...
...
Next Story

Illu Illalu Pillalu September 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- చింతామణి కిడ్నాప్-పెళ్లి మండపానికి స్వయంగా వచ్చిన ప్రేమ

Illu Illalu Pillalu Serial September 28th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 28వ ఎపిసోడ్‌లో ప్రేమను కిడ్నాప్ చేసేందుకు మత్తుమందుతో వెళ్తారు వల్లి గ్యాంగ్. కానీ, ప్రేమకు బదులు చింతామణిని కిడ్నాప్ చేస్తారు. ప్రేమ కోసం ఇంట్లో నర్మద వెతుకుతుంది. వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Published on: Sep 28, 2026, 08:34:59 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ కోసం చింతామణి ఇంట్లోకి శ్రీవల్లి గ్యాంగ్ దొంగచాటుగా వెళ్తుంది. కర్చీఫ్‌పై మత్తుమందు స్ప్రే చేస్తుంది వల్లి. కర్చీఫ్‌లో సెంట్ రాసుకుని చూస్తున్నావ్. ఇదేమైనా న్యాయమేనా అని భాగ్యం అంటుంది.

మత్తుమందు ఇద్దాం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 28వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 28వ ఎపిసోడ్

ఇది క్లోరోఫామ్. ప్రేమకు మత్తుమందు ఇచ్చి తీసుకెళ్తాదం. నర్మదకు ప్రేమను అప్పగించి చేసిన పాపాల్లో కొంచెమైనా కడిగేసుకోవచ్చు అని శ్రీవల్లి అంటుంది. చింతామణి ఫోన్ మాట్లాడుతుంటుంది. ముందు దీనికి ఇద్దామే మత్తుమందు. నన్ను కొట్టిందని భాగ్యం అంటుంది. తీరా ప్రేమ దగ్గరికి వెళ్లేసరికి క్లోరోఫామ్ పనిచేయకపోతే రౌడీలు వచ్చి మమ్మల్ని కొడతారు. అది తట్టుకునే శక్తి మాకు లేదని ఇడ్లీ బాబాయ్ అంటాడు.

టెస్ట్ చేస్తానని చెప్పి తనే వాసన చూస్తుంది వల్లి. దాంతో స్పృహతప్పి పడిపోతుంది శ్రీవల్లి. వల్లి మత్తుగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నిన్ను కూడా లాక్కెళ్లాలా అని భాగ్యం అంటుంది. ఇంతలో ఫ్లవర్ వాజ్ కిందపడేస్తుంది వల్లి. అది పగిలిన శబ్ధం విన్న చింతామణి రౌడీలను పంపి చూడమంటుంది. రౌడీలు వచ్చేసరికి భాగ్యం వాళ్లు మెట్లకింద దాక్కుంటారు.

భాగ్యం, ఇడ్లీ బాబాయ్, రౌడీలకు కరెంట్ షాక్

ఇది పిల్లి పడేసిందేమోరా అని పైకి వెళ్తారు రౌడీలు. మెట్లకింద వల్లిని కూర్చోమని చెప్పి ప్రేమ దగ్గరికి వెళ్తారు భాగ్యం, ఇడ్లి బాబాయ్. భాగ్యం ఎడమవైపు వెళ్దామంటే ఇడ్లీ బాబాయ్ బలవంతంగా రైట్ సైడ్ వెళ్దామంటాడు. తీరా అటు వెళ్లేసరికి రౌడీలు ఎదురుపడతారు. ఇంట్లో దూరిన పిల్లులు మీరేనా. మీకు ఇక దరువే అని రౌడీలు అంటారు. పక్కన స్విచ్ బోర్డ్ చూస్తాడు ఇడ్లీ బాబాయ్. కరెంట్ తీగ పట్టుకుంటారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్.

కారులో ప్రేమను పడేస్తారు. ప్రేమను తెచ్చాంగా ఇక మేము వెళ్తామని భాగ్యం అంటుంది. వల్లికి ఏమైందని నర్మద అడిగితే జరిగింది చెబుతాడు ఇడ్లీ బాబాయ్. సరే తను నిజంగా ప్రేమేనా అని నర్మద అంటుంది. నాకు తెలియదా.. ఎత్తుగా లావుగా ఉంటుంది. నేనే తీసుకొచ్చా అని వల్లి చెబుతుంది. పోలికలు తేడాగా ఉన్నాయి. ఓసారి చూద్దామని ఇడ్లీ బాబాయ్ అంటాడు.

ప్రేమకు బదులు చింతామణిని కిడ్నాప్

ముసుగు తీసి చూస్తే ప్రేమకు బదులు చింతామణి ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. ఒక్క మంచి పని కూడా సరిగా చేయలేదని తిడుతుంది నర్మద. తనే వెళ్తానని వెళ్తుంది నర్మద. వల్లిని కొడాతరు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. మరోవైపు ధీరజ్ పెళ్లిపీటలపై కూర్చుంటాడు. పంతులు పూజ మొదలుపెడతాడు. చింతామణి ఇంట్లోకి నర్మద వెళ్లి ప్రేమను పిలుస్తుంది.

ప్రేమ ఎక్కడ కనిపించదు. ఇంతలో వేదవతి కాల్ చేస్తుంది. ప్రేమ ఇక్కడ లేదని నర్మద చెబుతుంది. మనల్ని డైవర్ట్ చేయడానికి చింతామణి ఇల్లు చెప్పి ఇంకోచోట దాచారేమో అని నర్మద అంటుంది. ధీరజ్, ప్రేమ దూరమైపోతారేమో అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో ప్రేమే మండపానికి వస్తుంది. అది చూసి వేదవతి షాక్ అవుతుంది.

పెళ్లి మండపానికి స్వయంగా వచ్చిన ప్రేమ

పెళ్లి మండపానికి ప్రేమ వచ్చిందని నర్మదకు వేదవతి చెబుతుంది. నర్మద సంతోషిస్తుంది. ధీరజ్ ప్రేమతో ఉప్పొంగిపోతాడు. నా ప్రేమ నిజమైందని అనుకుంటాడు. కానీ, ప్రేమ మాత్రం బంధువులు కూర్చున్న చోట కూర్చుంటుంది. ప్రేమను రెడీ అవ్వమని వేదవతి అంటుంది. ప్రేమ సైలెంట్‌గా ఉంటుంది. అందరికి ఏం అర్థం కాకుండా చూస్తుండిపోతారు.

మరోవైపు చింతామణిని చూసి నిద్రపోతున్న డైనోసర్‌లా ఉందని ఇడ్లీ బాబాయ్ అంటాడు. చింతామణి మీద నీళ్లు కొడుతుంది వల్లి. భాగ్యం ఆపుతుంది. నర్మద వచ్చేవరకు ఆగడం వద్దు కారులో వెళ్లిపోదామని భాగ్యం వాళ్లు అనుకుంటారు. చింతామణిని ఇంటిగేటు ముందుపడేస్తారు.

చింతామణి తెలిసిన కిడ్నాప్

ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని చింతామణి కోపంగా లేస్తుంది. నదిలో పడేయడానికి సాయం పడుతున్నామని వల్లి అంటుంది. లేదు నువ్వు స్పృహ తప్పిపోతే లోపలికి తీసుకెళ్తున్నాం అంతే అని భాగ్యం చెబుతుంది. కిడ్నాప్ అయితే కాదు అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. ఇది నర్మద చూస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks