Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సాగర్ రెడీ అవుతూ నర్మదను పిలిస్తాడు. నర్మద వచ్చి ఖాళీ టిఫిన్ బాక్స్ ఇస్తుంది. నెయ్యి వాసన బాగా వస్తుందిగా, జీడి పప్పు ఎక్కువగా వేశాను, ఎవరికి ఇవ్వకుండా తిను అని నర్మద సెటైర్లు వేస్తుంది. వెటకారంగా ఉందా అని సాగర్ అడుగుతాడు.
సాగర్‌కు గుర్తు చేసిన నర్మద

నీకేమైనా మతిమరుపు ఉందా. రోజులాగే టిఫిన్ బాక్స్ అడుగుతున్నావ్. మనం అందరితో కలిసి ఉంటున్నామా. విడిపోయి వేరు కాపురం ఉంటున్నామని, రాత్రికి రాత్రే ఉప్పులు, పప్పులు తీసుకొచ్చి పెట్టావా. వెంటనే టిఫిన్స్ రావడానికి అని గుర్తు చేస్తుంది నర్మద. సాయంత్రం సరుకలు తీసుకొస్తాను. ఈ ఒక్క పూటకి నేను బయట తింటాను, నువ్వు కూడా తిను అని సాగర్ వెళ్లిపోతాడు. నిన్ను మార్చాలి, గీత చెరిపేయాలి. ఎప్పటిలా అందరం కలిసి ఉండాలని నర్మద అనుకుంటుంది.
పేపర్ నిండా ఫ్యామిలీ గొడవలు అని తిరుపతి అంటాడు. సాగర్ కళ్లద్దాలు పెట్టుకుని వెళ్తుంటే రామరాజు పంచ్‌లు వేస్తాడు. ఇంట్లో కొందరు ఎలా పడితే అలా తిరుగుతారు. కానీ నట్టింట్లో గీత ఉందన్న విషయం మర్చిపోవద్దని, ముఖ్యంగా నాతో గీత దాటొద్దని అంటాడు సాగర్. తిరుపతిని పిలిచి కంటి ఆపరేషన్ చేయించుకున్నావా, కళ్ల కలక అద్దాలు పెట్టుకున్నావేంట్రా అని తిరుపతిని కొడతాడు రామరాజు.
దాంతో కళ్లద్దాలు తీస్తాడు సాగర్. గీతలు దాటడం కాదు. లేనిపోని ఆర్భాటాలకు పోకుంటే జీవితం పద్ధతిగా ఉంటుంది. లేకుంటే కష్టాలు పడాల్సిందే అని రామరాజు ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తాడు. దాంతో సాగర్ వెళ్లిపోతాడు. రేయ్ లంచం ఇచ్చి ఉద్యోగం కొనుకున్న నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని రోజు కంగారుగా ఉంటుందని రామరాజు అనుకుంటాడు. ఆ గొడవ అంతా నర్మద చూస్తుంది.
కాలేజ్ మానేస్తానన్న అమూల్య
మరోవైపు అమూల్యను కాలేజీకి వెళ్లమని వేదవతి చెబుతుంది. కాలేజీకి వెళ్లనని అమూల్య అంటుంది. దాంతో వేదవతి కోప్పడుతుంది. నేను పూర్తిగా కాలేజ్ మానేస్తానని అమూల్య చెబుతుంది. ధీరజ్‌కు ఈ విషయం తెలిసి విశ్వగాడికి భయపడొద్దని చెప్పానుగా. నేను డ్రాప్ చేస్తానని అంటాడు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండని అమూల్య ఏడుస్తుంది. ఏం జరిగిందని నర్మద డౌట్‌తో అడుగుతుంది.
{{/usCountry}}మరోవైపు అమూల్యను కాలేజీకి వెళ్లమని వేదవతి చెబుతుంది. కాలేజీకి వెళ్లనని అమూల్య అంటుంది. దాంతో వేదవతి కోప్పడుతుంది. నేను పూర్తిగా కాలేజ్ మానేస్తానని అమూల్య చెబుతుంది. ధీరజ్‌కు ఈ విషయం తెలిసి విశ్వగాడికి భయపడొద్దని చెప్పానుగా. నేను డ్రాప్ చేస్తానని అంటాడు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండని అమూల్య ఏడుస్తుంది. ఏం జరిగిందని నర్మద డౌట్‌తో అడుగుతుంది.
{{/usCountry}}దాంతో కాలేజీలో జరిగింది అమూల్య చెబుతుంది. కాలేజీలో విశ్వక్‌ని పెళ్లి చేసుకుని నెల రోజులు వాళ్ల ఇంట్లోనే ఉన్నావట కదా. పెళ్లితోపాటు ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందా. అది పెళ్లి కాదు పెళ్లిలాంటిది. మరి అయితే ఇక సింగిలే అన్నమాట. నువ్వు ఓకే అంటే చెప్పు ఇంటికొచ్చి మాట్లాడుతా. నన్ను పెళ్లి చేసుకుంటా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని నలుగురు అమూల్యను ఏడిపిస్తారు.
విశ్వ చెప్పడంతోనే వాళ్లు అలా చేస్తారు. ఏడుస్తూ అమూల్య వెళ్లిపోతుంది. నువ్వు ఒప్పుకునే వరకు రోజు వస్తాం. ఇక్కడే ఉంటామని వాళ్లు అంటారు. అదంతా ఇంట్లోవాళ్లకి చెబుతుంది అమూల్య. దాంతో ధీరజ్ కోపంగా వాడి అంతు చూస్తానని అంటాడు. ఇలా కోప్పడతావనే చెప్పలేదని అమూల్య ఆపుతుంది. ఈ విషయం చెబితే నువ్వు, నాన్న వాన్ని చంపి జైలుకు వెళ్తారు అందుకే చెప్పలేదంటుంది అమూల్య.
విశ్వక్ చాలా తెలివిగా ఉన్నాడు
అలా అని వాన్ని వదిలిపెట్టాల అని ధీరజ్ అంటాడు. ఈ విషయంలో విశ్వక్ చాలా తెలివిగా ఉన్నాడు. విశ్వక్ ఇన్వాల్వ్ అవ్వకుండా వేరేవాళ్లతో వేధించేలా చేశాడు. ఇప్పుడు నువ్వు కొడితే నేను ఏమైనా అన్నాన అని రివర్స్ అవుతాడు అని నర్మద అంటుంది. నువ్వెళ్లి విశ్వను కొడితే రివర్స్‌లో నీపైనే కేస్ పెడతాడు. దీన్ని వేరేలా డీల్ చేయాలని ప్రేమ అంటుంది. ఈ విషయాన్ని నేను డీల్ చేయను, మీతోనే చేయిస్తానని ధీరజ్ అంటాడు.
విశ్వ చేసినదానికి కౌంటర్‌గా ధీరజ్ ఏదో ప్లాన్ చేస్తాడు. మరోవైపు చిన్న పిల్లల ఫొటోలు చూస్తూ చందు మురిసిపోతాడు. గోడలకు పాపాయిల ఫొటోలు తగిలిస్తాడు. శ్రీవల్లి వచ్చి అడిగితే.. నీకోసమే. కడుపుతో ఉన్నవాళ్లు ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో జరిగే గొడవల వల్ల ప్రశాంతంగా ఉండలేవు. అందుకే పిల్లల ఫొటోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చందు అంటాడు. దానికి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
పాపం బావ చాలా ఆశలు నింపేసుకున్నాడు. రేపు ఇది అబద్ధం అని తెలిస్తే బావ తట్టుకోలేడు. తల్లడిల్లిపోతాడు. అది చూసి నేను తట్టుకోలేను, నేను బావను మోసం చేయేలను. ఏదైతే అది అయింది నిజం చెప్పేస్తాను అని శ్రీవల్లి అనుకుంటుంది. బావ నీకు ఒక నిజం చెప్పాలని, నిజం చెప్పాక అర్థం చేసుకుని నన్ను క్షమించాలి. బాధపడకూడదు. నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టొద్దు అని చందుతో అంటుంది శ్రీవల్లి.
చందుకు నిజం చెప్పిన శ్రీవల్లి
నాకు అర్థం కావట్లేదు. నిజమేంటీ, క్షమించడం ఏంటని చందు అడుగుతాడు. అది నా కడుపులో నిజంగా బిడ్డ లేదు అని చందుతో నిజం చెబుతుంది శ్రీవల్లి. అది విని చందు గుండె ముక్కలవుతుంది. మీరందరూ అనుకుంటున్నట్లుగా నేను కడుపుతో లేను. కడుపుతో ఉండటం అబద్ధం. ఇదంతా నాటకం. నువ్వు నన్ను ఇంట్లోకి రానిచ్చేందుకు మా అమ్మ డాక్టర్‌తో అబద్ధం చెప్పించింది అని శ్రీవల్లి చెబుతుంది. దాంతో కోపంగా శ్రీవల్లిని కొడతాడు చందు.
ఇంత నాటకం ఆడతారా నిన్ను అని చందు మరింత రెచ్చిపోతుంటే.. సూపర్ సూపర్ అంటూ సుకన్య పోన్‌లో వీడియో తీస్తూ ఎంట్రీ ఇస్తుంది. వల్లి నీ యాక్టింగ్‌కు విలక్షణ నటి అవార్డ్ ఇవ్వొచ్చు అంటుంది సుకన్య. యాక్టింగ్ ఏంటని చందు అడుగుతాడు. వల్లి కడుపుతో లేదని ప్రాంక్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకుందామని. ఉత్తుత్తగే ప్రాంక్ వీడియో చేశామని సుకన్య కవర్ చేస్తుంది.
బుద్ధి లేదా ఇలాంటివి ప్రాంక్ చేస్తారా. కడుపుతో లేవని అనేసరికి నా ప్రాణం పోయినట్టయింది. ఇంటికి మూడోతరం రాబోతుందని అమ్మనాన్న సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వాటిలో జోకులు వేస్తారో. నిన్ను క్షమించి ఇంట్లోకి రానివ్వడానికి కారణం నీ కడుపులో బిడ్డ. ఆ బిడ్డ విషయంలో ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు చందు.
నీ కాపురానికి గొయ్యి తవ్వుకోకు
ఒసేయ్ తింగరిదానా. నేను మ్యానేజ్ చేయకుంటే నువ్వు నడిరోడ్డు మీద ఉండేదానివి. ఎందుకే నిజం చెప్పావ్ అని సుకన్య తిడుతుంది. బావ బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకుంటున్నాడని, బావను మోసం చేస్తున్నాననిపించిందని శ్రీవల్లి అంటుంది.
నోరు జారి నిజం చెప్పేస్తే నీ కాపురాన్ని నువ్వే తగులబెట్టుకున్నట్లుగా అవుతుందని. నిన్ను మీ ఆయన్ని కలిపి ఏదోలా నెల తప్పేలా చేస్తాను. నీ కాపురానికి గొయ్యి తవ్వుకోకుండా సైలెంట్‌గా ఉండు అని సుకన్య అంటుంది. శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.