Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌తో దూరంగా ఉండటం ఎంత నరకంగా ఉందో చెబుతుంది ప్రేమ. తిరిగి నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను. మళ్లీ నా ఊపిరి తిరిగొచ్చినట్లుందని ప్రేమ సంతోషంగా అంటుంది. ప్రేమను వెనుక నుంచి ధీరజ్ హగ్ చేసుకుంటాడు. ఈసారి కొత్త ప్రయాణమే అని ప్రేమ అంటుంది.
దెయ్యంలా పట్టుకుంటాను

ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు. మళ్లీ మీ పుట్టింటికి తుర్రుమనొచ్చు అని ధీరజ్ అంటాడు. నేను నిన్ను దెయ్యంలా పట్టుకుని వేలాడుతాను. ఇప్పుడు బంధం మరింత గట్టిపడిందని ధీరజ్ గుండెలపై వాలిపోతుంది ప్రేమ. ధీరజ్ పాదాలపై తన కాళ్లు పెట్టి అటు ఇటు నడుస్తుంది ప్రేమ. మరోవైపు శ్రీవల్లి కుట్రల గురించి ఆలోచిస్తుంది నర్మద.
నీ బండారం బయటపెట్టే టైమ్ వచ్చేసిందని నర్మద అనుకుంటుంది. ఇంకోవైపు శ్రీవల్లి కూడా వణికిపోతుంటుంది. ఇంతలో వేదవతి గట్టిగా అరుస్తుంది. భోజనం వడ్డిద్దాం రా అని పిలుస్తుంది. ఇంట్లో అందరూ వస్తారు. చందు, ధీరజ్, తిరుపతి సీక్రెట్‌గా ముచ్చట్లు పెడతారు. ముగ్గురు తర్వాత తింటామంటారు. నీ గవర్నమెంట్ కోడలు ఏదని రామరాజు నర్మద పేరు తీస్తాడు.
దాంతో శ్రీవల్లి ఉలిక్కిపడుతుంది. అంతలోనే నర్మద వస్తుంది. నా పాలిట యమధర్మరాజులా వస్తుందని వల్లి భయపడుతుంది. సాగర్‌ను ఒక వేలు పట్టుకోమ్మంటుంది నర్మద. సాగర్ పట్టుకుంటాడు. ఇప్పుడే వల్లి బండారం బయటపెట్టాలని వెళ్తుంది. రామరాజుతో ఓ విషయం చెప్పాలని నర్మద అంటుంటే.. ఏది లేదని. కూర్చుని తినమని ప్రేమ అడుగుతుంది. వేదవతి ఆర్డర్ వేస్తుంది.
గుర్తుండిపోయేలా సెల్ఫీ
దాంతో చేసేదేం లేక తినడానికి కూర్చుంటుంది నర్మద. వల్లిని కూడా అందరు కూర్చోమంటారు. చందు, సాగర్, ధీరజ్, తిరుపతి అందరికి వడ్డిస్తారు. ఇది చాలా స్పెషల్ మూమెంట్, గుర్తుండిపోయేలా సెల్ఫీ తీసుకుందామని అమూల్య అంటుంది. ఈ ఆనందం అంతా నీవల్లే అని నర్మదను పొగుడుతాడు రామరాజు. ఎలాంటి గొడవలు, కలహాలు లేకుండా నా వాళ్లు ఇలా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని రామరాజు అంటాడు.
అలా నర్మద నిజం చెప్పకుండా రామరాజు ఆపుతాడు. భోజనం పూర్తవుతుంది. రామరాజు మాటల గురించే నర్మద ఆలోచిస్తుంది. నిజం చెప్పేందుకు సతమతం అవుతుంది నర్మద. ఇప్పుడు కుటుంబాన్ని బాధపెట్టాలా. ఎలా బయటపెట్టాలని రామరాజు మాటలకు నర్మద కరిగిపోతుంది. ఇంతలో శ్రీవల్లి ఏడుస్తూ వస్తుంది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతున్నా. లోపల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని వల్లి అంటుంది.
{{/usCountry}}అలా నర్మద నిజం చెప్పకుండా రామరాజు ఆపుతాడు. భోజనం పూర్తవుతుంది. రామరాజు మాటల గురించే నర్మద ఆలోచిస్తుంది. నిజం చెప్పేందుకు సతమతం అవుతుంది నర్మద. ఇప్పుడు కుటుంబాన్ని బాధపెట్టాలా. ఎలా బయటపెట్టాలని రామరాజు మాటలకు నర్మద కరిగిపోతుంది. ఇంతలో శ్రీవల్లి ఏడుస్తూ వస్తుంది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతున్నా. లోపల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని వల్లి అంటుంది.
{{/usCountry}}నీ నాటకాలు నా దగ్గర కాదు. ప్లేట్‌తో కొడతానంటుంది నర్మద. మావయ్య గారి ముందు బయటపెట్టొద్దని బతిమిలాడుకుంటుంది శ్రీవల్లి. మరి దమ్ముంటే బయటపెట్టు నేనే వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశావుగా. అప్పుడేమైందని నర్మద అంటుంది. కావాలంటే ధీరజ్, ప్రేమల కాళ్లు పట్టుకుని బతిమిలాడతాను. నువ్వు ఈ కుటుంబం ముక్కలు కాకుండా చూడు. మావయ్య గురించి, చందు బావ గురించి ఒక్కసారి ఆలోచించు అని వల్లి అంటుంది.
అన్నదమ్ములతో మామ మందు సిట్టింగ్
దాంతో నర్మద ఆలోచిస్తుంది. వర్కౌట్ అయ్యేలా ఉందని సైకోలా నవ్వుతుంది వల్లి. నేను మారిపోతాను అని వల్లి అంటుంది. ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో రేపు చూసుకుందాం అని నర్మద ఒక్కరోజు గడువు ఇచ్చి వెళ్లిపోతుంది. అంటే వల్లి డ్రామా వర్కౌట్ కాదు. మరోవైపు ముగ్గురు అన్నదమ్ములు, తిరుపతితో కలిసి మందు సిట్టింగ్ వేస్తాడు. ధీరజ్, ప్రేమ కలవడానికి కారణం నేను అని తిరుపతి చెబుతాడు.
సుకన్యకు నాకు పెళ్లి చేయడం వల్లే మీరిద్దరు కలుసుకోడానికి బాటలు పడ్డాయని తిరుపతి అంటాడు. కాదంటే గుక్కపట్టి ఏడుస్తావుగా సరే అని ధీరజ్ అంటాడు. మీకు శోభనం కాలేదటగా అని తిరుపతి అడిగితే.. మరి నీ సంగతి ఏంటని ధీరజ్ అడుగుతాడు. దాంతో తిరుపతి ఏడుస్తాడు. అందరు మన పెళ్లిని ఒప్పుకుంటేకానీ దగ్గరికి రానివట్లేదు. కనీసం ముట్టుకోనివ్వట్లేదని తిరుపతి అంటాడు.
శోభనం ముచ్చట్లు
అయితే జీవితకాలం నీకు ఏడుపు తప్పదు. నీ పెళ్లిని అందరూ ఒప్పుకోవడం జీవితంలో జరగదని సాగర్ అంటాడు. అలా మామ తిరుపతితో అన్నదమ్ములు శోభనం ముచ్చట్లు పెడతారు. చందు తెగ తాగుతాడు. నాన్న గెలిచాడు. ఆ భద్రావతి వాళ్లపై గెలిచాడు. వాళ్ల నోరు మూసుకునేలా చేశాడురా నాన్న అని చందు సంతోషంగా తాగుతు ఉంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.