Illu Illalu Pillalu April 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ యాక్సిడెంట్ తో ఓ మలుపు తీసుకుంది. అయితే ఈ యాక్సిడెంట్ పై ప్రేమ అనుమానం వ్యక్తం చేయడంతో సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
ధీరజ్ గొప్పలు

ధీరజ్ ను ప్రేమగా బావ అని ప్రేమ పిలుస్తుంది. ప్రేమకు ధీరజ్ తినిపిస్తుంటాడు. ప్రేమకు పొలమారితే నీళ్లు తాగిపిస్తాడు. ఇద్దరూ రొమాంటిక్ గా ఓ సాంగ్ వేసుకుంటారు. అప్పుడే శారదాంబ, రేవతి వస్తారు. ఎలా ఉన్నావమ్మా అని ప్రేమను రేవతి అడిగితే, నా లాంటి భర్త ఉన్నాక ఇంకెలా ఉంటుంది? అంటూ ధీరజ్ గొప్పలకు పోతాడు.
భద్రావతి పిల్లి
భద్రావతి చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు వచ్చావేంటి అమ్మమ్మ అని శారదాంబను ధీరజ్ అడుగుతాడు. భద్రావతి అందరికి పెద్ద పులి ఏమో కానీ నా దగ్గర మాత్రం పిల్లిరా పిల్లి. నన్ను చూసి గజగజ వణికిపోతుందని శారదాంబ తెగ బిల్డప్ ఇస్తుంది. ఇదే మాట అక్కడున్న మీ పెద్ద కూతురిని చూసి చెప్పండని ధీరజ్ అనగానే శారదాంబ భయపడుతుంది.
ఆ రోజు కోసం
కలిసుందాం రా సినిమాలాగా మన రెండు కుటుంబాలు కలిసి పోయాయా ఏంటీ అని అప్పుడే వచ్చిన తిరుపతి కామెడీ చేస్తాడు. ఆ రోజు కోసమే పాతికేళ్లుగా ఎదురు చూస్తున్నానని, నా గొంతులో ప్రాణం ఉండగా అది జరుగుతుందో లేదోనని శారదాంబ ఫీల్ అవుతుంది. రేవతిని ఇంకా కాసేపు ఉండమని రామరాజు అడుగుతాడు. ఉండాలనే ఉంది కానీ, కూతురిని దొంగతనంగా చూసుకోవడానికి రావాల్సి వచ్చిందని రేవతి కూడా బాధపడుతుంది.
త్వరగా పాపనో, బాబునో కని ఈ ఆనందాన్ని ఇంకా పెంచండని ప్రేమ, ధీరజ్ చేతులు కలిపి శారదాంబ వెళ్లిపోతుంది. ధీరజ్ చేతిని ప్రేమ వదలదు. ఎలాగోలా ధీరజ్ చేతిని వదిలించుకుని నీళ్లతో కడుక్కుంటాడు.
భద్రావతి సీరియస్
{{/usCountry}}త్వరగా పాపనో, బాబునో కని ఈ ఆనందాన్ని ఇంకా పెంచండని ప్రేమ, ధీరజ్ చేతులు కలిపి శారదాంబ వెళ్లిపోతుంది. ధీరజ్ చేతిని ప్రేమ వదలదు. ఎలాగోలా ధీరజ్ చేతిని వదిలించుకుని నీళ్లతో కడుక్కుంటాడు.
భద్రావతి సీరియస్
{{/usCountry}}ఎక్కడికి వెళ్లొస్తున్నారని రేవతి, శారదాంబను భద్రావతి గద్దించి అడుగుతుంది. కూరగాయలకు వెళ్లొచ్చామని అబద్దం చెప్తారు. కానీ భద్రావతి గట్టిగా అడిగేసరికి ప్రేమను చూసేందుకు వెళ్లామని రేవతి చెప్పేస్తుంది. ఆ గీత దాటొద్దని చెప్తే బుద్ధిలేదా? అని భద్రావతి సీరియస్ అవుతుంది. నా మేనకోడలికి ఎలా ఉందని వెంటనే భద్రావతి టోన్ మారుస్తుంది.
నర్మద ఆలోచన
సీన్ కట్ చేస్తే యాక్సిడెంట్ ఎలా జరిగిందని నర్మద ఆఫీస్ లో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఓ ఫైల్ మీద సైన్ చేస్తుంది. నిజాయతీగా ఉన్నందుకు నర్మదను ఆ వ్యక్తి పొగిడేస్తాడు. దివ్య వచ్చి నర్మదను ఏమైందని అడుగుతుంది. ప్రేమ యాక్సిిడెంట్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆర్టీవోలో లారీ డీటైల్స్, డ్రైవర్ వివరాలు కనుక్కునేందుకు నర్మద ప్రయత్నిస్తుంది.
భాగ్యం ప్లాన్
మరోవైపు ఆ నర్మద మన గురించి కనిపెట్టలేదని భాగ్యం బిల్డప్ ఇస్తుంది. శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం కలిసి నగల షాప్ కు వెళ్తారు. నగలన్నీ వేసుకుని శ్రీవల్లి మురిసిపోతుంది. కూతురిని అమ్మానాన్న తెగ పొగిడేస్తారు. పైసలు ఎన్ని అంటే రూ.20 లక్షలని సేట్ చెప్తాడు. రూ.100 నోటు ఇచ్చి తీసుకోమ్మని ఇడ్లీ బాబాయ్ గొప్పగా చెప్తాడు.
నాతో తమాషాగా ఉందా? అని సేట్ కోప్పడతాడు. తమాషా లేదు, సమోసా లేదు సేట్. మిగతా బ్యాలెన్స్ ఖాతాలో రాసుకోండి. నెల నెల ఈఎంఐలో కడతామని భాగ్యం అంటుంది. మీరు ఎవరో తెలియదని సేట్ అంటే, నా కూతురు రామరాజు పెద్ద కోడలు అని భాగ్యం చెప్తుంది. రామరాజుతో ఓ మాట చెప్తే ఇస్తానని సేట్ అంటాడు.
పుల్ల పెట్టిన శ్రీవల్లి
రామరాజు రెండో కొడుకు, కోడలు రూ.10 లక్షల విలువైన నగలు తాకట్టు పెడితే రూ.20 లక్షలు ఇచ్చారు కదా. మరి రామరాజు చెప్తేనే ఇచ్చారా అని సేట్ ను భాగ్యం ఇరకాటంలో పెడుతుంది. వాళ్లు ఇద్దరు గవర్నెంట్ ఉద్యోగులు కాబట్టి తిరిగి ఇస్తారనే నమ్మకంతో ఇచ్చానని సేట్ అంటాడు. ఆ సాగర్ కు జీతం రూ.50 వేలు, వడ్డీ ఏమో రూ.60 వేలు అని భాగ్యం చెప్తుంది.
శ్రీవల్లి కూడా అలాగే మాట్లాడుతుంది. మీకు వడ్డీ కట్టలేరని, వెళ్లి రామరాజును అడగండని సేట్ కు చెప్పి రెచ్చగొడతారు. ఇక్కడ మనం అంటించిన అగ్గిపుల్ల అక్కడ నర్మద కాపురాన్ని కాల్చేస్తుందని భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్ తెగ సంబరపడిపోతారు.
ప్రేమగా సాంగ్
మరోవైపు ప్రేమగా సేవలు చేస్తున్న ధీరజ్ ను చూసి ప్రేమ మురిసిపోతుంది. ‘సమయానికి తగు సేవలు చేయని’ అనే సాంగ్ ను ఫోన్లో ప్రేమ సాంగ్ ప్లే చేస్తుంది. ప్రేమ కూడా పాట అందుకుంటుంది. గానకోకిల అన్నట్లు తెగ సింగుతుంది కాకి అని ధీరజ్ కౌంటర్ వేస్తాడు. ఇక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.