Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాగ్యం జెడను ఇడ్లీ బాబాయ్ తన తలపై పెట్టుకుని మురిసిపోతాడు. యంగ్ ఏజ్‌లో రింగుల జుట్టు ఎక్కువగా ఉండేదని, ఖైదీ సినిమాలో చిరంజీవిలా ఉండేవాడినని ఇడ్లీ బాబాయ్ ఆనంద రావు అంటాడు.
చిరంజీవిల కాదు

దాంతో నేను పెళ్లి చేసుకున్నప్పడు అట్లపెనం లెక్క గుండు ఉండేది. లేచిపోయిన దాన్ని మళ్లీ వచ్చి పెళ్లి చేసుకున్నాను. చిరంజీవిలా కాదు అమ్మోరు సినిమాలో రామిరెడ్డికి అన్నలా ఉంటావని భాగ్యం అంటుంది. ఇంతలో భాగ్యంకు సుకన్య కాల్ చేసి దొరికేశాం దొరికేశాం. శ్రీవల్లిని చెకింగ్ కోసం హాస్పిటల్‌కు నర్మద తీసుకెళ్లిందని కంగారుగా చెబుతుంది.
ఇప్పుడు ఏం చేయాలని అని భయపడిపోతారు భాగ్యం అంతా. ఒక ప్లాన్ చెబుతాను. అది చేయండని చెబుతుంది సుకన్య. సరే అక్కడ చూసుకో మేము ఇక్కడ చూసుకుంటామని భాగ్యం అంటుంది. ఈ సుకన్య ఏంటో చూపించే టైమ్ వచ్చిందని అనుకుంటుంది. మరోవైపు ధీరజ్ ఎర్లీగా వెళ్తుంటే ప్రేమ ఆపి ఎందుకు అని అడుగుతుంది.
నిన్ను ఎస్సై చేయాలంటే కష్టపడాలిగా అని ధీరజ్ అంటాడు. నీ దగ్గర డబ్బు ఉంటే ఎస్సై అనే పురుగు మెసులుతుంది. ఇటు ఇవ్వరా అని ధీరజ్ నుంచి ప్రేమ డబ్బు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. అది సేనాపతి, విశ్వ చూస్తారు. వాళ్లను ధీరజ్ చూస్తారు. హో కూతురు నాతో ప్రేమగా ఉండటం చూసి మా బిజ్జల మావయ్యకు కోపం వస్తుందనుకుని వాళ్లు చూస్తుండగానే నడుము గిల్లుతాడు.
ప్రేమతో ధీరజ్ రొమాన్స్
ప్రేమ అరుస్తుంది. తర్వాత బుగ్గ గిల్లుతాడు ధీరజ్. ఏంట్రా గిల్లావ్. నొప్పి పెడుతుందని ప్రేమ అంటుంది. అయ్యో అని చెప్పి వాటేసుకుంటాడు ధీరజ్. అలా నాన్న, అన్న ముందే ప్రేమతో రొమాన్స్ చేస్తాడు ధీరజ్. ధీరజ్‌ను తోసేస్తుంది ప్రేమ. కోపంతో చేయిని పక్కకు అంటాడు సేనాపతి. దాంతో దెబ్బ తాగుతుంది. సేనాపతి అరుపుకు ప్రేమ చూస్తుంది.
{{/usCountry}}ప్రేమ అరుస్తుంది. తర్వాత బుగ్గ గిల్లుతాడు ధీరజ్. ఏంట్రా గిల్లావ్. నొప్పి పెడుతుందని ప్రేమ అంటుంది. అయ్యో అని చెప్పి వాటేసుకుంటాడు ధీరజ్. అలా నాన్న, అన్న ముందే ప్రేమతో రొమాన్స్ చేస్తాడు ధీరజ్. ధీరజ్‌ను తోసేస్తుంది ప్రేమ. కోపంతో చేయిని పక్కకు అంటాడు సేనాపతి. దాంతో దెబ్బ తాగుతుంది. సేనాపతి అరుపుకు ప్రేమ చూస్తుంది.
{{/usCountry}}ఇదంతా ఇందుకా అనుకుంటుంది. అయ్యో బిజ్జల మావయ్య మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు అయింది. కూతురు బాగుంటే ఓర్వని తండ్రివి. నీకంటే దిక్కుమాలిన బతుకు ఉంటుందా అని సెటైర్లు వేస్తాడు ధీరజ్. విశ్వ గొడవ పడతాడు. వాడితో మనకేంటీ అని విశ్వతో సేనాపతి అంటాడు. ఇద్దరు బైక్‌పై వెళ్లిపోతాడు. అసలు నీ చేయి విరిగింది నీ కూతురు అని ధీరజ్ చెప్పబోతుంటే ప్రేమ ఆపుతుంది.
తర్వాత ధీరజ్ వెళ్లిపోతాడు. మరోవైపు శ్రీవల్లిని నర్మద స్కూటీపై తీసుకెళ్తుంది. శ్రీవల్లి తెగ కంగారుపడుతుంది. మరోవైపు ఆటో డ్రైవర్‌గా సుకన్య డ్రెస్ వేసుకుంటుంది. మొహానికి కర్చీఫ్, కళ్లకు బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని ఆటో నడుపుతుంది సుకన్య. నర్మద స్కూటీని గుద్దుతుంది సుకన్య. దాంతో నర్మద బ్రేక్ వేస్తుంది. నర్మద బ్రేక్ వేయడంతో శ్రీవల్లి కిందపడిపోతుంది.
కడుపు పోయిందని నాటకం
కట్ చేస్తే శ్రీవల్లి హాస్పిటల్‌లో ఉంటుంది. ఇడ్లీ బాబాయ్, సుకన్య, భాగ్యం చూస్తారు. ఇంకా లేవట్లేదని కంగారుపడతారు. అంతలోనే స్పృహలోకి వస్తుంది. నేను ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నానా అని శ్రీవల్లి అంటుంది. ఇంతలో డాక్టర్ అవును అంటూ ఎంట్రీ ఇస్తుంది. డాక్టర్ మెరుపు తీగగా జబర్దస్త్ లేడి కమెడియన్ పవిత్ర ఎంట్రీ ఇస్తుంది.
ఇడ్లీ బాబాయ్ మెలికలు తిరిగిపోతాడు. సారీ టు సే దిస్. మీకు లేదమ్మా. పోయింది. కడుపు పోయిందమ్మా అని డాక్టర్ చెబుతుంది. దాంతో తెగ సంతోషిస్తుంది శ్రీవల్లి. కడుపు పోయే అంటూ డ్యాన్స్ చేస్తుంది. అసలు నీకు కడుపు ఏడుందే అని భాగ్యం అంటుంది. మరి ఈ డాక్టర్ అని శ్రీవల్లి అంటే.. నేను మెరుపు తీగ. స్వీపర్‌ని అని చెబుతుంది ఆమె.
తను నా ఫ్రెండ్ అని సుకన్య చెబుతుంది. నర్మద వల్ల నీ కడుపు పోయిందని నాటకం బాగా రక్తి కట్టించాలని, ఆ నింద నర్మదపై వేయాలని భాగ్యం అంటుంది. మరోవైపు నర్మద నొప్పితో మెల్లిగా నడుస్తుంది. వేదవతి, ధీరజ్, ప్రేమ వస్తారు. వల్లి నేను వస్తుంటే ఆటో వచ్చి గుద్దింది. సడెన్‌గా వచ్చి గుద్దేశాడని నర్మద అంటుంది. ఎవరైనా కావాలనే గుద్దారా అని ధీరజ్ అంటే.. ఏమో తెలియదని నర్మద అంటుంది.
డాక్టర్ మెరుపు తీగ డైలాగులు
అదంతా విన్న భాగ్యం డ్రామా స్టార్ట్ చేస్తుంది. భాగ్యం మాటలు విని లోపలికి వెళ్తారు వేదవతి వాళ్లు. వల్లికి ఏమైందని వేదవతి అడుగుతుంది. భాగ్యం ఏడుస్తూ డ్రామా చేస్తుంది. నా డైలాగులు మీరే చెబితే నా క్యారెక్టర్ ఎందుకు అని డాక్టర్ మెరుపు తీగ అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.