Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతి వంట గురించి గొప్పలు చెబుతుంది. నర్మద సెటైర్లు వేస్తుంది. మీ అత్తాకోడళ్లు చెవులు కొరుక్కుంటున్నారేంటని శారద అడుగుతుంది. హా మీ కూతురుకి వంటరాదని అని నర్మద అంటుంది.
ఇంట్లో రణరంగం

అదేం లేదని వేదవతి కవర్ చేస్తుంది. వేదవతి చేసిన స్వీట్ ఇస్తుంది. బాగానే ఉందిలేవే అని శారద అంటుంది. దాంతో తల్లులు కూతుళ్లు అనే చిన్న విషయాలను గుర్తు చేస్తుంది వేదవతి. అదే విషయం నీకు వర్తిస్తుందని అమూల్య అంటుంది. దాంతో అంతా నవ్వుకుంటారు. అదంతా చూసిన ప్రేమ ఎమోషనల్ అవుతుంది.
చాలా ఆనందంగా ఉందని, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని నర్మదతో అంటుంది ప్రేమ. అవునా, కొంచెం సేపు ఇంట్లో రణరంగం జరిగి మీ పుట్టింటికి వెళ్తావని శ్రీవల్లి అనుకుంటుంది. భద్రావతి నగలను చూస్తూ కామాక్షి అడిగితే.. వేదవతి వారిస్తుంది. నీ కూతురు అంటే నాకు కూతురు కాదా, నీకోసం బంగారు గాజులు తెచ్చానని ఇస్తుంది భద్రావతి.
అవి తీసుకుని కామాక్షి తెగ సంబరపడిపోతుంది. అమూల్యకు కూడా తెచ్చానని ఇస్తే తీసుకోదు. రామరాజువైపు చూస్తుంది అమూల్య. రామరాజు తీసుకోమని సైగ చేయడంతో అమూల్య సంతోషంగా తీసుకుంటుంది. నీ చేత్తో తొడుగు అని వేదవతి అంటే.. అమూల్యకు భద్రావతి బంగారు గాజులు తొడుగుతుంది. థ్యాంక్స్ పెద్దమ్మ అని అమూల్య అంటుంది.
నా మామ బెటర్
మరోవైపు ధీరజ్, సాగర్ బెలూన్స్ కడతారు. మీ మామ ఓవర్ చేస్తున్నాడని సాగర్ అంటాడు. అవును. కానీ, నీ మామతో పోలిస్తే నా మామ బెటర్. నీ మామ చాపకింద నీరులా శకుని బ్యాచ్, నా మామ బిజ్జలుడిలా ఆవేశం బ్యాచ్ అని ధీరజ్ అంటాడు. మా మామను అంటే ఊరుకోను అని సాగర్ అంటాడు. ఈ మామలంతా కంత్రీల్లేరా. వాళ్ల గురించి గొడవ అవసరం లేదని చందు అంటాడు.
{{/usCountry}}మరోవైపు ధీరజ్, సాగర్ బెలూన్స్ కడతారు. మీ మామ ఓవర్ చేస్తున్నాడని సాగర్ అంటాడు. అవును. కానీ, నీ మామతో పోలిస్తే నా మామ బెటర్. నీ మామ చాపకింద నీరులా శకుని బ్యాచ్, నా మామ బిజ్జలుడిలా ఆవేశం బ్యాచ్ అని ధీరజ్ అంటాడు. మా మామను అంటే ఊరుకోను అని సాగర్ అంటాడు. ఈ మామలంతా కంత్రీల్లేరా. వాళ్ల గురించి గొడవ అవసరం లేదని చందు అంటాడు.
{{/usCountry}}వాళ్లు ఎన్ని ఎక్స్‌ట్రాలు చేసిన నాన్న కోసం భరిద్దాం. లేకుంటే నాన్న పరువు పోతుందని చందు అంటాడు. దాంతో సరేనని ధీరజ్, సాగర్ అంటారు. రామరాజు ఫోన్ మాట్లాడుతుంటే సేనాపతి చూసి చూసి చిరాకుగా వెళ్తాడు. మరోవైపు గదిలోకి సుకన్యను రమ్మంటాడు తిరుపతి. నువ్వు ఇలాంటోడివని తెలియదని సుకన్య తిడుతుంది.
మా అమ్మ రూమ్‌లో ఉంది ఆశీర్వాదం ఇప్పించేందుకు తీసుకెళ్తున్నా అని తిరుపతి అంటాడు. అపార్థం చేసుకున్నాను అని సుకున్య సారీ చెబుతుంది. స్వచ్ఛమైన ప్రేమికులకు రోజులు లేవని తిరుపతి అంటాడు. శారదకు సుకన్యను పరిచయం చేసి ఆశీర్వాదం ఇప్పిస్తాడు తిరుపతి. పిల్లపాపలతో వర్ధిల్లు అని శారద దీవిస్తుంది. ఇదే దీవెనతో ఫిక్స్ అయిపో అని సుకన్యను తీసుకెళ్లిపోతాడు తిరుపతి.
అమూల్యకు విశ్వ కొన్న బంగారు గాజులు
అద్దంలో బంగారు గాజులు చూసుకుంటూ అమూల్య మురిసిపోతుంది. పెద్దమ్మ నువ్వు నాకోసం కొన్న ఫస్ట్ గిఫ్ట్. జాగ్రత్తగా చూసుకుంటాను అని అమూల్య అనుకుంటుంది. కానీ, అక్కడ అద్దంపై గాజులు నేనే కొన్నాను బాగున్నాయా అని రాసి ఉంటుంది. అప్పుడే గదిలోకి విశ్వ వస్తాడు. గాజులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నీకోసమే కొన్నాను అని విశ్వ అడుగుతాడు.
ఇంతలో వేదవతి పిలవడంతో అమూల్య వెళ్తుంది. అందరు వచ్చారు కేక్ కట్ చేస్తావా అని తల్లిని అడుగుతుంది వేదవతి. ఒక్క నిమిషం అని సేనాపతి షాక్ ఇస్తాడు. సేనాపతి కూడా కేక్ తెప్పిస్తాడు. ఇంకో కేక్ ఎందుకని చందు అంటాడు. ఫంక్షన్ మీ ఇంట్లోనే కదా మమ్మల్ని కేక్ కూడా కట్ చేయనివ్వరా అని సేనాపతి అంటాడు. కేక్ మీరే దెచ్చేతానికి ఫంక్షన్ కూడా మీ ఇంట్లో చేసుకుంటే అయిపోయేది కదా అని సాగర్ అంటాడు.
వాడిని మాట్లాడకను అని రామరాజు అంటాడు. సాగర్ సైలెంట్ అవుతాడు. ఫంక్షన్ ఇక్కడ జరిగినా సరే నేను తెచ్చిన కేక్ కట్ చేయాలని సేనాపతి అంటాడు. అదేంటీ నాన్న ఇలా చేస్తే మా అత్తమామ బాధపడరా అని అంటుంది. మా బిజ్జల మామది విభజించు పాలించు సిద్ధాంతం. ఇలాగే ఉంటుందని ధీరజ్ కౌంటర్స్ వేస్తాడు. కేక్ ఎవరిది అయితే ఏముందిలేరా అని వేదవతి అంటుంది.
వల్లికి వేదవతి తిట్లు
శారదను కేక్ కట్ చేయమంటుంది వేదవతి. కట్ చేయండి అసలు పని ముందుంది అని వల్లి అంటే.. అదేంటని వేదవతి అంటుంది. చాలా వంటలు చేశారుగా. భోజనం ఉందని శ్రీవల్లి అంటుంది. పాము మెలికలు తిరిగినట్లు అన్ని వంకర్లు తిప్పాలా. సరిగా చెప్పొచ్చుగా అని శ్రీవల్లిని తిడుతుంది వేదవతి. శారద అందరిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇది నా పాతికేళ్ల ఆశే. ఈ సంతోషాన్ని చూడకుండా పోతానేమో అని బాధపడ్డాను. నా ఆనందాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రాణం పోయేవరకు ఈ సంతోషం చాలు అని ఏడుస్తుంది శారద. తర్వాత కేక్ కట్ చేస్తుంది శారద. అందరూ విషెస్ చెబుతారు. భద్రావతి కేక్ తినిపిస్తుంటే.. ఆగమని సేనాపతి అంటాడు.
ముందు వాళ్లనే పెట్టనివ్వు. వాళ్లనే తినమను అని సేనాపతి అంటాడు. ఎందుకు అలా, ఈ కేక్‌లో ఏమైనా కలిపారా ఏంటీ అని ధీరజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మనం తెచ్చిన కేక్ కాదని సడెన్‌గా కేక్ తెప్పించాడు. ఈ కేక్ కట్ చేయాలని పట్టుబట్టాడు. ఫస్ట్ మేమే తినిపించాలని, తినాలని కండిషన్ పెట్టాడు. అన్ని చూస్తుంటే ఏదైనా విష ప్రయోగం ప్లాన్ చేశాడేమోననే డౌట్ రాకుండా ఎలా ఉంటుందని ధీరజ్ అనుమానిస్తాడు.
ధీరజ్‌ను తప్పుబట్టిన ప్రేమ
ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా అని ప్రేమ అంటుంది. ఒకేసారి ఇంత ఆప్యాయత చూపిస్తే డౌట్ రాకుండా ఎలా ఉంటుందని ధీరజ్ అంటాడు. వినడానికి అసహ్యంగా ఉందని ప్రేమ అంటుంది. ఇందులో ఏమైనా కలిపామనేగా నీ డౌట్ అని ఆ కేక్ భద్రావతి తింటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.