...
...
Next Story

Illu Illalu Pillalu September 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లితో ప్రేమ కిడ్నాప్- సుకన్య నగలు లాక్కున్న కామాక్షి

Illu Illalu Pillalu Serial September 26th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 26వ ఎపిసోడ్‌లో ప్రేమ రాకుంటే ఇక జీవితంలో తన మొహం చూడనని ధీరజ్ అంటాడు. దాంతో వల్లి సైకోలా సంతోషిస్తుంది. వల్లి కుటుంబంతోనే ప్రేమను కిడ్నాప్ చేసేలా నర్మద ప్లాన్ చేస్తుంది. పెళ్లికి తిరుపతి జంట వెళ్తుంది.

Published on: Sep 26, 2026, 08:37:08 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లి మండపానికి బయలుదేరదామని సాగర్ అంటే.. ప్రేమ గురించి ఆలోచిస్తాడు ధీరజ్. అంతలా ఏం ఆలోచిస్తున్నావురా. ప్రేమ వస్తుందా రాదా అనా అని వేదవతి అడుగుతుంది.

వల్లి సైకోయిజం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 26వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 26వ ఎపిసోడ్

నా మీద తనకున్న ప్రేమ కచ్చితంగా వచ్చేలా చేస్తుంది. ఒకవేళ పంతానికి పోయి ప్రేమ రాకుంటే జీవితంలో నా మొహం తనకు చూపించను అని ధీరజ్ అంటాడు. ఒకవేళ ఇవాళ పెళ్లి జరగకపోతే మావయ్యగారు ఛాలెంజ్ చేసిన ప్రకారం నీకు ప్రేమకు ఎలాంటి సంబంధం ఉండదు కదూ. ఈ ఇంటికి ప్రేమ దూరంగా ఉండిపోతుంది కదా అని శ్రీవల్లి సంతోషంగా అంటుంది.

దాంతో వేదవతి బాగా తిడుతుంది. శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఇప్పుడు ఏమంటావ్ అని అడుగుతుంది నర్మద. దాంతో వల్లి భయపడిపోతుంది. ఇంతలో శారదాంబ కంగారుగా వచ్చి ప్రేమను చింతామణి ఇంట్లో బలవతంగా ఉంచాలని చూస్తుంది. రామరాజు గడువు పూర్తయ్యేసరికి అక్కడే ఉంచాలనుకుంటుంది అని శారదాంబ చెబుతుంది.

ప్రేమను బంధీగా ఉంచాలని చూస్తున్నారు. ఎలాగైనా తీసుకురావాలని సాగర్, చందు బయలుదేరుతారు. కానీ, ధీరజ్ ఆపుతాడు. నా మీద తనకు ప్రేమ ఉంటే ఎలాగైనా వస్తుందని ధీరజ్ అంటాడు. నమ్మకం ఉండచ్చుకానీ జాగ్రత్తగా కూడా ఉండాలిగారా అని సాగర్ అంటాడు. ఇంతలో రామరాజు వచ్చి ఏమైంది. ప్రేమ గుడికి వస్తుందిగా అని అంటాడు.

రౌడీలకు చింతామణి సూచనలు

ధీరజ్ నా మొహం చూడవారా. అయ్యో అందరిని బాధపెడుతున్నాను. బొమ్మలా మారిపోయి ఏం చేయలేకుండా ఉన్నానే. దేవుడా ఏంటీ నాకు పరీక్ష. పుట్టినిల్లు మెట్టినిల్లు అని తేల్చుకునే పరీక్ష పెట్టావ్ అని బాధపడుతుంది ప్రేమ. ఇంతలో చింతామణి వచ్చి మగవాళ్లు ఆడవాళ్లను లొంగదీసుకోడానికి ఇలాంటి ఛాలెంజ్‌లే చేస్తారని, బ్లాక్ మెయిల్ చేస్తారని, వాళ్ల ట్రాప్‌లో పడకు. ఆడదాని తోడులేకుండా మగాడు బతకలేడు. నీ మొగుడే నీ కాళ్లదగ్గరికి వస్తాడని చింతామణి చెబుతుంది.

ఆ ధీరజ్ గాడిని దెబ్బకొట్టే ఛాన్స్ భద్రావతి ఇస్తే ఉపయోగించుకోకుండా ఊరుకుంటానా. ఈ చింతామణి కాంపౌడ్‌లో కాలుపెట్టే ధైర్యం చేయగలరా అని చింతామణి అనుకుంటుంది. ఇంతలో భాగ్యం, ఇడ్లీ బాబాయ్, వల్లితో కారులో దిగుతుంది నర్మద. ఇలా ఇరికించేసావేంటే అని వల్లితో భాగ్యం అంటుంది. చింతామణి ఇంట్లోకి వెళ్లి ప్రేమను తీసుకురమ్మని నర్మద చెబుతుంది.

వల్లి ఫ్యామిలీతో ప్రేమ కిడ్నాప్ ప్లాన్

అసలే ప్రేమ కంచు. మేము రమ్మంటే వస్తుందా అని భాగ్యం అంటుంది. రాదు కాబట్టే కిడ్నాప్ చేసి తీసుకురండి. ఇలాంటి ఫోర్ ట్వంటీ పనులకు మీరే కరెక్ట్ అని నర్మద అంటుంది. చింతామణి ఇంటికి వెళ్లడం అంటే అండమాన్ నికోబార్‌కి వెళ్లినట్లే అని ఇడ్లీ అంటాడు. మరి ధీరజ్, ప్రేమను విడదీయడానికి బైక్‌పై రైడ్ చేశారుగా. వల్లి కుట్రలన్నీ మావయ్యకు చందుకు చెప్పనా అని నర్మద బ్లాక్ మెయిల్ చేస్తుంది.

దాంతో భయపడి సరేనని భాగ్యం వాళ్లు ఒప్పుకుని చింతామణి ఇంట్లోకి వెళ్తారు. మరోవైపు పెళ్లి మండపానికి అతిథులంతా వస్తారు. నర్మద వెళ్లింది. ప్రేమ వస్తుందో రాదో అని వేదవతి కంగారుపడుతుంది. ఇంతలో శారదాంబ, రేవతి, విశ్వ ముసుగులు వేసుకుని వస్తారు. మీరు దర్జాగా రావచ్చని రామరాజు అంటాడు. తిరుపతి, సుకన్య వస్తారు.

రేయ్ ఇప్పుడారా వచ్చేది అని తిరుపతిని తిడతాడు రామరాజు. సైకిల్ పంచర్ అయింది బావ. అందుకే ఫ్లైట్ మాట్లాడుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఇంతకీ నన్ను పెళ్లికి పిలిచారా అని తిరుపతి అంటాడు. నువ్వేమైనా బయటవాడివారా. స్పెషల్‌గా బొట్టు పెట్టి చెప్పడానికి అని రామరాజు అంటాడు. ఇంత సెంటిమెంట్‌తో కొట్టాకా ఏం చేస్తాను. అల్లుడి పెళ్లి గ్రాండ్‌గా చేస్తానని తిరుపతి లోపలికి వెళ్తాడు.

సుకన్య నగలు లాక్కున్న కామాక్షి

తిరుపతి, సుకన్యను చాలా కోపంగా చూస్తుంది వేదవతి. తిరుపతి పలకరించి భయపడతాడు. ధీరజ్‌తో మాట్లాడుతాడు. నన్ను పిలవకపోయిన వచ్చాను. హర్టింగ్‌లో ఉన్నా అని తిరుపతి అంటాడు. ఏంట్రా హర్టింగ్‌లో ఉన్నావా. ప్రేమ రాలేదని మేము కంగారుపడుతుంటే. ఒక్కటి కొడతానని వేదవతి అంటుంది. పెళ్లాం ముందు కొట్టకు అక్క అని తిరుపతి అంటాడు.

ఏయ్ దొంగ మామ నీ పెళ్లికి నాకు బంగారం పెడతాను అన్నావ్. ఇప్పుడు పెట్టు అని కామాక్షి అంటుంది. సుకన్య ఒంటిపై ఉన్న నగలు చూసి లాక్కుంటుంది కామాక్షి. ఇద్దరు తగువులాడుకుంటారు. కామాక్షిని వేదవతి ఆపి తిడుతుంది. ప్రేమ నువ్వు తప్పకుండా వస్తావని అనుకుంటున్నా. ఇది ఇద్దరికి పరీక్ష అని ధీరజ్ అనుకుంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks