకున్న శ్రీవల్లి వచ్చి బావ ఏమైందని అడుగుతుంది. నీకెందుకు అని కోపంగా అంటాడు. రామరాజు కాల్ ధాన్యం లోడ్లు బయలుదేరాయి. కలెక్షన్ డబ్బులు రెడీగా ఉన్నాయిగా అని అడుగుతాడు. ఉన్నాయని చందు అబద్ధం చెబుతాడు. రామరాజు సరేనంటాడు. అబ్బా ధాన్యం లోడ్స్ వస్తున్నాయి, ఆరు లక్షలు కట్టాలి. నాన్నకు ఏం చెప్పాలి అని చందు టెన్షన్ పడతాడు.

శ్రీవల్లి అడిగితే.. ఆరు లక్షల గురించి చెబుతాడు. రైస్ మిల్ కలెక్షన్స్ డబ్బుల సంగతి నువ్వు తిరుపతి బాబాయ్ కదా చూసుకునేది. మరి ఆరు లక్షలు తేడా రావడం ఏంటని శ్రీవల్లి ఇన్‌డైరెక్ట్‌గా తిరుపతి మీదకు నెడుతుంది. దాంతో చందు కోప్పడుతాడు.

అలా అనట్లేదు బా.. ఆ ఆరు లక్షల తలపోటు నీకు ఎక్కడ పడుతుందో, ఇంతకుముందు కూడా ఏదో విధంగా డబ్బులు పోతే మ్యానేజ్ చేశావ్. ఇప్పుడు ఏకంగా 6 లక్షలు అంటే ఎలా సర్దిచెబుతావ్. ఎక్కడో తేడా కొడుతుంది, జాగ్రత్తగా చూసుకో. ఓసారి తిరుపతి బాబాయ్‌ని పిలిచి మాట్లాడు. క్లారిటీ వస్తదని అని శ్రీవల్లి అంటుంది. నాకు తెలుసు వెళ్లమని కోపంగా అంటాడు చందు.

ఒకే కారులో ధీరజ్, ప్రేమ

హమ్మయ్య.. నాన్న మీద అనుమానం రాకుండా తెలివిగా తింగరి తిరుపతి బాబాయ్ మీద తోసేశాను. కానీ ఈ 6 లక్షల వ్యవహారాన్ని ఏదోవిధంగా కవర్ చేసేయాలని ఆలోచిస్తుంది శ్రీవల్లి. మరోవైపు అటు ధీరజ్ కోసం వేదవతి, ఇటు ప్రేమ కోసం శారదాంబ ఎదురుచూస్తుంటారు. ఒకరినొకరు చూసుకుని ఇద్దరి గురించి మాట్లాడుకుంటారు.

వీలైనంత త్వరగా ధీరజ్, ప్రేమను కలపాలని శారదాంబ అంటుంది. అప్పుడే ధీరజ్, ప్రేమ ఒకే కారులో వచ్చారని సంతోషంగా చెబుతుంది వేదవతి. ఇద్దరు కలిసిపోయారని, సంతోషంగా ఉందని శారదాంబ అంటుంది. అలాంటిదేం లేదని, పిచ్చిదానిలా కోచింగ్ సెంటర్ దగ్గర కూర్చుందని ధీరజ్ అంటాడు. ప్రేమపై సెటైర్లు వేస్తాడు ధీరజ్.

మళ్లీ ఇద్దరు వాదించుకుని చెరో దారికి వెళ్తారు. నర్మదను వేదవతి అంటే.. వాళ్లు ప్రేమగానే కొట్టుకుంటున్నారు. కానీ, వాళ్ల వల్ల నా చెవుల్లో నుంచి రక్తం వచ్చేసింది. కోచింగ్ సెంటర్ దగ్గర మొదలైన తిట్లదండకం ఇక్కడిదాకా కొనసాగిందని నర్మద అంటుంది. నీ వెధవ చెవులు పోతేపోనీ గానీ వాళ్లు కలిస్తే చాలు అని వేదవతి అంటుంది. నర్మద కోపంగా చూస్తుంది.

మెట్టు దిగిన ప్రేమ, ధీరజ్ బెట్టు

వెకిలిగా నవ్వుతూ సరదాగా అన్నాను అని వేదవతి అంటుంది. మనం చెప్పిన మాటలకు ప్రేమ ఒక మెట్టు దిగిందని, ధీరజ్ మాత్రం బెట్టు చేస్తున్నాడని నర్మద చెబుతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks