Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ పెళ్లి చేస్తానని భద్రావతితో చేసిన ఛాలెంజ్ నాన్న గెలిచాడంటూ చందు బాగా తాగుతాడు. పెళ్లి అయిందన్న ఆనందంలో నువ్వు కూడా తాగురా అని ధీరజ్‌ను అంటాడు సాగర్.
పులినంటూ సాగర్ గొప్పలు

వద్దని ధీరజ్ అంటే.. ఏరా నీ పెళ్లామంటే భయమారా అని సాగర్ అంటాడు. ఇంతలో నర్మద వస్తుంది. నర్మదను చూస్తాడు ధీరజ్. నా సంగతి సరే గానీ వదినకు నువ్వు భయపడకుండా చూసుకో అంటాడు ధీరజ్. రేయ్ నేను పులిరా. షేర్ బబ్బర్ షేర్. నాతో మీ వదిన భయపడుతూ మాట్లాడుతుందని సాగర్ గొప్పలు పోతాడు. అదే విషయం పక్కకు తిరిగి చెప్పు అని ధీరజ్ అంటాడు.
నర్మదను చూసి షాక్ అవుతాడు సాగర్. ఆయా షేర్ అని తిరుపతి అంటాడు. ముందు సాగర్‌ను, తర్వాత తిరుపతిని, ధీరజ్‌ను, చందును అందరిని తిడుతుంది నర్మద. సాగర్ వెళ్లిపోతాడు. నా పెళ్లాం కూడా వెయిట్ చేస్తుంది నేను కూడా వెళ్తున్నా అని ధీరజ్ వెళ్లిపోతాడు. సేమ్ డైలాగ్ కొట్టి చందు కూడా వెళ్లిపోతాడు.
మీకు ఎప్పుడో పెళ్లి అయిందిరా ఎప్పటినుంచే కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను కబుర్ల విషయంలో లేతపిల్లకాయిగాడినిరా. నేను కూడా వెళ్లి నా పెళ్లాంతో లేతలేత కబర్లు చెబుతాను అని తిరుపతి వెళ్లిపోతాడు. మరోవైపు ప్రేమ అందంగా రెడీ అవుతుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు. ప్రేమను చూసి షాక్ అవుతాడు. ఒకేసారి ఇంత హాట్‌గా ఉండటంతో షాక్ అయ్యానంటాడు ధీరజ్.
ఫస్ట్ నైట్ రోజు తాగొస్తారా
ప్రేమ సిగ్గుపడటం, ఏవండి అని పిలవడం చూసి ధీరజ్ షేక్ అవుతాడు. ఏంటే సడెన్‌గా ఏవండి అని బూతులు తిడుతున్నావ్. కోడి బుర్రకు ఏం కాలేదుగా అని ధీరజ్ అంటాడు. ఏంట్రా తూగుతున్నావ్. తాగొచ్చావా. ఫస్ట్ నైట్ రోజు ఎవడైనా తాగొస్తారా అని ప్రేమ తిడుతుంది. ఫస్ట్ నైట్ అన్నందుకు షాక్ అయి ప్రేమపైనే పడిపోతాడు ధీరజ్.
{{/usCountry}}ప్రేమ సిగ్గుపడటం, ఏవండి అని పిలవడం చూసి ధీరజ్ షేక్ అవుతాడు. ఏంటే సడెన్‌గా ఏవండి అని బూతులు తిడుతున్నావ్. కోడి బుర్రకు ఏం కాలేదుగా అని ధీరజ్ అంటాడు. ఏంట్రా తూగుతున్నావ్. తాగొచ్చావా. ఫస్ట్ నైట్ రోజు ఎవడైనా తాగొస్తారా అని ప్రేమ తిడుతుంది. ఫస్ట్ నైట్ అన్నందుకు షాక్ అయి ప్రేమపైనే పడిపోతాడు ధీరజ్.
{{/usCountry}}మరోవైపు రేపు నా అసలు రంగు బయటపెడాతనంది. తెల్లారితే నా సంగతి అంతే అని శ్రీవల్లి భయపడుతుంది. ఇంతలో చందు తాగిన మత్తులో వస్తాడు. చందు రొమాంటిక్‌గా చూస్తే నర్మద అసలు విషయం చెప్పిందా ఏంటని భయపడుతుంది వల్లి. శ్రీవల్లి చేతులు పట్టుకుంటాడు చందు. మరోవైపు దుప్పట్లు నర్మద సర్దుతుంటే కొంగు పట్టుకుని లాగుతాడు సాగర్.
వెనుకనుంచి నర్మదను హగ్ చేసుకుని ఇవాళ ఇంత రొమాంటిక్‌గా ఉన్నావేంటీ డార్లింగ్ అని కవిత్వం చెబుతాడు సాగర్. తాగినప్పుడు ఇలాగే కనిపిస్తామని నర్మద అంటుంది. ఈ వెచ్చని ఊపిరిని మరింత వెచ్చగా మార్చమని మల్లెతీగల అల్లుకుపోమ్మని పెదాలు చెబుతున్నాయంటూ రొమాంటిక్‌గా కవిత్వం చెబుతాడు సాగర్. ముద్దు పెట్టుకుంటాడు సాగర్.
అన్నదమ్ముల చిలిపి యుద్ధాలు
మరోవైపు సుకన్య దగ్గరికి తిరుపతి వెళ్తాడు. సుకన్య దగ్గరికి తిరుపతి రొమాంటిక్‌గా వెళ్తుంటే సుకన్య పక్కకు తప్పుకుంటూ ఉంటుంది. మరోవైపు పిల్లలను కంటే అమ్మనాన్న అందరూ క్షమిస్తారని నానమ్మ చెప్పిందని చిలిపి యుద్ధం గురించి చెబుతుంది ప్రేమ. ధీరజ్‌పైకి రొమాంటిక్‌గా వెళ్తుంది ప్రేమ. వల్లిని చందు హగ్ చేసుకుంటాడు.
బెడ్‌పై నర్మదను సాగర్ పడేసి రొమాన్స్ చేస్తాడు. ప్రేమ ఒడిలో ధీరజ్ పడుకుంటాడు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు తమ భార్యలతో రొమాన్స్ చేస్తూ చిలిపి యుద్ధాలు చేస్తారు. మనం పిల్లలను కంటే మా నాన్న, అత్త దిగి మన దగ్గరికి వస్తారని ప్రేమ అంటుంది. దీనికంటే ముందు నీకు ఓ కల ఉంది. అదే పోలీస్ ఆఫీసర్. ముందు పోలీస్ అవ్వు తర్వాత పిల్లలను కందాం అని ధీరజ్ అంటాడు.
దాంతో ప్రేమ అప్సట్ అవుతుంది. లిప్స్ ఖాళీగా ఉన్నాయి. సంతకం పెడితే బాగుంటుందని ధీరజ్ అంటాడు. ఇది కూడా నేను ఎస్సై అయ్యాకే అని ప్రేమ అంటుంది. ధీరజ్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఇళ్లంతా ముగ్గులు వేసి తులసి కోటకు ప్రేమ పూజ చేస్తుంటుంది. అది చూసి నర్మద షాక్ అవుతుంది. ఓ వైపు ముగ్గులు, మరోవైపు పూజలు. ఇంత పొద్దున్నే ఇంతపెద్ద షాక్ ఇచ్చావేంటమ్మా. ఇదొక హఠాత్‌పరిణామం అని నర్మద అనుకుంటుంది.
జెన్ జీ కోడలు డ్యూటీ
ఎవరమ్మా నువ్వు. అచ్చం మా ప్రేమలా ఉన్నావ్ అని ఆటపట్టిస్తుంది నర్మద. కోడలి డ్యూటీ చేయిలిగా అని ప్రేమ అంటుంది. జెన్ జీ కోడలు కూడా ఇలా పాత సినిమాలో హీరోయిన్‌లా చేస్తుందంటే మాములు విషయం కాదు. మేడమ్ గారికి రాత్రంతా నిద్ర ఉండదు. ఏ మధ్యాహ్నామో లేస్తావనుకున్నా అని నర్మద అంటుంది. నేను పోలీస్ అయ్యేదాకా అలాంటిదేం లేదని నా మొగుడు గారు ఆర్డర్ వేశారని ప్రేమ అంటుంది.
ప్రేమను చక్కిగిలిగింతలు పెట్టి ఆటపట్టిస్తుంది నర్మద. నా సంగతి సరే అక్క ఆ బల్లి సంగతి ఏం చేశావ్ అని ప్రేమ అడుగుతుంది. ఆ మాట శ్రీవల్లి వింటుంది. పొద్దున్నే నా గురించి మొదలుపెట్టేశారేంటే అని తిట్టుకుంటుంది. ఆ బల్లి పాపాలచిట్టా మావయ్యగారి ముందు బయటపెట్టకుండా ఇంకా ఎందుకు ఆగుతున్నావని ప్రేమ అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.