...
...
Next Story

Illu Illalu Pillalu April 29 Episode: శ్రీవల్లి గుట్టు రట్టు చేసేలా ఇడ్లీ బాబాయ్-ఆస్తిలో వాటా అడగమని ప్రసాద్ రావు చిచ్చు

Illu Illalu Pillalu April 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో ఏడుస్తున్న కామాక్షికి తన చైన్ ఇస్తాడు రామరాజు. వల్లి కడుపులో బిడ్డ లేదని చెప్పేందుకు ఇడ్లీ బాబాయ్ ప్రయత్నిస్తాడు. మరోవైపు ఆస్తిలో వాటా అడగమని సాగర్ కు చెప్తాడు ప్రసాద్ రావు.

Published on: Apr 29, 2026, 08:10:22 IST
Advertisement

Illu Illalu Pillalu April 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి ప్రెగ్నెన్సీ అబద్ధమని తెలిసిన ఇడ్లీ బాబాయ్ వణికిపోతాడు. ఇదంతా డ్రామా అని భాగ్యం చెప్పేస్తుంది. మరోవైపు శ్రీవల్లి నెల తప్పిందని రామరాజు గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో చూద్దాం.

కామాక్షి ఏడుపు

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఓ పక్కన కూర్చుని కామాక్షి ఏడుస్తుంటుంది. అంటే అన్నానంటావ్ కానీ నీకసలు బుద్ధి ఉందా? శుభమా అని ఫంక్షన్ జరుగుతుంటే ఏడుపు ఏంటే అని వేదవతి సీరియస్ అవుతుంది. పెద్దమ్మాయి ఏమైందని రామరాజు అడుగుతాడు. ఈ ఇంట్లో నాకు విలువ లేదని కామాక్షి ఏడుస్తుంది. అది దేనికో టెండర్ పెట్టిందని వేదవతి అంటుంది.

బంగారానికి ఎసరు

ఇంటి ఆడపడుచు సంతోషం కోసం తులమో, ఫలమో ఇవ్వకపోతే ఎలా నాన్న అని అని కామాక్షి అసలు పాయింట్ చెప్తుంది. నేను నగల కోసం, డబ్బు కోసం పీడించే రాక్షసినని అందరూ దారుణంగా మాట్లాడుతున్నారని కామాక్షి అంటుంది. ఇది నిజమే కదా అని వేదవతి కోపంగా అంటుంది. వెళ్లిపోతానని కామాక్షి డ్రామా ఆడుతుంది. పెద్దమ్మాయ్ ఆగమ్మా, అడగకుండానే ఇద్దామనుకున్నా. ఇంతలోనే ఏడ్చేశావని రామరాజు అనడంతో కామాక్షి ముఖం వెలిగిపోతుంది.

రామరాజు చైన్

రామరాజు తన మెడలోని చైన్ తీసి కామాక్షికి ఇస్తాడు. భలే ప్లాన్ చేశావ్ వదిన, బాగానే గిట్టుబాటు అయింది కదా అని ప్రేమ, నర్మద వెటకారంగా మాట్లాడతారు. కామాక్షి వెళ్లి శ్రీవల్లికి బొట్టు పెడుతుంది. నీకు బిడ్డ పుట్టిన రోజు నాకు రవ్వల నెక్లెస్ పెట్టాలని కామాక్షి అడుగుతుంది. అందరూ తల కొట్టుకుంటారు.

ఇడ్లీ డైలాగ్

సాగర్ ను పక్కకు పిలుచుకుని ప్రసాద్ రావు మాట్లాడతాడు. తాకట్టు పెట్టిన మా అమ్మాయి నగలు ఇంకా తేలేదా అని సాగర్ ను అడుగుతాడు. అమౌంట్ ఎక్కువ కదా అని సాగర్ చెప్తే, మీ నాన్నను అడగొచ్చు కదా అని ప్రసాద్ అంటాడు. జాబ్ కొనుక్కున్నానని అవమానిస్తున్నాడు, ఆయన రూ.20 లక్షలు ఇవ్వడని సాగర్ చెప్తాడు. ఆస్తిలో నీ వాటా నీకు ఇవ్వమను అని ప్రసాద్ అనడంతో సాగర్ షాక్ అవుతాడు.

తాకట్టు పెట్టిన నా కూతురు నగలు విడిపించడానికి ఇప్పుడున్న మార్గం ఆస్తి వాటా అడగడమేనని ప్రసాద్ మళ్లీ చెప్తాడు. అప్పుడే నర్మద వస్తుంది. ఇంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నామని సాగర్ కవర్ చేస్తాడు.

కవలలు

మరోవైపు శ్రీవల్లిని వేదవతి ఏమో మగ పిల్లాడిని, రామరాజు ఏమో ఆడపిల్లను కనమని గొడవ పెట్టుకుంటారు. ఇదంతా చూస్తూ ఇడ్లీ బాబాయ్ తల కొట్టుకుంటాడు. ఇద్దరు కలిసి కవలలు కనమంటే సరిపోతుంది కదా అని శారదాంబ అనేసరికి అందరూ నవ్వేస్తారు. మందు కొట్టేసి, నిజాన్ని అందరి ముందు బద్దలు కొట్టాల్సిందేనని ఇడ్లీ బాబాయ్ అనుకుంటాడు.

భాస్కర్ కు రిక్వెస్ట్

ఫైనాన్స్ ష్యూరిటీ కోసం మీ బావను సంతకం పెట్టమని అడగమని ధీరజ్ తో ప్రేమ అంటుంది. కానీ అది మా అక్కకు ఇష్టం లేదని ధీరజ్ అంటాడు. మీ అక్కకు తెలియకుండా సంతకం పెట్టమని అడగమని ప్రేమ చెప్తుంది. అన్నయ్యను నేనే అడుగుతా అని భాస్కర్ దగ్గరకు ప్రేమ వెళ్తుంది. సొంతంగా ట్రావెల్స్ పెట్టాలన్నది ధీరజ్ ఆలోచన. కారు డౌన్ పేమెంట్ కోసం ష్యూరిటీ సంతకం పెట్టగలరా, ప్లీజ్ అని భాస్కర్ ను ప్రేమ అడుగుతుంది.

నువ్వు ఇంతలా బతిమిలాడాలా? ఈ విషయం గురించి నేనే ధీరజ్ తో మాట్లాడదామని అనుకున్నా. డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? మీ అక్కకు తెలియకుండా సంతకం పెట్టేస్తానని భాస్కర్ అంటాడు. ఇదంతా దొంగ చాటుగా భాగ్యం వింటుంది. అప్పుడే కిక్ లేదని ధీరజ్ దగ్గరకు తిరుపతి వస్తాడు. అందరు కలిసి ఫ్యామిలీ పార్టీ అంటూ డ్యాన్స్ చేస్తారు.

వల్లిపై కోపం

ఇడ్లీ బాబాయ్, తిరుపతి కలిసి మందు తాగుతారు. ఇడ్లీ బాబాయ్ గుటగుట పెగ్గులు లేపేస్తాడు. సంతకం కోసం భాస్కర్ ను ధీరజ్ లోపలికి తీసుకెళ్తాడు. మరోవైపు స్టేజీ మీద వల్లి గంతులేస్తుంటే వేదవతి కోప్పడుతుంది. కడుపుతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అప్పుడే ఇడ్లీ బాబాయ్ ఆవేశంతో వస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe