Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో డ్రగ్స్ కేసులో ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు రామరాజు ఇంట్లో చెబుతుంది నర్మద. దాంతో సాగర్ చప్పట్లు కొడతాడు. ఇందాక ఎవరో పెద్దమనిషి నాకు గీతోపదేశం చేశారు. వాడిలా నన్ను ఎదగమన్నారు. ఇలానేనా అని తండ్రిపై వెటకారంగా మాట్లాడుతాడు సాగర్.
ముగ్గురు కొడుకులను వేరు వేరుగా

వేదవతి తిడుతుంది. చిన్నోడు అరెస్ట్ అయినందుకు బాధగానే ఉంది. కానీ ఈ మనిషి ముగ్గురు కొడుకులను వేరు వేరు దృష్టితో చూస్తున్నాడు చూడు ఆ పెద్ద మనిషికి చెబుతున్నాను. ఆరోజు నేను జాబ్ కొనుక్కుంటే రక్తపు కూడు తింటున్నా అన్నారుగా. మరి చిన్నోడిని ఏమని అంటాడు ఈ పెద్ద మనిషి అని సాగర్ అంటాడు.
వాడు నీలా దొంగ కాదు. వాడితో పోల్చుకోకు. వాడు ప్రాణం పోయిన తప్పు చేయడు. ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది అని రామరాజు అంటాడు. పోలీస్ స్టేషన్‌కు రామరాజు, వేదవతి, నర్మద వెళ్తారు. అదంతా చూసిన వల్లితో సుకన్య నీకు ఇది గుడ్ న్యూస్. ఈ బాధలో వారు నీ కడుపు మీద ఫోకస్ పెట్టరని అంటుంది. లాకప్‌లో దెబ్బలతో ఉన్న ధీరజ్‌ను చూసి వేదవతి ఏడుస్తుంది.
రామరాజు ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. అసలు నిన్ను అరెస్ట్ చేయడం ఏంట్రా అని అడిగితే.. తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిన నిజం చెబుతాడు ధీరజ్. నువ్వు నాకు వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం లేదురా అని రామరాజు అంటాడు. ఎస్సై వచ్చి అందరిని ఏంటీ న్యూసెన్స్. నీ కొడుకు డ్రైవర్ ముసుగులో ఉన్న స్మగ్లర్ అని అంటాడు.
నీ ఆధ్వర్యంలోనే సప్లై
ధీరజ్ అలాంటివాడు కాదని రామరాజు ఫ్యామిలీ అంతా చెబుతుంది. కానీ, ఎస్సై వినడు. తండ్రికి తెలియకుండానే కొడుకు చేస్తున్నాడా. నాకు తెలిసి నీ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ సప్లై చేస్తున్నాడనుకుంటా అని ఎస్సై రామరాజుపై నేరారోపణ చేస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. రామరాజు కోప్పడుతాడు. నా స్టేషన్ నుంచి బయటకు నడవండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని ఎస్సై అంటాడు.
{{/usCountry}}ధీరజ్ అలాంటివాడు కాదని రామరాజు ఫ్యామిలీ అంతా చెబుతుంది. కానీ, ఎస్సై వినడు. తండ్రికి తెలియకుండానే కొడుకు చేస్తున్నాడా. నాకు తెలిసి నీ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ సప్లై చేస్తున్నాడనుకుంటా అని ఎస్సై రామరాజుపై నేరారోపణ చేస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. రామరాజు కోప్పడుతాడు. నా స్టేషన్ నుంచి బయటకు నడవండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని ఎస్సై అంటాడు.
{{/usCountry}}ఎస్సై చెప్పడంతో రామరాజు ఫ్యామిలీని పోలీసులు బయటకు లాక్కెళ్తారు. కోర్టుకు వెళ్తే చిన్నోడి జీవితానికి పెద్ద మచ్చ అవుతుందని, వాడిని బయటకు తీసుకొచ్చేందుకు ఏదోటి చేయమని వేదవతి ఏడుస్తుంది. లాయర్‌తో మాట్లాడానని రామరాజు అంటుండగా లాయర్ వస్తాడు. ఎస్సైతో లాయర్ మాట్లాడుతాడు. ఎస్సై జరిగింది చెబుతాడు.
లాయర్ స్టేషన్ బెయిల్ అడుగుతాడు. దీనికి అసలు కోర్టులో బెయిల్ వస్తుందా. టైమ్ వేస్ట్ చేయకుండా వెళ్లండి సర్ అని ఎస్సై అంటాడు. దాంతో ధీరజ్ దగ్గరికి వెళ్లి కోర్టులో బెయిల్‌కు ట్రై చేద్దాం. నువ్వేం కంగారుపడకు అని లాయర్ అంటాడు. ఎంత చెప్పిన ఎస్సై వినట్లేదు. కోర్టులోనే బెయిల్ తెచ్చుకోమంటున్నారు, ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని అని లాయర్ అంటాడు.
దగ్గరివాల్లే కావాలని ఇరికించారు
అక్కడ జరిగింది ప్రేమ చెబుతుంది. అన్యాయంగా ఇరుక్కున్నాడు అని నర్మద చెబుతుంది. ఇరుక్కోవడం కాదు కావాలనే ఎవరో ఇరికించారు అని లాయర్ అంటాడు. మీ అబ్బాయి కారులో వెళ్లడం అక్కడే బుట్టలతో స్మగ్లర్ ఉండటం. అదే దారిలో పోలీసులు ఉండటం అంతా ప్లాన్‌లా ఉంది. ఆ రూట్‌లో ఎన్నో ఆటోలు వెళ్తాయి. కానీ, వాడు మీ అబ్బాయి కారు వచ్చేదాక ఆగాడు అని లాయర్ అంటాడు.
బుట్టలో మామిడి కాయల అడుగున మాదకద్రవ్యాలు పెట్టారు. వాడు అక్కడి నుంచి పారిపోతుంటే పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. దృష్టి అంతా ధీరజ్ పైనే పెట్టారు. అంటే ఇది ధీరజ్‌ను ఇరికించేందుకు వేసిన పక్కా ప్లాన్. అందులో ఏ డౌట్ లేదని లాయర్ అంటాడు.
ఇదంతా ఎవరికి అవసరం ఉందని ప్రేమ అంటుంది. కనిపించని శత్రువులు ఉండొచ్చుగా. పగ తీర్చుకునేందుకు చేసి ఉండొచ్చు కదా. కానీ, పక్కాగా చెబుతున్నా ఇదంతా ఎవరో బాగా తెలిసిన వాళ్లే చేశారు అని లాయర్ అంటాడు. మా అబ్బాయిని ఎలాగైనా బయటకు తీసుకురండి అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోర్టు నుంచి బెయిల్ తీసుకురావడం తప్పా ఏం చేయలేం. నా ప్రయత్నం నేను చేస్తానని, రేపు కోర్టులో కలుద్దామని లాయర్ వెళ్లిపోతాడు.
భాగ్యం ఫ్యామిలీ ఇమిటేషన్స్
ప్రేమ ఎక్కడ కనిపించదు. మరోవైపు భాగ్యం దగ్గర ధీరజ్ అరెస్ట్ అయింది సుకన్య, శ్రీవల్లి చెబుతారు. ధీరజ్ అరెస్ట్ అయితే వేదవతి ఎలా డ్రామా చేస్తుందో భాగ్యం అలాగే ఇమిటేట్ చేస్తుంది. రామరాజులా ఇడ్లీ బాబాయ్ నాటకం వేస్తాడు. పెద రాయుడు లెవెల్‌లో ఇడ్లీ బాబాయ్ డైలాగ్స్ చెబుతాడు. ఎస్సైగా భాగ్యం ఇమిటేట్ చేస్తుంది.
ఇడ్లీ బాబాయ్ యాక్టింగ్‌కు అంతా చప్పట్లు కొడతారు. పెద్దపులి వేషం పిల్లి పిల్ల వేసినట్లు ఉందని భాగ్యం అంటుంది. ఇప్పుడు మన ప్రేమ పావురం అని సుకన్య అంటే.. ప్రేమలా శ్రీవల్లి చేస్తుంది. అచ్చం ప్రేమలాగే డైలాగ్స్ చెబుతుంది శ్రీవల్లి. సుకన్యను పట్టుకుని ఏడుస్తున్నట్లు వల్లి యాక్టింగ్ చేస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.