Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ బుల్లితెరపై అదిరే రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ స్టార్ మా సీరియల్ కు తెలుగు జనాలు జై కొడుతున్నారు. రామరాజు కుటుంబం చుట్టూ సాగుతున్న కథ మన ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సీరియల్ కు జనాల నుంచి క్రేజ్ దక్కుతోంది.
చందు రెండో పెళ్లి?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కాస్త హ్యాపీగా ఉంటారో లేదో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తాజాగా వల్లికి విడాకులు ఇస్తానని చందు భీష్మించుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో సీరియల్ లో చందుకు రెండో పెళ్లి జరుగుతుందా? అనే ప్రశ్న ఆడియన్స్ లో కలుగుతోంది.
అంజలి రీ ఎంట్రీ?
సీరియల్ లో చందుకు రెండో పెళ్లి చేస్తారనే అనుమానాలు రావడం వెనుక మరో కారణం కూడా ఉంది. అదే చందు మాజీ లవర్ అంజలి రీ ఎంట్రీ. బతుకమ్మ సంబరాల్లో భాగంగా అంజలి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె భర్త నుంచి విడిపోయింది. ఇక్కడ చూస్తే చందు ఏమో బల్లక్కాయ్ కు విడాకులిస్తానంటున్నాడు. ఈ నేపథ్యంలో చందు, అంజలికి పెళ్లి జరుగుతుందా? అనేది సస్పెన్స్ గా మారింది.
రామరాజు ఒప్పుకొంటాడా?
అయితే వల్లికి చందు విడాకులు ఇవ్వడానికి రామరాజు ఒప్పుకోవడం లేదు. వద్దంటే వద్దని స్పష్టంగా చెప్పాడు. కానీ చందు వినడం లేదు. తన జీవితాన్ని ఇప్పటికే నాశనం చేశారంటూ తండ్రిపైనే చందు తొలిసారి సీరియస్ అయ్యాడు. అయినప్పటికీ రామరాజు మాత్రం చందు కోపాన్ని ఎలా తొలగించాలా? అని ఆలోచిస్తున్నాడు. చందుకు అర్థమయ్యేలా చెప్పి వల్లిని తిరిగి ఇంటికి తీసుకురావాలని రామరాజు అనుకుంటున్నాడు.
ధీరజ్ కు హెల్ప్
మరోవైపు తన చిన్న కొడుకు ధీరజ్ ను కూడా ప్రేమతో కలిసి రామరాజు కాపాడాడు. ట్రావెల్ ఏజెన్సీ వేలం విషయంలో చింతామణిని వాడుకొని ధీరజ్ ను తన పాలేరును చేసుకోవాలని భద్రావతి పెద్ద కుట్రే వేసింది. కానీ ఈ విషయం విశ్వ చెవిన పడింది. అసలే మంచివాడిలా మారిపోయిన విశ్వ ఊరుకుంటాడా? నేరుగా వెళ్లి రామరాజు, ప్రేమకు తన అత్త కుట్ర గురించి చెప్పాడు.
{{/usCountry}}మరోవైపు తన చిన్న కొడుకు ధీరజ్ ను కూడా ప్రేమతో కలిసి రామరాజు కాపాడాడు. ట్రావెల్ ఏజెన్సీ వేలం విషయంలో చింతామణిని వాడుకొని ధీరజ్ ను తన పాలేరును చేసుకోవాలని భద్రావతి పెద్ద కుట్రే వేసింది. కానీ ఈ విషయం విశ్వ చెవిన పడింది. అసలే మంచివాడిలా మారిపోయిన విశ్వ ఊరుకుంటాడా? నేరుగా వెళ్లి రామరాజు, ప్రేమకు తన అత్త కుట్ర గురించి చెప్పాడు.
{{/usCountry}}కరెక్ట్ టైమ్ కు రామరాజు, ప్రేమ వెళ్లి భద్రావతికి దిమ్మతిరిగే షాకిచ్చారు. రామరాజు రూ.30 లక్షలు ఒకేసారి కట్టేశాడు. మరి రామరాజుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చందు విషయంలో తండ్రి ఏం చేయబోతున్నాడు? అనేది ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.