...
...
Next Story

Illu Illalu Pillalu August 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- సుకన్యకు తిరుపతి గోల్డ్ చైన్- వేదవతికి చూపించిన శ్రీవల్లి

Illu Illalu Pillalu Serial August 29th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్ట్ 29వ ఎపిసోడ్‌లో తిరుపతి బర్త్ డే సెలబ్రేట్ చేసిన సుకున్య గిఫ్ట్ అడుగుతుంది. ఇడ్లీ బాబాయ్ చెప్పడంతో భద్రావతి ఇచ్చిన గోల్డ్ చైన్‌ను సుకన్య మెడలో వేస్తాడు తిరుపతి. ప్రేమ కాల్ చేస్తే ధీరజ్ కట్ చేస్తాడు.

Published on: Aug 29, 2026, 08:35:39 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ ఒక మెట్టు దిగింది కానీ ప్రేమ, ధీరజ్ గొడవ పడతారు. కొట్టేందుకు ధీరజ్ రాయి తీసుకొస్తే.. ప్రేమ పూలకుండీ పట్టుకొస్తుంది. ఇద్దరు గొడవ పడుతుంటే నర్మద ఆపి సన్నాఫ్ సత్యనారాయణ మూర్తిలోని ఎన్నాళ్లీ రక్తపాతం అని బ్రహ్మానందం డైలాగ్ చెబుతుంది.

తిరుపతికి బర్త్ డే సర్‌ప్రైజ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 29వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్ట్ 29వ ఎపిసోడ్

దాంతో ఇద్దరు పడేస్తారు. చెప్పింది అర్థం కాకపోయినా కింద పడేశారంటే మీలో ప్రేమ ఇంకా బుసలు కొడుతుందని నర్మద అంటుంది. ధీరజ్, ప్రేమ కోపంగా వెళ్లిపోతారు. భాగ్యం ఇంటికి తిరుపతి వెళ్తాడు. సుకన్య తిరుపతికి బర్త్ డే సర్‌ప్రైజ్ ఇస్తుంది. అరెంజ్‌మెంట్స్ చూసి ఇవేం ఏర్పాట్లు అని తిరుపతి అంటే.. మేము పేదోళ్లం, మీలా కోటీశ్వరులం కాదు కదా అని భాగ్యం అంటుంది.

ఇదే మేం చేసే చివరి పుట్టినరోజు. నేను వెళ్లిపోతున్నా అని సుకన్య అంటుంది. తమిళనాడుకు. మా సుక్కుకు ఒక తమిళ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. డబ్బులు బాగా ఇస్తామన్నారు. మేమే బలవంతం చేస్తున్నాం. తనకంటూ మంచి గుర్తింపు ఉండాలిగా అని భాగ్యం అంటుంది. నేను ఉన్నాగా. ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పాను. కొడతానని అన్నారని తిరుపతి అంటాడు.

అందుకే సినిమాకు ఓటేశామని భాగ్యం అంటుంది. నేను ఎలాగైనా ఒప్పిస్తాను. టైమ్ పడుతుందని తిరుపతి అంటాడు. నాకు సినిమా కంటే తిరుపతినే ముఖ్యం. ఇంకొక్క ఛాన్స్ ఇవ్వమంటుంది సుకన్య. సరే నీకోసం ఇంకో ఛాన్స్ ఇస్తాం. లేకుంటే తమిళ సినిమానే అని భాగ్యం అంటుంది. తర్వాత తిరుపతి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తారు.

సుకన్యకు ఆరు లక్షల గోల్డ్ చైన్

సరే నా అక్కకు ఏదోటి చెప్పుకుంటాను అని భద్రావతి ఇచ్చిన గోల్డ్ చైన్ సుకన్య మెడలో వేస్తాడు తిరుపతి. తర్వాత బావ కాల్ చేస్తున్నాడంటూ వెళ్లిపోతాడు తిరుపతి. వీడితో పని చేయించుకోవడం పెద్ద కష్టం కాదు. వల్లికి చెబితే అదే చూసుకుంటుందని భాగ్యం అంటుంది. మరోవైపు ధీరజ్ దూరం పెట్టడం, ముగ్ధతో తిరగడంపై ప్రేమ ఫీల్ అవుతుంటుంది.

ఆ సచ్చినోడు నన్ను వదిలేస్తాడా ఏంటీ, అమ్మో వాడి ప్రేమ లేకపోతే నేను బతకలేను అని ధీరజ్‌కు కాల్ చేస్తుంది ప్రేమ. కానీ, ధీరజ్ కాల్ కట్ చేస్తాడు. మళ్లీ చేస్తే మళ్లీ కట్ చేస్తాడు. అటు ఇటు తిరుగుతున్న ప్రేమను చూసి ముగ్ధ నవ్వుతుంది. తన ఫోన్ ఇవ్వమంటుంది. ఇవ్వనని ముగ్ధ అంటే.. బండకేసి కొడతా అని బెదిరించి ఫోన్ తీసుకుంటుంది ప్రేమ.

ఇత్తడి చెంబుదాని గొంతే

ముగ్ధ ఫోన్ నుంచి ధీరజ్‌కు కాల్ చేస్తుంది ప్రేమ. చెప్పు ముగ్ధ అని ధీరజ్ అంటాడు. అది విని దీని నెంబర్ నీ దగ్గర ఉన్నట్టుంది. రోజు మాట్లాడుకుంటారనుకుంటా అని ప్రేమ అనుకుంటుంది. ముగ్ధ వాయిస్‌లా ప్రేమ మాట్లాడేందుకు ట్రై చేస్తుంది. కానీ, ధీరజ్ అది కనిపెడతాడు. నీ వాయిస్ ఏంటీ ఆ గయ్యాలి గంగమ్మ తారు రోడ్డు మీద రేకులా గీసినట్లు ఉందని కావాలనే అంటాడు ధీరజ్.

ఏమైంది ముగ్ధ నీ వాయిస్ ఆ ప్రేమ కాకి గొంతులా ఉందని ధీరజ్ అడుగుతాడు. కోల్డ్ అయింది ప్రిన్స్ అని ప్రేమ అంటుంది. డౌట్ లేదు. ఇది ఆ ఇత్తడి చెంబు దాని వాయిసే అని, చెబుతా నీ సంగతి అని ధీరజ్ అనుకుంటాడు. కావాలనే వాయిస్‌ను పొగుడుతాడు ధీరజ్. ఫోన్‌లోనే మర్డర్ చేయాలనంత కోపంగా ఉందని ప్రేమ అనుకుంటుంది.

కావాలనే ప్రేమను ధీరజ్ ఉడికిస్తాడు. నీకోసం ప్రేమ ఇక్కడ ఎదురుచూస్తుంది. క్లాసులు కూడా సరిగా వినట్లేదు. నీకోసమే బాధపడుతుంది అని తన గురించి తానే చెప్పుకుంటుంది ప్రేమ. దాంతో ఇంకా ఎక్కువగా తిడతాడు ధీరజ్. అది విని తట్టుకోలేకపోతుంది ప్రేమ. అలా ఏం లేదు నీకోసం చాలా ఫీల్ అవుతుందని ప్రేమ అంటుంది.

శ్రీవల్లి డ్రామా

ఇంకోసారి దాని పేరు ఎత్తితే కాల్ కట్ చేస్తాను. సరదాగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని ధీరజ్ అంటాడు. తీసుకెళ్లి ఏట్లోకి దూకండి అని కోపంగా మాట్లాడుతుంది ప్రేమ. అదంతా విని ధీరజ్ నవ్వుకుంటాడు. ఇంకోసారి మీరు మాట్లాడుకుంటే అంతు చూస్తానని బెదిరించి కాల్ కట్ చేస్తుంది ప్రేమ. నాకే ఝలక్ ఇవ్వాలని చూస్తావా. తిక్క బాగా కుదిరిందని ధీరజ్ అనుకుంటాడు.

కిచెన్‌లో వేదవతి వర్క్ చేసుకుంటుంది. కావాలనే సుకన్యకు వీడియో కాల్ చేసి తిరుపతి బాబాయ్ నీకు గోల్డ్ చైన్ ఇచ్చాడా అని శ్రీవల్లి మాట్లాడుతుంది. అది వేదవతి వింటుంది. ఆ గోల్డ్ చైన్ ఖరీదు ఆరు లక్షలా.. 6 లక్షల గోల్డ్ చైన్ కొనేందుకు తిరుపతి బాబాయ్‌కు డబ్బు ఎక్కడిది. నీ వెంట ఆ బాబాయ్ కుక్కల తిరుగుతున్నాడు. కానీ, అంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలే మా అత్త నా కుటుంబంపై పీకల్లోతు కోపంగా ఉందని శ్రీవల్లి అంటుంది.

ఇన్ని తెలిసి నువ్వెలా గోల్డ్ చైన్ ఎలా తీసుకున్నావ్ అని వల్లి అంటుంది. నేను వద్దనే చెప్పాను. కావాలనే బలవంతంగా ఇచ్చాడు అని సుకన్య అంటుంది. వేదవతి అడిగితే.. తిరుపతి గోల్డ్ ఇచ్చినట్లు చెబుతుంది వల్లి. వాడెందుకు ఇస్తాడే చైన్ అని వేదవతి అంటే.. సుకన్య మెడలో గోల్డ్ చైన్ చూపిస్తుంది. అది చూసి వేదవతి షాక్ అవుతుంది.

తిరుపతిని బుక్ చేసిన శ్రీవల్లి

చూడండి తిరుపతి బాబాయ్ ఆరు లక్షల చైన్ ఇచ్చారని వల్లి అంటుంది. వాడి మీద నిందలు వేస్తే ఊరుకోను. దీనిపై వాడిని అడుగుతాను. మీ సంగతి కూడా చూస్తానంటుంది వేదవతి. వల్లి కాల్ కట్ చేస్తుంది. ఎలా దొరికారే మీరు. మీరు వచ్చాకే మా కుటుంబం ఇలా అవుతోందని శ్రీవల్లిని తిడుతుంది వేదవతి. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe