Illu Illalu Pillalu April 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రెగ్నెంట్ అని చెప్పి శ్రీవల్లి తిరిగి రామరాజు ఇంట్లో అడుగుపెడుతుంది. కానీ జాగ్రత్త అని అత్త, తోడి కోడళ్లు గట్టిగానే చెప్తారు. మరోవైపు భాగ్యం మాత్రం మారదు. పెత్తనం తన కూతురిదే కావాలని రెచ్చగొడుతూనే ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో చూద్దాం.
రామరాజు ఇంట్లో ఫంక్షన్

ఎత్తుకుని పెంచిన పెద్ద అల్లుడు కూడా తండ్రి అవుతున్నాడు, కానీ తనకు మాత్రం పెళ్లి యోగం లేదా అని తిరుపతి తెగ ఫీల్ అయిపోతాడు. పనులన్నీ త్వరగా చేయమని తిరుపతికి చెప్తాడు రామరాజు. తల్లి కాబోతున్న నా పెద్ద కోడలిని దీవించేందుకు ఊరంతా వస్తున్నారని చెప్తాడు రామరాజు. మరోవైపు ఏ చీర కట్టుకోవాలో తెలియక శ్రీవల్లి కన్ఫ్యూజ్ అవుతుంది.
వల్లికి చీర, నగలు
నేను నెల తప్పినందుకు ఈవెనింగ్ గ్రాండ్ గా ఫక్షన్ చేస్తున్నారు కదా. అందుకే గ్రాండ్ గా రెడీ కావాలని అనుకుంటున్నా. ఇందులో ఏ చీర కట్టుకోమంటారు అని వల్లి అడుగుతుంది. ఇందులో ఏ చీర కాదు అని అమూల్యతో మరో చీర తెప్పిస్తుంది వేదవతి. ఈ పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకొని రెడీ అవమని వల్లికి చెప్తుంది.
సీమంతంలో ఇంకా
ఈ నగలు రోల్డ్ గోల్డా అండీ అని అత్తను వల్లి అడిగేసరికి వేదవతి షాక్ అవుతుంది. ఇవన్నీ నిజమైన బంగారమేనని చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదిన అని భాగ్యం అడుగుతుంది. కుటుంబానికి ఇది గొప్ప క్షణం. నా కోడలు నన్ను తాతను చేయబోతుంది. సీమంతం ఫంక్షన్ లో నగలతో ముంచెత్తుతామని రామరాజు సంతోషంగా చెప్తాడు.
భాగ్యం కుట్ర
అసలు విషయం తెలిస్తే పరిస్థితి ఏంటీ అని భాగ్యం అనుకుంటుంది. డాక్టర్ కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విషయాన్ని భాగ్యం గుర్తు చేసుకుంటుంది. నా కూతురు కాపురం నిలబడాలంటే నా కూతురు నెల తప్పిందని చెప్పాలని డాక్టర్ ను భాగ్యం ప్రాధేయపడుతుంది. దీన్ని తలుచుకుని భాగ్యం కంగారు పడుతుంది. కడుపు అబద్ధం అని తెలిస్తే రేప్పొద్దున మామూలుగా ఉండదని అనుకుంటుంది.
{{/usCountry}}అసలు విషయం తెలిస్తే పరిస్థితి ఏంటీ అని భాగ్యం అనుకుంటుంది. డాక్టర్ కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విషయాన్ని భాగ్యం గుర్తు చేసుకుంటుంది. నా కూతురు కాపురం నిలబడాలంటే నా కూతురు నెల తప్పిందని చెప్పాలని డాక్టర్ ను భాగ్యం ప్రాధేయపడుతుంది. దీన్ని తలుచుకుని భాగ్యం కంగారు పడుతుంది. కడుపు అబద్ధం అని తెలిస్తే రేప్పొద్దున మామూలుగా ఉండదని అనుకుంటుంది.
{{/usCountry}}భాగ్యాన్ని చూసి నర్మదకు అనుమానం కలుగుతుంది. నా కూతురిపై చూపిస్తున్న ప్రేమకు ఆనందంగా ఉందని భాగ్యం కవర్ చేస్తుంది.
మారిపోయిన ప్రేమ
సీరియల్ లో ప్రేమ మారిపోతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న లావణ్య సీరియల్ నుంచి తప్పుకొంది. ఆమె ప్లేస్ లోకి కొత్త హీరోయిన్ వచ్చింది. బల్లి మీద పడిందని ప్రేమ అందరినీ కంగారు పెట్టేస్తుంది. బల్లికి భయపడతావేంటీ చెల్లాయ్ అని వల్లి అంటుంది. బల్లిని అడ్డుపెట్టుకుని వల్లిపై నర్మద, వేదవతి కౌంటర్లు వేస్తారు. ఆ డైలాగ్ లన్నీ మనకేనండి బాబు అని భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ అంటాడు.
ప్రేమ సిగ్గు
బల్లి మీద పడితే కంచికి వెళ్లొచ్చిన వాళ్లను ముట్టుకోవాలని చెప్తారు, మరి ఇప్పుడు ఎలా అని రామరాజు ఆలోచిస్తాడు. అప్పుడే నేనున్నా కదా అని శారదాంబ ఎంట్రీ ఇస్తుంది. ప్రేమను హత్తుకున్న శారదాంబ.. నువ్వు ఎప్పుడు నెల తప్పుతున్నావని అడుగుతుంది. మీ మనవడిని అడగమని ప్రేమ సిగ్గు పడుతుంది.
కామాక్షి హడావుడి
కామాక్షి తన భర్తను లాక్కూంటూ స్పీడ్ గా వచ్చేస్తుంది. రాగానే హడావుడి చేసేస్తుంది. పాపం బావ అని చందు, ధీరజ్, సాగర్ అనుకుంటారు. మామూలుగా అయితే పుట్టింటికి వస్తే 9 గంటల వరకు లేవవు. అటు ఉన్న పుల్ల ఇటు పెట్టవు. ఇప్పుడేంటీ హడావుడి చేసేస్తున్నావని కామాక్షితో ప్రేమ అంటుంది. నర్మద కూడా కౌంటర్ వేస్తుంది.
నర్మద నగలు
అప్పుడే నర్మద అమ్మానాన్న వస్తారు. వాళ్లను చూసి రామరాజు మాట్లాడకుండా సీరియస్ గా ఉంటాడు. మామయ్య వాళ్లను నేనే పిలిచా నాన్న. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటానికి నర్మద వదిన కూడా కారణం కదా. వీళ్లు వస్తే వదిన హ్యాపీగా ఉంటుంది కదా అని ధీరజ్ అంటాడు. మీ అమ్మానాన్నలకు మర్యాదల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోండని నర్మదకు రామరాజు చెప్తాడు.
నర్మద మెడలో ఉన్న నగలు ప్రేమవా? అని తల్లి అడుగుతుంది. పిన్ని.. నాకు, నర్మద అక్కకు మధ్య తేడా ఉండదు. అవి నా నగలు కాదు మా నగలు అని ప్రేమ చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.