Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో విశ్వ తను మారినట్లు ఇంట్లో జరిగిన గొడవను ఎగ్జాంపుల్‌గా చెబుతాడు. ఇంతకంటే రుజువులు లేవు. మా చెల్లిని మీ అన్నయ్యతో కలపాలన్నదే నా ఉద్దేశం. నువ్వు అర్థం చేసుకుని నాకు కాస్తా సపోర్ట్‌గా ఉంటే ఇద్దరిని కలపొచ్చు. లేదంటే నీ ఇష్టం. ఇక నిన్ను బతిమిలాడను అని దండం పెట్టి విశ్వ వెళ్లిపోతాడు.
ధీరజ్ కారు బుక్ చేసిన ప్రేమ

దాంతో అమూల్య ఆలోచిస్తుంది. మరోవైపు ప్రేమ కాలేజ్‌లో ధీరజ్ కారులో వెయిట్ చేస్తుంటాడు. ప్రేమ ఇక్కడ ఎలా ఎగురుద్దో, ఆడదాన్ని అర్థం చేసుకోవడం కంటే అణుబాంబు తయారు చేయడం ఈజీ అని ధీరజ్ అనుకుంటాడు. ప్రేమ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తానని ఫ్రెండ్‌తో చెబుతుంది. ప్రేమ క్యాబ్ బుక్ చేస్తే అది ధీరజ్‌కే వెళ్తుంది.
కారు దగ్గరికి వచ్చి క్యాబా అని ప్రేమ అడిగితే ధీరజ్ ఉంటాడు. నువ్వేనా బుక్ చేసింది. సర్లే కారు ఎక్కు అని ధీరజ్ అంటాడు. నీతో రాడానికి నాకు బుద్ధిలేదా. నేను ఎక్కను క్యాన్సిల్ చేస్తానంటుంది ప్రేమ. ఇంతలో ఒకమ్మాయి ధీరజ్ దగ్గరికి వచ్చి నన్ను మీ కారులో డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. ప్రేమను ఆడుకునేందుకు భలే దొరికావ్ అని ధీరజ్ అనుకుంటాడు.
మీరింత క్యూట్‌గా అడిగితే ఇంటికేంటీ నరకానికి అయినా డ్రాప్ చేస్తానని ధీరజ్ అంటాడు. మీరు చాలా సరదాగా ఉన్నారని ఆ అమ్మాయి అంటే.. మీలాంటి అందమైన అమ్మాయి కనిపించినప్పుడే రిజర్వ్‌డ్ అయిన నా మాటలు గట్టు దాటుతున్నాయంటాడు ధీరజ్. ఆ అమ్మాయితో చాలా క్లోజ్‌గా ధీరజ్ మాట్లాడుతాడు. తను కూడా ధీరజ్ చాలా కామెడీ చేస్తున్నాడని నవ్వుతూ మెచ్చుకుంటుంది.
ముగ్ధతో ధీరజ్ రొమాన్స్
ప్రేమ మాత్రం ఉడుక్కుంటుంది. తన పేరు ముగ్ధ అని చెబితే పేరు, ఆమె అందాన్ని పొగుడుతాడు ధీరజ్. ముగ్ధతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. ముగ్ధను కారు ఎక్కమంటాడు ధీరజ్. నేను బుక్ చేశాను కారు అని ప్రేమ అంటే.. క్యాన్సిల్ చేశావుగా అని ముగ్ధ అంటుంది. చేయలేదని ప్రేమ అంటే.. ఇప్పుడు చేసుకో. నేను ముగ్ధనే తీసుకెళ్తానని ధీరజ్ అంటాడు. మర్యాదగా తీసుకెళ్తావా లేకుంటే యాప్‌లో కంప్లైంట్ చేయనా అని బెదిరిస్తుంది ప్రేమ.
{{/usCountry}}ప్రేమ మాత్రం ఉడుక్కుంటుంది. తన పేరు ముగ్ధ అని చెబితే పేరు, ఆమె అందాన్ని పొగుడుతాడు ధీరజ్. ముగ్ధతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. ముగ్ధను కారు ఎక్కమంటాడు ధీరజ్. నేను బుక్ చేశాను కారు అని ప్రేమ అంటే.. క్యాన్సిల్ చేశావుగా అని ముగ్ధ అంటుంది. చేయలేదని ప్రేమ అంటే.. ఇప్పుడు చేసుకో. నేను ముగ్ధనే తీసుకెళ్తానని ధీరజ్ అంటాడు. మర్యాదగా తీసుకెళ్తావా లేకుంటే యాప్‌లో కంప్లైంట్ చేయనా అని బెదిరిస్తుంది ప్రేమ.
{{/usCountry}}చూశారా నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరు టైమ్ ఉన్నప్పుడు కలవండి, నా నెంబర్ తీసుకోండని ఫోన్ నెంబర్ చెబుతాడు ధీరజ్. ప్రేమ చెప్పనివ్వకుండా ధీరజ్‌ను బలవంతంగా తీసుకెళ్తుంది ప్రేమ. ముగ్ధ సంతోషిస్తుంది. అలా ధీరజ్ జీవితంలోకి మరో అమ్మాయి ముగ్ధ ఎంట్రీ ఇస్తుంది. బాగా మండినట్టుంది. మనకు కావాల్సింది అదేగా అని ధీరజ్ అనుకుంటాడు. కారులో కూడా ముగ్ధ జపం చేస్తాడు ధీరజ్.
పాటల్లో కూడా లేకున్నా ముగ్ధ అంటూ పాడతాడు ధీరజ్. ప్రేమ జలసీ ఫీల్ అవుతుంది. ధీరజ్‌ను తిడుతుంది. మరోవైపు వేదవతి, నర్మద దండపై బట్టలు ఆరేస్తారు. దేవుడు ఉన్నాడా అని వేదవతి అడిగితే.. నర్మద సెటైర్లు వేస్తుంది. ప్రేమ అన్న మాటల గురించి చెబుతుంది. ప్రేమను ఏ విధంగా ఇంటికి తీసుకురావాలో ఆలోచిస్తున్నా అని నర్మద అంటుంది.
కుట్రతో వచ్చారన్న నర్మద
తన కొడుకు, కోడలు విడిపోడానికి కారణం అని వేదవతి అంటుంది. నిజానికి మీరు ఆవేశంగా మాట్లాడేలా, గొడవ పెట్టుకునేలా కావాలనే మీవాళ్లు రెచ్చగొట్టారు అని నర్మద అంటుంది. అర్థం లేకుండా మాట్లాడతవేంటని వేదవతి అంటుంది. వాళ్లు పగను మర్చిపోలేదు. మీ అమ్మగారి పుట్టినరోజును అడ్డుపెట్టుకుని గొడవ చేసేందుకే వచ్చారని శారదాంబ అన్న మాటను గుర్తు చేస్తుంది నర్మద.
దానికి దీనికి సంబంధం ఏంటని వేదవతి అడుగుతుంది. పాతికేళ్లుగా కరగని మీ అక్క వాళ్ల మనసులు ఒక్కరోజులో కరిగిపోయాయా. ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ అన్నయ్య కూడా సూటిపోటి మాటలు అన్నారు కానీ ప్రేమగా ఒక్కరితో కూడా మాట్లాడలేదు. సమయం సందర్భం లేకుండా ధీరజ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు మాట్లాడారు అని నర్మద అంటుంది.
ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో వాళ్లకు తెలిసిపోయింది. అందుకే ప్రేమను తీసుకెళ్లేందుకు మీ అమ్మ గారి పుట్టినరోజు అడ్డుపెట్టుకుని వచ్చి గొడవ పెట్టుకున్నారు అని నర్మద అంటుంది. ఈ విషయం ఎవరికి తెలియదు కదా వాళ్లకు ఎలా తెలుసని వేదవతి అడుగుతుంది. ఉందిగా మీ అగ్గిపుల్ల కోడలు. ఆ బల్లికి తెలియకుండా వాళ్లకు తెలిసే ఛాన్సే లేదు. అది తెలుసుకునే పనిలోనే ఉన్నాను. ఈ కుట్రకు సూత్రధారి ఆ బల్లి అని తెలియాలి. అప్పుడు ఉంటది దాని సంగతి అని నర్మద అంటుంది.
దెబ్బకు దెబ్బ తీసిన ధీరజ్
ధీరజ్ కారులో ప్రేమ రావడం చూసి వేదవతి ఎగిరి గంతేస్తుంది. భద్రావతి షాక్ అవుతుంది. క్యాబ్‌లో వచ్చినందుకు డబ్బులిస్తా, క్యూఆర్ కోడ్ ఇస్తా చూపించు అని ప్రేమ అంటుంది. ఒక్క నిమిషం ఆగమన్న భద్రావతి డబ్బులు ధీరజ్ మొహం మీద కొడుతుంది. వాటిని ఏరి నా పెళ్లాం మీ ఇంట్లో ఉంటుందిగా హాస్టల్ ఫీజు కింద డబ్బులు ఇస్తున్నా అని భద్రావతి చేతిలో అదే డబ్బు పెడతాడు ధీరజ్.
అలా భద్రావతిని దెబ్బకు దెబ్బ తీస్తాడు ధీరజ్. నా పెళ్లానికి ఆవేశమే కాదు తిండి కూడా ఎక్కువే రోజుకు నాలుగైదు రకాల మంచి ఫుడ్ పెట్టండని ధీరజ్ కౌంటర్స్ ఇస్తాడు. మీరిద్దరు కలిసి వచ్చారని చాలా సంబరపడ్డానని వేదవతి అంటుంది. ఏదో ఒక రోజు గుమ్మంలోకి అడుగుపెడుతుందని ధీరజ్ అంటాడు. అది ఈ జన్మలో జరగదని ప్రేమ వెళ్తుంది.
అక్కను నిలదీసిన వేదవతి
భద్రావతి నవ్వుతుంది. భద్రావతిని వేదవతి కోపంగా చూస్తుంది. పాతికేళ్ల తర్వాత మీరంతా వస్తే పొంగిపోయాను. నా ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు. కానీ, మీ ప్రేమలో ఇంత విషముందని అనుకోలేదు. అమ్మ ప్రేమను అడ్డుపెట్టుకుని ఇంత పెద్ద కుట్ర చేస్తారా అని వేదవతి అంటుంది. కావాలనే ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చి గొడవ పెట్టుకోరు అని నిలదీస్తుంది వేదవతి. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.