...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 20 ఎపిసోడ్: అమూల్యకు తప్పిన ప్రమాదం- విశ్వకు మైండ్ బ్లాక్ ట్విస్ట్- డ్యాన్స్ ట్రాప్‌లో ప్రేమ?

Illu Illalu Pillalu Serial June 20th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 20వ ఎపిసోడ్‌లో విశ్వపై అమూల్యతో కేసు వాపసు తీసుకోమని రామరాజును వేడుకుంటుంది రేవతి. కానీ, రామరాజు ఒప్పుకోడు. అమూల్యకు యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు విశ్వ. కానీ, ధీరజ్ మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇస్తాడు.

Published on: Jun 20, 2026, 08:14:57 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో విశ్వకు బెయిల్ రావడమే కష్టమైనప్పుడు కోర్టులో తీర్పు అనుకూలంగా ఎలా వస్తుంది అని సేనాపతి అంటుంది. దీనికి పరిష్కారం పక్కనే పెట్టుకుని కంగారుపడతారేంటని తల్లి అంటుంది.

రామరాజు చెబితే

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 20వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 20వ ఎపిసోడ్

అమూల్య రామరాజు చెబితే వింటుంది. కోర్టులో సాక్ష్యం చెప్పదు అని సేనాపతి తల్లి అంటుంది. అవును, మీరు ఎంత ఇబ్బందిపెట్టిన ఏం చేసినా క్షమించాడే తప్పా ఏం చేయేలదని సేనాపతి భార్య అంటుంది. చాలు ఆపండి. ఆ కూలోడి ముందు నేను తగ్గాల. నేనే ఎలాగోలా నా మేనల్లుడుని కాపాడుకుంటాను అని భద్రావతి అంటుంది.

రేయ్ విశ్వ.. కోర్టు వాదనలు అయ్యేవరకు అమూల్య జోలికి వెళ్లకు. కేసు ఇంకా స్ట్రాంగ్ అవ్వొచ్చు అని భద్రావతి అంటుంది. కోపంగా వెళ్లిన విశ్వ.. కోర్టులో వాదనలు ఎలాగైనా జరగొచ్చు. నేను జైలుకు కూడా వెళ్లొచ్చు కానీ ఈలోపు అమూల్య సంగతి చూడకుండా ఉండను. నేను జైలుకు వెళ్లేలోపే దాని అంతు చూస్తా అని విశ్వ భీష్మించుకుంటాడు.

మరోవైపు వచ్చిన నోటీసు ఏంటో చూడండని రామరాజు అడుగుతాడు. ప్రేమ, నర్మద చూసి షాక్ అవుతారు. విశ్వపై చెల్లెలితో కేసు పెట్టించాం కదా. వచ్చే వారం నుంచి హియరింగ్ ఉంటుంది. విశ్వ కిడ్నాప్ చేసినట్లు అమూల్య సాక్ష్యం చెప్పాలని ధీరజ్ అంటాడు. పెళ్లి కావాల్సిన పిల్ల కోర్టుల చుట్టూ తిరిగితే దానికి పెళ్లి ఎలా అవుతుంది, నలుగురు ఏమనుకుంటారని వేదవతి అంటుంది.

నిరాకరించిన రామరాజు

వాడికి క్షమాభిక్ష పెట్టి క్షమిస్తే వాడు మారుతాడు కదరా అని అమ్మమ్మ అంటుంది. జైలు నుంచి వచ్చాకా కూడా పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. నా చెల్లిని ఏదోలా ఇబ్బంది పెడుతున్నాడని ధీరజ్ అంటాడు. వాడిని మార్చుకుంటాం. మీ కుటుంబం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాం. అన్నయ్య కేసు వెనక్కి తీసుకోమని చెప్పండి అని విశ్వ తల్లి రేవతి విన్నవించుకుంటుంది.

లేదు తీసుకోను. కూతురుకు చేసినదానికి నేనే శిక్ష వేయించాలి. నా భార్యతో ఉన్న అనుబంధం అడ్డుపడుతుంది. అన్నయ్య అని పిలుస్తున్నావ్ కాబట్టి నీకు ఏదైనా కష్టమొస్తే అండగా నిలబడతాను కానీ, ఈ విషయం నేను ఏం చేయలేను అని రేవతి విన్నపం నిరాకరించి రామరాజు వెళ్లిపోతాడు. ప్రేమ నువ్వైనా చెప్పే అని తల్లి అంటే.. అమ్మా అన్ని తెలిసి ఇలా అడగడం స్వార్థం అవుతుందని కూతురు అంటుంది.

డ్యాన్స్ ట్రాప్‌లో ప్రేమ

మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ కోసం విలేజ్‌ల నుంచి కొన్ని ఫొటోలు వచ్చాయని తన బాస్‌కు ఒకతను చూపిస్తాడు. సరైన అందం చూడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నా. ఇవ్వు అని తీసుకుని చూస్తాడు బాస్. ప్రేమ ఫొటో చూసి గుంటూరు కారంలా ఇంత ఘాటుగా ఉందేంట్రా అని బాస్ అంటాడు. తను ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంట్ సర్ అని ప్రేమ వీడియో చూపిస్తాడు.

అది చూసిన బాస్ మనకు కావాల్సింది టాలెంట్ కాదు. వాళ్లకు మీ అమ్మాయి డ్యాన్స్ కాంపిటీషన్‌లో సెలెక్ట్ అయిందని చెప్పి ఇక్కడికి రమ్మనండి. ఆ తర్వాత స్టెప్పులు నేను వేస్తాను అని బాస్ అంటాడు. సరే అని అతను వెళ్లిపోతాడు. అలా డ్యాన్స్ ట్రాప్‌లో ప్రేమ పడనుందని తెలుస్తోంది. మరోవైపు అమూల్య నడుచుకుంటూ వెళ్తుంటే.. కారులో విశ్వ ఉంటాడు.

మీ అన్న ధీరజ్ గాడు మా నాన్నకు యాక్సిడెంట్ చేసి చేయి విరగ్గొడతాడా. ఈరోజు ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆ బాధ మీ అన్నకు తెలుస్తుందని విశ్వ అంటాడు. అమూల్యను యాక్సిడెంట్ చేయడానికి వెళ్తాడు విశ్వ. ఇంతలో ధీరజ్ వస్తాడు. దాంతో ఆగిపోతాడు విశ్వ. వీడు ఇప్పుడు చూస్తే ఎలా అని భయంతో కారు అద్దాలు మూసుకుంటాడు విశ్వ.

అమూల్యకు తప్పిన ప్రమాదం

ధీరజ్ బైక్‌పై అమూల్య వెళ్లిపోతుంది. అలా ధీరజ్ తెలియకుండా వచ్చి కాపాడుతాడు. అమూల్యకు ప్రమాదం తప్పుతుంది. కానీ, ధీరజ్ తిరిగి వచ్చి విశ్వ కారు పక్కన ఆగి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. విశ్వను దిగమంటాడు ధీరజ్. ఇక్కడెందుకు ఉన్నావురా అని అడుగుతాడు. నీకెందుకు అని విశ్వ అంటే.. మరి పోలీసులు అడిగితే చెబుతావా. నా చెల్లి వచ్చే రోడ్డులో ఎందుకు ఉన్నావ్. ఏం ప్లాన్ వేశావని నిలదీస్తాడు ధీరజ్.

విశ్వ కంగారుపడతాడు. నేను క్యాజువల్‌గా వెళ్తున్నా. అయినా నీ చెల్లి ఈ రోడ్డులో రాదుగా అని విశ్వ అంటాడు. నా డౌట్ అదేరా. నా చెల్లి ఈ రోడ్డులోనే వస్తుందని నీకెలా తెలుసు. నేను వచ్చేటప్పటికీ నీ కారు చాలా ఫాస్ట్‌గా వస్తుంది. నన్ను చూసి ఉలిక్కిపడ్డావ్. నీ మాటల్లో కూడా టెన్షన్ కనపడుతుంది. లేడీస్‌తో కొట్టించిన బుద్ధి రాలేదా అని మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇస్తాడు ధీరజ్.

ఏంట్రా ఏం చేస్తావు. నీ తాటాకు చప్పళ్లకు భయపడే వాడు కాదురా ఈ విశ్వక్ అని అంటే.. ధీరజ్ ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేస్తాను. కేసు పెట్టిన అమ్మాయిని బెదిరింపులకు పాల్పడుతున్నావని మరో కేసు పెడతాను. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో వాళ్లే చెప్పిస్తారని ధీరజ్ అంటాడు. వద్దు. వాళ్లెందుకు ఊరికే ఉన్నా. సారీ అని విశ్వ భయపడిపోతాడు.

విశ్వకు ధీరజ్ వార్నింగ్

రేయ్ నా చెల్లి తిరిగే రోడ్డులో కాదు చుట్టు పక్కల ఉన్నా నీ శేష జీవితం జైలే అని ధీరజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు చిప్స్, కూల్ డ్రింక్ పట్టుకుని శ్రీవల్లి సుకన్యకు కనిపిస్తుంది. ఎందుకిదంతా అని సుకన్య అడిగితే..కచేరి అని చెప్పి ప్రేమ, నర్మద దగ్గరికి తీసుకెళ్తుంది. రా బల్లక్కాయ్.. బల్లక్కాయ్.. అని ఆహ్వానిస్తారు ప్రేమ, నర్మద. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe