...
...
Next Story

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అపార్థాలు తొలగి మళ్లీ ఒక్కటైన ధీరజ్ ప్రేమ- చేయి పట్టి అత్తింటికి తీసుకొచ్చి!

Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో గీత దాటి ప్రేమ పుట్టింటికి ధీరజ్ వెళ్తాడు. ప్రేమతో తన తప్పు ఒప్పుకున్న ధీరజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటాడు. ప్రేమ క్షమిస్తుంది. అపార్థాలు తొలగి మళ్లీ ధీరజ్, ప్రేమ ఇద్దరు ఒక్కటవుతారు. ప్రేమను అత్తింటికి తీసుకెళ్తాడు ధీరజ్.

Published on: Jul 30, 2026, 15:08:29 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో శ్రీవల్లి దెబ్బకు రామరాజు కుటుంబం విలవిల్లాడుతుంది. ధీరజ్, ప్రేమల పెళ్లి సీక్రెట్ వీడియో భద్రావతికి చూపించి, సేనాపతితో కలిసి పెద్ద స్కెచ్ వేసి భార్యాభర్తలను విడగొడుతుంది శ్రీవల్లి.

పొగడ్తల వర్షం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో

ఆ ఆనందంలో శ్రీవల్లి కుటుంబం సంబురాలు చేసుకుంటుంది. శ్రీవల్లి మహారాణి హోదా ఇచ్చి కుర్చీలో కూర్చోపెట్టి పొగడ్తల వర్షం కురిపిస్తారు తల్లిదండ్రులు. ధీరజ్, ప్రేమల ఫొటోను మంటల్లో పడేసి సైకో ఆనందాన్ని పొందుతారు. ఇక మెయిన్ టార్గెట్ నర్మద అని, ఆ భార్యాభర్తల కాపురంలో చిచ్చు పెట్టి ముక్కలు చేయాలని వాళ్ల ఫొటోను కూడా మంటల్లో వేస్తారు.

ఆ మంట చుట్టూ తిరుగుతూ వెకిలి ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకుంటారు శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్. అలాగే, ప్రేమ, ధీరజ్ పెళ్లి సీక్రెట్ దాచిపెట్టినందుకు నర్మదపై కోపంగా ఉంటాడు సాగర్. మీ తమ్ముడు ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడని, ఒక ఆడపిల్ల గౌరవం పోకూడదనే ఎవరికి చెప్పలేదని నర్మద సమర్ధించుకుంటుంది.

బుజ్జమ్మ మోసం తట్టుకోలేకపోతున్నా

అయినా సాగర్ వినడు. ఇంకోవైపు మేనకోడలి జీవితాన్ని కాపాడాలని చేసిన పని ఇప్పుడు ఇంతపెద్ద తప్పు అయి కూర్చుంటుందని అనుకోలేదని కొడుకు ధీరజ్‌తో చెప్పుకుంటూ బాధపడుతుంది తల్లి వేదవతి. అమ్మా నువ్వు అంతా మంచే చేశావ్, కానీ, అర్థం చేసుకునే సంస్కారం వాళ్లకే లేదని ధీరజ్ అంటాడు. తన భర్త రామరాజు ఎక్కడికి వెళ్లాడో ఏమైపోయాడో అని వేదవతి భయపడుతుంది.

తిరుపతి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ, రామరాజు వినడు. ఇంతలో ధీరజ్ వస్తాడు. ఏంటీ నాన్న జరిగినదానికి ఇంతలా తాగాలా, వద్దు ఇంటికి వెళ్దామని వేడుకుంటాడు ధీరజ్. వేదవతి, ధీరజ్‌ను ఇద్దరు కలిసి మోసం చేశారని రామరాజు అంటాడు. మోసం చేశారంటూ తాగిన మత్తులో పడిపోతాడు రామరాజు. దాంతో రామరాజును ఇంటికి తీసుకెళ్తారు.

మరుసటి రోజు ఉదయం ధీరజ్, ప్రేమ ఇద్దరి ఒకరిగురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ప్రేమ లేకుండా ఉండటం కష్టంగా భావిస్తాడు ధీరజ్. ప్రేమ కూడా అలాగే అనుకుంటుంది. కానీ, భద్రావతి చెప్పినట్లుగా తనను తీసుకెళ్లేందుకు అత్త వేదవతి, భర్త ధీరజ్ కానీ ఎవరు రాలేదని బాధపడుతుంటుంది ప్రేమ.

అపార్థాలన్నీ తొలగిపోయి

ప్రేమను తీసుకెళ్లమని సేనాపతితో అన్న మాటలు ధీరజ్ తలుచుకుని కుమిలిపోతాడు. ఇక ఇదంతా భరించడం తన వల్ల కాదని, ఎలాగైనా ప్రేమను తీసుకురావాలని అనుకుంటాడు ధీరజ్. అనుకున్నట్లుగానే గీత దాటి అత్తింట్లోకి అడుగుపెడతాడు ధీరజ్. బయట గార్డెన్‌లో ప్రేమ ఏడుస్తూ ఉండటం చూసి వెళ్లి ప్రేమ అని ప్రేమగా పిలుస్తాడు ధీరజ్.

ధీరజ్‌ను చూసి ప్రేమ షాక్ అవుతుంది. జరిగిన గొడవ గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. నీదంటే నీది తప్పని అనుకుంటారు. నేను అందరిముందు మాట జారాను. తప్పే. నన్ను క్షమించు. ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఈ అపార్థాలని, దూరాలని దాటి కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాం అని ధీరజ్ ప్రేమ చేయి పట్టుకుని వేడుకుంటాడు.

మళ్లీ ఒక్కటైన ధీరజ్, ప్రేమ

నేను నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఐయామ్ వెరీ సారీ రా అని ప్రేమ బాధగా చెబుతుంది. ధీరజ్‌ను ప్రేమ హగ్ చేసుకుంటుంది. తర్వాత మామ ఇంటి నుంచి ప్రేమ చేయి పట్టుకుని సంతోషంగా ధీరజ్‌ను తన ఇంటికి, అంటే ప్రేమ అత్తింటికి తీసుకొస్తాడు. ప్రేమ కూడా చాలా ఆనందంగా నవ్వుతూ వస్తుంది. అక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రోమో ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks